యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన‌ట్టే!

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేసిన‌ట్టే! సంక్షేమ ప‌థ‌కాలు అంటే అవేమీ ఆకాశం నుంచి ఊడిప‌డ‌లేదు. అవి తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార మెనిఫెస్టోలోనివే! అధికారం కోసం చంద్ర‌బాబు నాయుడు ఎన‌లేని హామీలు ఇచ్చారు. వాటి అమ‌లుకు అడగ‌డానికి ముందే చంద్ర‌బాబు నాయుడు వాటిని చూస్తేనే త‌న‌కు భ‌య‌మేస్తోంద‌ని అంటున్నారు!

అయితే ఈ భ‌యం అనేది ఇప్పుడే మొద‌లైందా లేక ఎన్నికల ముందు హామీలు ఇచ్చేనాడు ఈ భ‌యం లేక‌పోయిందా అనేది ఆయ‌నే చెప్పాలి. మాటెత్తితే త‌న‌ది 40 యేళ్ల రాజ‌కీయ అనుభవం అని చంద్ర‌బాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ అనుభవం ఏమైంది? ఈ హామీలు ఇచ్చే ముందు ఆ అనుభ‌వం చంద్ర‌బాబుకు లేదా! అమ‌లు చేయాలంటేనే భ‌య‌ప‌డాల‌నేంత స్థాయి హామీలు త‌ను ఇచ్చాన‌నే విష‌యం ఆయ‌న‌కు తెలియ‌నిదా! అనేది ఇప్పుడు ఉత్ప‌న్నం అయ్యే ప్ర‌శ్న‌!

తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చాకా ఇప్ప‌టి వ‌ర‌కూ అమ‌లు చేసిన హామీ అంటే.. వృద్ధాప్య పెన్ష‌న్లు మాత్ర‌మే! మిగ‌తా వాటి విష‌యంలో అదిగో ఇదిగో అంటున్నారు, కొన్నింటి విష‌యంలో అయితే పూర్తిగా చేతులు ఎత్తేశారు! అందులో కీల‌క‌మైన‌ది వ్య‌వ‌సాయ‌దారుల‌కు ఇచ్చిన హామీలు.

త‌న‌కు అధికారం ఇస్తే రైతుల‌కు ప్ర‌తి యేటా పెట్టుబ‌డికి 20 వేల రూపాయ‌లు ఇస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల హామీలో ప్ర‌క‌టించారు! చంద్ర‌బాబు అదృష్టం ఏమిటంటే.. ఆయ‌న రుణ‌మాఫీ హామీని ఇవ్వ‌లేదు! ఎన్నిక‌ల స‌మయంలో చంద్ర‌బాబు నాయుడు రుణ‌మాఫీ హామీని ఇస్తానంటూ ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రిగింది.

ఒక‌వేళ జ‌గ‌న్ ఆ ప్ర‌క‌ట‌న చేసి ఉంటే.. చంద్ర‌బాబు ఆ హామీని కూడా ఇచ్చారు. త‌నకు తిరిగి అధికారం ఇస్తే.. ప్ర‌స్తుత సంక్షేమ ప‌థ‌కాల‌నే కొన‌సాగిస్తామ‌ని, కొత్త‌గా ఏమీ చేయ‌మ‌న్న‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌చారం సాగితే, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం ఎన‌లేని లిస్టుతో సాగింది! ఆ హామీల‌ను చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ప్ర‌జ‌ల‌కు అనేక మార్లు చ‌దివి వినిపించారు! ఇప్పుడు ఆ హామీల‌ను చూస్తే చంద్ర‌బాబుకే భ‌య‌మేస్తోంద‌ట‌!

అమ్మ‌కు వంద‌నం అంటూ.. చ‌దువుకునే ప్ర‌తి వారి త‌ల్లి ఖాతాలోకి 15 వేల రూపాయ‌ల చొప్పున అంటూ గ‌ట్టిగా ప్ర‌చారం చేశారు! తెలుగుదేశం పార్టీకి నిస్సందేహంగా ఆ హామీ కొత్త ఓట్ల‌ను తెచ్చిపెట్టింది. జ‌గ‌న్ అమ్మ ఒడి అంటూ ఒక‌రికే సాయం అంటే, చంద్ర‌బాబు నాయుడు ఇంట్లో ఎంత‌మంది పిల్ల‌లుంటే అంత‌మందికీ అన్నారు. త‌ను కుటుంబ నియంత్ర‌ణ‌ను ప్రమోట్ చేశానంటూ చంద్ర‌బాబు నాయుడు చెప్పుకున్నారు ఒక ద‌శ‌లో. అయితే త‌న హామీల విష‌యంలో మాత్రం నియంత్ర‌ణ ఉండ‌ద‌న్న‌ట్టుగా అప్పుడు చంద్ర‌బాబు రెచ్చిపోయారు.

ఇప్పుడు డేటా లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికి అయితే వ‌చ్చే యేడాదికి దాన్ని వాయిదా వేసిన‌ట్టుగా ఉన్నారు. అయితే వ‌చ్చే ఏడాదికి అయినా అది సాధ్యం అయ్యే ప‌నేనా? ఇంట్లో స‌గ‌టున ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌నుకున్నా.. ఇప్పుడు కేటాయించిన బ‌డ్జెట్ కు రెట్టింపు కావాలి! మ‌రి దానికి బ‌డ్జెట్ కావాలంటే మ‌రేదో క‌ట్ చేయాలి. అలాగ‌ని సంప‌ద సృష్టి అప్పుడే జ‌రిగిపోయిందా.. అంటే, నెలా నెలా వేల కోట్ల రూపాయ‌ల అప్పు మీదే బండి న‌డుస్తూ ఉంది! దీంతో మొద‌లుపెడితే.. ఇంకా స‌వాల‌క్ష హామీల అమ‌లు ఇంకా ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది!

మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఆగ‌స్టు 15 నుంచి ప్రారంభం అని ప్ర‌క‌టించారు! అయితే ఆ ప‌థ‌కానికి డైరెక్టుగా నిధుల కేటాయింపు అవ‌స‌రం లేదు! కాబట్టి.. దాన్ని పేరుకు ప్రారంభించేయ‌డ‌మే! అయితే దాని లోతు దిగితే కానీ తెలియ‌దు! అస‌లే ఆర్టీసీ న‌ష్టాల గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌థ‌కం ఆరంభించేస్తే.. ఆడ‌వాళ్లు దాన్ని ఎడాపెడా వాడుకుంటే, కొన్ని నెల‌ల‌కు కానీ.. దాని ప‌ర్య‌వ‌స‌నాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం అవుతుంది. ఆల్రెడీ ఆ ప‌థ‌కాన్ని అమ‌లు పెడుతున్న తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లు ఏడుస్తున్నాయి! ఆ ప‌థకం అక్క‌డి ప్ర‌భుత్వాల ఇమేజ్ ను పెంచ‌డాన్ని మించి.. త‌గ్గించి వేస్తూ ఉన్నాయ‌నేది వాస్త‌వం!

మ‌హిళ‌ల‌కు ఉచిత ప్రయాణ అవ‌కాశం అనేది బెంగ‌ళూరు, హైద‌రాబాద్ లలో ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడుకునే వారి అస‌హ‌నానికి కార‌ణం అవుతూ ఉంది. టికెట్ కొని బ‌స్సు ఎక్కే మ‌గ‌వాళ్లు.. అక్క‌డి దృశ్యాల‌ను చూసి విస్తుపోతూ ఉన్నారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల బ‌స్సులు ఎక్కే మ‌హిళ‌ల శాతం గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ భారం ఆర్టీసీ బ‌స్సుల మీద‌, ఇంధ‌న వ్య‌యం మీద ప‌డుతూ ఉంది.

తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో కూడా ఆర్టీసీ ప‌రిస్థితి ఏమీ బాగోలేదు. వీలైతే పూర్తిగా ప్రైవేట్ కు అప్ప‌గించేసి చేతులు దులుపుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైన స్థితి. అలాంటి ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్లు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం అంటూ సంచ‌ల‌న హామీని ఇచ్చారు. వారికి ఏదో క‌లిసి వ‌చ్చి క‌ర్ణాట‌క‌లో అధికారం ద‌క్కింది. దానికి కార‌ణం ఆ హామీనే అన్న‌ట్టుగా తెలంగాణ‌లో ప్ర‌క‌టించారు. అక్క‌డా కాలం క‌లిసి రావ‌డంతో.. ఇలాంటి కాపీ ట్రెండ్ ల‌ను ప‌ట్టుకునే చంద్ర‌బాబు నాయుడు దాన్నీ నెత్తి మీద‌కు తెచ్చుకున్నారు!

తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల‌తో పోల్చినా ఇప్పుడు ఏపీలో రూర‌ల్ ఏరియా ఎక్కువ‌! న‌గ‌రాల్లో ఆడ‌వాళ్లు ఉచితంగా ప్ర‌యాణించినా.. వారు ఏవో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, దాని వ‌ల్ల ఏదో ప్ర‌యోజ‌నం అనుకోవ‌చ్చు. అయితే చెప్పుకోవ‌డానికి పారిశ్రామికాభివృద్ధి ఉన్న న‌గ‌ర‌మేలేని ఏపీలో.. ఈ ప‌థ‌కం వ‌ల్ల ఊరికే తిరిగే వాళ్లే త‌ప్ప ఉప‌యోగం అయితే శూన్యం! ఇప్ప‌టి వ‌ర‌కూ ఫంక్ష‌న్ల కోసం, దేవాల‌యాల సంద‌ర్శ‌న కోసం, బంధువుల ఊళ్ల‌కు తిరిగే ఆడ‌వాళ్ల టికెట్ రుసుం కూడా ఇక నుంచి త‌గ్గిపోతే ఏపీఎస్ ఆర్టీసీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతుంది! దీన్ని పూడ్చ‌డానికి ఆర్టీసీ టికెట్ రేటునే పెంచుతారా, లేక క‌ర్ణాట‌క మాదికి పెట్రో ధ‌ర‌ల‌ను రాష్ట్రం స్థాయిలో పెంచుతారో చంద్ర‌బాబు చూడాల్సి ఉంది!

ఇక అన్నాక్యాంటీన్ల‌ను తెరుస్తార‌ట త్వ‌ర‌లోనే. తిండి కోసం ఇలాంటి ఉచిత క్యాంటీన్ల‌ను తెరిస్తే వెళ్లే వారు ఉంటారేమో కానీ, వీటి కోసం ఎదురుచూసేది ఎంత‌మంది అనేది ప్ర‌శ్న‌! అయితే ఇలాంటి ప‌థ‌కం అమ‌లులో నిర్వాహ‌కులు దండుకునే అవ‌కాశాలు కూడా గ‌ట్టిగా ఉంటాయి! కాబ‌ట్టి.. తెలుగు త‌మ్ముళ్ల కాంట్రాక్టుల కోసం ఇది ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌క‌మే!

ఇలా చంద్ర‌బాబు అమ‌లు చేయాల్సిన, అమ‌లు చేస్తానంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన ప‌థ‌కాలు బోలెడున్నాయి! అయితే రైతుల విష‌యంలో పూర్తిగా చేతులు ఎత్తేయ‌డాన్ని ఆ వ‌ర్గం గ‌మ‌నిస్తూనే ఉంది. జ‌గ‌న్ ఆరు వేల ఐదు వంద‌లు ఇచ్చిన‌ప్పుడే రైతుల్లో చాలా అస‌హ‌నం ఉండేది! అందులో మోడీ రెండు వేల రూపాయ‌లు ఏదో ఉంద‌ని, జ‌గ‌న్ త‌మ‌కు ఇస్తున్న‌ది చాలా త‌క్కువ అనే అస‌హ‌నం రైతాంగంలో ఉండింది. అది ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రతిబింబించింది కూడా! ఏడాదికి ఏడెనిమిది వేలు ఇస్తూ త‌మ‌కు జ‌గ‌న్ ఎలాంటి ఉప‌యుక్తంగా నిల‌వ‌డం లేదంటూ రైతులు బాగా అస‌హ‌నంతో స్పందించేవారు ఆ ఐదేళ్ల‌లోనే!

చంద్ర‌బాబు దాన్నే ఇర‌వై వేల రూపాయ‌ల‌కు పెంచుతానంటూ ఆర్బాటంగా ప్ర‌క‌టించుకున్నారు. అయితే జూన్ లోనే అందాల్సిన పెట్టుబ‌డి సాయం ఇప్ప‌టి వ‌ర‌కూ ఊసు లేదు. అస‌లు దాని క‌థే ఎత్త‌డం లేదు. ఈ ఏడాదికి లేద‌నో, వ‌చ్చే ఏడాది అనో మాట కూడా లేదు! అదేమంటే భ‌య‌మేస్తోందంటూ చంద్ర‌బాబు నాయుడే ప్ర‌క‌టించుకోవ‌డంతో రైతుల‌కు అయితే ఈ సందేశం గ‌ట్టిగానే వెళ్లింది! చంద్ర‌బాబునాయుడు త‌మ‌ను వంచించ‌డం కొత్త కాదు అనే భావ‌న కూడా రైతుల్లో ఉంది! మిగ‌తా వ‌ర్గంలో పుట్టే అస‌హ‌నం వేరు, రైతుల్లో పుట్టే అస‌హ‌నం వేరే! రైతులు అయాచితంగా ఆశించ‌రు. అయితే చెప్పిన‌దాన్ని చేయాల‌నే త‌త్వం రైతుల్లో ఉంటుంది.

జ‌గ‌న్ ఎంతో కొంత ఇస్తేనే.. బాగా అస‌హ‌నం క‌నిపించింది. అందులో మోడీది ఇంత‌, జ‌గ‌న్ ది ఇంత అంటూ లెక్క‌గ‌ట్టేవారు మెజారిటీ రైతాంగం. ఖాళీ స‌మ‌యాల్లో వారు ఇలాంటి చ‌ర్చ‌లు బ్ర‌హ్మాండంగా చేస్తారు ఊళ్ల ర‌చ్చ‌బండ‌ల మీద‌. జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త‌తోనో, చంద్ర‌బాబు మీద సానుకూల‌త‌తోనో ఓటేసిన వారు కూడా.. ఆ ఇర‌వై వేల‌ను చంద్ర‌బాబు ఇంకా ఇస్తార‌నే న‌మ్మ‌కంతోనే ఉన్నారు! అయితే చంద్ర‌బాబు ఆ ఊసే ఎత్త‌డం లేదు. రైతులు గ‌మ‌నిస్తుంటార‌ని చంద్ర‌బాబుకు తెలిసే ఉండాలి!

అయితే.. తెలుగుదేశం పార్టీ ఆ హామీల విష‌యంలో విరుగుడు మంత్రాన్ని ప‌ఠిస్తోంది. అస‌లు సంక్షేమ‌మే అక్క‌ర్లేద‌ని, సంక్షేమ ప‌థ‌కాలు దండ‌గ అని, వాటిని అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. రాష్ట్రం అభివృద్ధి అని, అప్పులు అని ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవి మాట్లాడాల్సింది ఇప్పుడు కాదు! ఒక‌వేళ సంక్షేమ ర‌హిత‌మే చంద్ర‌బాబు అజెండా అయితే.. దాన్ని ఎన్నిక‌ల ముందే ప్ర‌క‌టించాల్సింది.

త‌మ‌కు అధికారం ఇస్తే సంక్షేమాన్ని ప‌క్క‌న పెట్టి.. అభివృద్ధి మీదే దృష్టి సారిస్తామ‌ని… ప్ర‌క‌టించాల్సింది! అలా చెప్పి ప్ర‌జ‌ల తీర్పు కోరి.. అన్ని ప‌థ‌కాల‌కూ ఫుల్ స్టాప్ పెట్టేసి ఉన్నా అడిగే వారు ఉండ‌రు! ఎన్నిక‌ల ముందేమో.. దేశ బ‌డ్జెట్ కు స‌రిస‌మాన‌మైన స్థాయి హామీలు ఇచ్చి, ఇప్పుడు వేరే నీతులు చెబితే జ‌నాలు ఒంగోబెట్టి తంతారు! జ‌గ‌న్ అప్పులు చేశాడు, త‌ను సంప‌ద సృష్టానంటూ చెప్పుకున్న‌ది కూడా చంద్ర‌బాబే.

రెండు నెల‌ల్లో సృష్టించిన సంప‌ద ఎంతో కూడా జ‌నాల‌కు క్లారిటీ ఇవ్వాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అయ్యింది. చంద్ర‌బాబు హామీల అమ‌లే గ‌నుక మొద‌లుపెడితే.. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత ఊబిలో కూరుకుపోవ‌డం కూడా మ‌రింత తీవ్ర‌మే అవుతుంది త‌ప్ప మ‌రోటేమీ జ‌ర‌గ‌దు. అయినా.. త‌న అనుభ‌వం అని, త‌నో విజ‌న‌రీ అని, సంప‌ద సృష్టి అని, త‌ను చంద్ర‌బాబు అని చంద్ర‌బాబు గ‌ట్టిగా చెప్పుకున్నారు! ఆయ‌న వంగ‌మాగ‌ధులు కూడా అదే చెప్పారు! ఇప్పుడు బీద అరుపులు అరిస్తే అంత‌కు మించిన నీఛం కూడా ఉండ‌దు!

ఏపీలో ఇప్పుడిప్పుడే ఈ హీట్ మొద‌ల‌వుతోంది. హ‌నీమూన్ పిరియ‌డ్ ముగుస్తోంది. ఎదురుదాడితో త‌మ్ముళ్లు కూడా ఎక్కువ సేపు బండి లాక్కురాలేరు! అలాంటి ప‌రిస్థితి వ‌స్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్యారాచూట్ వేసుకు బ‌య‌ట‌ప‌డినా ఆశ్చ‌ర్యం లేదు!

87 Replies to “యేరు దాటాకా బోడి మ‌ల్ల‌న్న స‌రిపోద్దా చంద్ర‌బాబూ!”

  1. ఒరేయ్ గ్రేట్ ఆంధ్ర ని తీసి జగన్ గాడి సంక నాకేవాడిని అని పెట్టుకో నీ పేపర్ పేరు. జగన్ చేసిన విధ్వంసం ఎలా ఉందొ నాతో రా చూపిస్తా ఒకసారి వ్యవస్థలు ఎలా పడిపోయాయా అని రా గజ్జి గా ఎక్కడో హైదరాబాద్ లో ఉంది జగన్ గాడికి భజన చెయ్యడం కాదు

    1. After 2-3 years, will government implementarion of schemes clear the dues for prior years including the interest for the time such schemes were not implemented?

  2. మరి ఇవి అన్ని ఎమిటి గురువిందా??

    .

    1. సంపూర్ణ మధ్య నిషేధం

    2. CPS రద్దు

    3. మెగా DSC

    4. 25 ల.-క్ష.-ల పక్కా ఇల్లు

    5. ప్రతి సంవత్సరం దరల స్థిరీకరణ నిది!

    6. ప్రతి సంవత్సరం జాబ్ కాలెండర్

    7. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ

    8. పోలవరం

    9. రైల్వే జోన్

    10. కడప ఉక్కు ఫ్యాక్టరీ

    11. నిత్యావసర ధరలు పూర్తిగా తగ్గించేస్తా

    12. ప్రతి పిల్లవాడికి అమ్మ వడి

    13. అమరావతి రాజధాని

    14. ప్రత్యేక హోదా (సంజీవిని)

    15. పెన్షన్ మూడు వేలు

    16. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తాము

    17. 45 ఏళ్ళు దాటిది చాలు sc, st, bc లకు పెన్షన్

    18. దీర్ఘ కాళికా వ్యాధులతో బాధపడేవారికి 10 వేలు పెన్షన్!

    19. ప్రతి నియోజికవర్గం లో కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

    20. ప్రభుత్వం లో కాలీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ!

      1. Commenting about non-implementation of few promisess made by previous government does not give the current government a way out from fulfilling their promises.

        Current government is accountable tonpeople and not to YCP or another political party.

        So, no point in diverting the issue blaming each other and think about answering people or else get ready to get the same 11 in 2029.

      2. Commenting about non-implementation of few promisess made by previous government does not give the current government a way out from fulfilling their promises.

        Current government is accountable tonpeople and not to YCP or another political party.

        So, no point in diverting the issues by blaming each other and instead think about fulfilling promises made to people.

      3. Just because YCP did not implement promises does not give a way out to kootami government. By making promises within manifesto, Kootami parties and are accountable to people and not YCP.

        Hence do not worry about what YCP did or did not do and instead focusnon what kootami will or will not do.

  3. అన్న క్యాంటీన్ ల నుండి దందుకుంటారా? మీ విశ్లేషణ ఎంత దారుణం. 5rs కి భోజనం పెడితే ఎంత మిగులుతుంది.ఒక పార్టీ వాయిస్ గా పనిచేయండి పర్లేదు.కానీ ఇంత దారుణమైన విశ్లేషణ. కనీసం కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వరా?జగన్ సిఎం అయ్యాక అమ్మ వొడి ఎప్పుడు స్టార్ట్ చేశాడో ఒక సారి చెక్ చేసుకోండి.ఉన్న ఆర్థిక వనరులన్నీ సమకూర్చుకోవాలి.కొంత టైం ఇచ్చి అప్పుడు ఇలాంటి విశ్లేషణలు చెయ్యండి.

    1. The question here is not about the time it takes to implement a scheme. The question here is about the points being made in assembly and the comments made by leaders and supporters which is giving credence to the arguments that government is looking for ways to retract from the promises made within manifesto. These must be addressed.

      Also, implementation of schemes like free sand has made the current government a laughing stock when they are charging fees which in some areas exceed the price set by previous government.

  4. చంద్రబాబు ఇవ్వకపోయినా చెప్పిన హామీలు అమలు చేయకపోయినా సంపద సృష్టి జరకపోయినా గ్రాఫిక్స్ ఇంకో 5 ఏళ్ళు చూపించిన ఆంధ్ర లో జనాలకి పెద్దగా బాధ ఉండదు. జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని చూపించి పచ్చి నిజాలు చెప్తే అస్సలు నచ్చదు. ఆంధ్ర వాళ్ళకి ఆశ బారేడు పీక సన్నము. వాళ్ళని అలా గ్రాఫిక్స్ లో అబద్దలలో ముంచి మంచి భ్రమల్లో ఉంచాలి. అదే వాళ్ళకి ఇష్టం.

  5. దిగజారుడు తనానికి కూడా ఒక హద్దు ఉంది . రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసాధారణంగా దిగా జారింది. పథకాలు ప్రజలు కోరుకోవడం లేదు. రహదారులు ఉపాధి మెరుగయిన జీవితం కోరుకుంటున్నారు .ఆర్థిక రంగం పని తీరు మారితే ప్రజలు ఆటోమేటిక్ గా బాగు పడతారు .ఉదాహరణ కు ఇసుక సరిగ్గా అందుబాటు లో ఉంటే నిర్మాణ రంగం డెవలప్ అవుతుంది . తద్వారా చాల మందికి ఉపాధి .దయ చేసి ఉచితాల ప్రచారం ఆపండి. మీరు ఎన్ని విమర్శలు చేసిన ఉపయోగం లేదు .ఉచితాలకు ఓట్లు పడేది లేదు .

    1. ఎలేచ్షన్స్ కు ముందు ఎవడి నోట్లు పెట్టుకున్నావు., ఇదే మాట చెప్పి ఉండాలసింది

      1. ఎలక్షన్స్ కి ముందు కూడా చెప్పామురా ముండమోపి.. నువ్వు చెవుల్లో ఎవడిదో పెట్టుకుని వినలేదు.. మా తప్పు కాదు కదా..

        ఎంతసేపు కాపీ పేస్టులు చేసుకొనే నీకు.. నిజాలు వినలేవు .. చూడలేవు..

        టీడీపీ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్ళలేదు.. అసలు సూపర్ 6 అనేదే ఎవరికీ తెలీదు అని గ్రేట్ ఆంధ్ర లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి.. వెళ్లి చదువుకో..

        1. వీడికి ఆన్సర్ పెట్టి వాడి రేంజ్ ఎందుకు పెంచుతారు…..జఫ్ఫా గాడు ….

      2. ఒరేయ్ మారీచుడు ..మరి ఇదే పేరు ఎందుకు ముందు ఎందుకు పెట్టుకోలేదు

      3. 2019 ముందు అమరావతి రాజధాని అని .. తరువాత మూడు రాజధానులు అన్నప్పుడు నువ్వు ఏమి పెట్టుకున్నావు?

    2. koddirojulagandi…andariki thelusthundi…Uchithalu kaavala leka development kaavala anedi…..Uchithalaki nenu kuda support kaadu.. kaani development anedi state motham jaragali….ee uchithalu anni aapesi, only amaravathi meede dabbulanni pettesthe maathram janalu thiragabadadam khayam…Alagani nenu amaravathi development ki kuda anti kaadu…kabadithe capital anedi dananthata ade develop kaavali. daniki konchem time paduthundi. dabbulanni petti 5yrs lo capital develop cheyalante dabbulu saripovu….As per Jagan’s yesterdays statement – 2014-19 govt chesina appu 4,08,170 kotlu.. 2019-24 govt Chesina appu 3,40,442 kotlu…Amaravathini dabbulu petti develop cheyalante e govt. 10 lakshala kotlu appu cheyavalasi untundi next 5yrs lo…

      1. జగన్ రెడ్డి చెప్పాడని అప్పుల నంబర్స్ చెప్పావు.. బాగానే ఉంది.. నమ్ముతున్నాం..

        మరి అమరావతి కి 10 లక్షల కోట్లు కావాలని ఎవరు చెప్పారు..?

        ఏ సిటీ అయినా నెమ్మదిగానే డెవలప్ అవుతుంది.. మొదటిగా రింగ్ రోడ్లు (ఔటర్, ఇన్నర్)ఎందుకు వేస్తున్నారు..? మెట్రో లు ఎందుకు చేస్తున్నారో తెలుసా.. ఆ చుట్టుపక్కల స్థలాల రేట్లు పెరుగుతాయి.. రిజిస్ట్రేషన్ చార్జెస్ పెరుగుతాయి..

        ఆ సంపాదన సిటీ డెవలప్మెంట్ కోసం వాడుతారు..

        నోటికొచ్చినట్టు 10 లక్షల కోట్లు కావాలని ఇష్టమొచ్చినట్టు వాగారు కాబట్టే.. 11 లో కూర్చున్నారు..

        ఇంకా అవే అవే అబద్ధాలు..

    3. ఉచితాలకు ఓట్లు పడకపోతే మరి ఆ ఉచితాలు ఎందుకు పెట్టారు మేనిఫెస్టో లో ….అవసరానికి మానిఫెస్టోలో పెట్టొచ్చు ..ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి..మాట మార్చొచ్చు …

        1. 2014-2019 లో ఉచితాలు ఇచ్చిన వెన్నుపోటు బాబు కూడా 23 కి పడిపోయాడు కదా

    4. Manifesto says both development and welfare schemes will be implemented. Why are supporters like you asking to choose one now? If this was the case, then it should have been clarified within manifesto during elections.

      Also, if government wants to retreat from their promises, they can disqualify and go for elections with revised manifesto and also should pay the cost of elections from their party funds.

  6. బాబు దొంగ మాటలకు సాక్షము.

    జగన్ గవర్మెంట్ లో 3.4 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇ 3.4 లక్షల కోట్లు అప్పులో 2.4 లక్షల కోట్లు ఒక్క రూపాయ అవినీతి లేకుండా జగన్ నేరుగా ప్రజల అకౌంట్స్ డిపాజిట్ చేసారు.

    గత బాబు గవర్మెంట్ లో ( 2024- 2019 ) 3.0 లక్షల కోట్లు అప్పు చేసారు . మరి 3.0 లక్షల కోట్లు అప్పు ఏమిసేరు. ఎంత మంది పేదలకు పంచి పెట్టారు ?????

    k-batch accounts స్వాహా …k-batch స్వాహా

  7. ..బాబు దొంగ మాటలకు సాక్షము.

    ..జగన్ గవర్మెంట్ లో 3.4 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇ 3.4 లక్షల కోట్లు అప్పులో 2.4 లక్షల కోట్లు ఒక్క రూపాయ అవినీతి లేకుండా జగన్ ..నేరుగా ప్రజల అకౌంట్స్ డిపాజిట్ చేసారు.

    ..గత బాబు గవర్మెంట్ లో ( 2024- 2019 ) 3.0 లక్షల కోట్లు అప్పు చేసారు . మరి 3.0 లక్షల కోట్లు అప్పు ఏమిసేరు. ఎంత మంది పేదలకు ..పంచి పెట్టారు ?????

    ..k-batch accounts స్వాహా …k-batch స్వాహా

  8. బాబు దొంగ మాటలకు సాక్షము.

    జగన్ గవర్మెంట్ లో 3.4 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇ 3.4 లక్షల కోట్లు అప్పులో 2.4 లక్షల కోట్లు ఒక్క రూపాయ అవినీతి లేకుండా జగన్ నేరుగా ప్రజల అకౌంట్స్ డిపాజిట్ చేసారు.

    గత బాబు గవర్మెంట్ లో 3.0 లక్షల కోట్లు అప్పు చేసారు . మరి 3.0 లక్షల కోట్లు అప్పు ఏమిసేరు. ఎంత మంది పేదలకు పంచి పెట్టారు ?????

    k-batch accounts స్వాహా …k-batch స్వాహా

  9. బాబు దొంగ మాటలకు సాక్షము.

    జగన్ గవర్మెంట్ లో 3.4 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇ 3.4 లక్షల కోట్లు అప్పులో 2.4 లక్షల కోట్లు ఒక్క రూపాయ అవినీతి లేకుండా జగన్ నేరుగా ప్రజల అకౌంట్స్ డిపాజిట్ చేసారు.

    గత బాబు గవర్మెంట్ లో ( 2024- 2019 ) 3.0 లక్షల కోట్లు అప్పు చేసారు . మరి 3.0 లక్షల కోట్లు అప్పు ఏమిసేరు. ఎంత మంది పేదలకు పంచి పెట్టారు?

    k-batch accounts స్వాహా …k-batch స్వాహా

  10. ఇదే మాట మన పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీ కి వెళ్లి చెప్పొచ్చుగా..ట్వీటేసి బెంగుళూరు కి పారిపోతాడు..

    ఆడి ట్వీట్ కింద జనాలు ఎలా తిడుతున్నారో ఒకసారి చదువుకోండి..

    జనాలు పథకాల కోసం ఓట్లు వేయరు.. ఇస్తే తీసుకొంటారు.. పరిపాలన బాగుంటే మళ్ళీ గెలిపిస్తారు..

    పరిపాలన అంటే పథకాలు అనుకొనే వెర్రివెంగళప్ప .. ఈ జగన్ రెడ్డి.

    చావు ఇంటికి వెళ్లి కూడా పథకాల గురించి మాట్లాడుతున్నాడు..

    అన్నేసి పథకాలు ఇచ్చాడు అని చెప్పుకొనే జగన్ రెడ్డి కి చివరికి మిగిలింది ఏమిటి..? 11 సీట్లు..

    ఆ ఓటమి మీకు పాఠం కాకపోవచ్చు.. కానీ మాకు మాత్రం ఒక మంచి పాఠమే..

  11. Vaadiki baaga telusu Padhakalaki yela tender pettalo….Pacha karyakartalaki yelago Anna canteen untey chalu,,100rs untey pellam pillalatho NTR canteen lo tinestaru,,inkem kavali🤣🤣

    1. పేద వర్గాల ఆకలి బాధ మీద కారుకూతలు కూసే వాళ్ళు కాబట్టే 11 కు పరిమితం చేశారు

  12. “మాట ఇచ్చిన హామీలని, మడమ తిప్పకుండా 99% నెరవేర్చినా” అంటూ పబ్లిసిటీ చేసుకుని, Why not 175 అని విర్రవీగిన A1 ల0గా గాడిని, జనాలు వంగబెట్టి 11 ఇంచులు ఎందుకు Denగారు??

    1. anni sankshema padakalu ichi 99% hamilu chesina vodla prabutvani .. enduku vongopettesaro meku teliste cheppandi .. vochi 2 nelalu ayindi .. elections ki inka chala time undhi .. prajalu inka emi pani pata leda .. mana laga .. GA gadi laga ? atram apukondi .. evaru emi anukuna enni kutalu kusina .. poyina adhikaram next elections varaku radhu ..

    2. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసి .. 99 % హామీలు చేసేసిన ..మనల్ని ఎందుకు వొంగోపెట్టేసారో చెప్పండి పోనీ ..2029 వరకు జనరల్ ఎలేచ్షన్స్ రావు ..అప్పటికి రాజు ఎవడో రంగడు ఎవడో .. క్రితం సారిలా బంగారు పళ్లెం లో అధికారం అయితే మీకు రాదు .. మన తప్పుల్ని ఐదేళ్లు భరించలేకపోయారు ప్రజలు .. .. 14 ఏళ్ళ బాబు పాలనా చూసి తానే బెటర్ అని తెచ్చుకున్నారు .. అది ఆలోచించండి .. క్రితం సరి స్ట్రాటజీ లు ఎలా చిదేసయో మీ పార్టీ అనుకూల రైటర్ లే రాస్తున్నారు ..

      1. మరి నీ చంద్రబాబు నాయుడు విజనరీ అంటావు కదా…జగన్ కన్నా ఎక్కువ ఇస్తాడు అని చంద్రబాబు కి, పవన్ కళ్యాణ్ కి జనాలు ఓట్లు వేశారు… మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందే సంక్షేమ పథకాలు ఇవ్వను…కేవలం అభివృధి చేస్తాను అని వుంటే నీ కామెంట్ కి ఒక వాల్యూ వుండేది….

  13. 10 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 2 లక్షల కోట్లకి మాత్రమే బటన్ నొక్కి. మిగతా 8 లక్షల కోట్లు ల0గా mohana gaade నొక్కిసి, ఊరూరు ప్యాలస్లు కట్టుకుని paraదాల్లో daakkuni జల్సా చేశాడు.. అందుకే Fan విరిచి 11 ముక్కలు చేసి వా డి గుడ్డ లో 11 inchulu లోతుకు dimpaaru

  14. Under any circumstance, there should not be any debate or discussion to justify the non-implementation of guarantees or promises made during elections. If government want to retract from the promises they made for whatever reason, they need to re-seek people’s mandate with new promises by disqualifying current government.

    The promise that was made is to implement both welfare and development by creating wealth and why are the supporters of current government asking people to choose between development or welfare now? Also, these promises were made under the assumption that AP had 14L crores loans which is now cal plated to be at 10L crores. This implies that financial condition is better than assumed.

  15. తాడేపల్లి ప్యాలస్ లో 11 మందితో సాక్షాత్తు A1మహిళా ఒకేసారి “నీలి గ్రూప్ ఆట” ఆడుతూన్నారట.. గోరంట్ల maadav coach ఆట.

  16. Within electoral process, promises made within manifestos influence an individuals duty to vote. During elections, when EC promotes everyone to exercise their duty to vote, why doesn’t EC ensure implementation of such promises and penalize parties that won’t fulfill the promises?

    This will bring accountability to political parties when making promises and will upheld the value of democracy.

      1. Yes, I did and hope the same with you. I was taught the manners by my parents and wished the same should have happened with you. Only people who cannot answer subjectively will go personal if they are not taught manners.

  17. The effect of not implementing promises made within manifesto is similar to someone else casting my vote during elections except that this impersonator is the fake promise that was made.

  18. కుర్చీ ఎక్కిన 8 నెలలకు ammavodi ఇచ్చాడు..

    దానికి కూడా జనవరి లో button నొక్కితె, June లో అరకొరగా పని చేసేది. ఇలా చేసి

    రైతులకు, మోడీ తో కలిసి 18000 ఇస్తా అని kusi కేవలం 7500 సం తర్వాత ఇచ్చాడు.

    మాట ఇచ్చిన హామీలు 99% అమలు చేశా అన్నాడు

    Why not 175 అన్నాడు.. ఎమై0ది?? Vongobetti aadi gu’dda 11 ఇంచులు dengaaru..

    1. జగన్ అది అయినా ఇచ్చాడు చంద్రబాబు ఏందీ హామీలన్నీ అటక ఎక్కిచాడు. అమ్మకు వందనం వేయటానికి రోడ్డు మ్యాపు వేయాలంట ఇదేనా ఎన్నికల ముందు మ్యానిపిస్టోలో చెప్పింది.

  19. Some people here feel that by blaming YCP and playing this blame game will give their political leaders a way out to justify their falter on promises.

    You do not need to play blame game to motivate kootami government supporters as they would by and large support kootami governance.

    Next, by playing the blame game, you can attempt to justify kootami government’s actions and sway YCP supporters who more or less will only vote for YCP in upcoming elections.

    The people that you need to sway by justifying government’s actions are the swing voters who do not fall for these blame games and can only be swayed by fulfilling promises made.

    So, government’s focus must be to fulfill the promises they made.

  20. Some-people-here-feel-that-by-blaming-YCP-and-playing-this-blame-game-will-give-their-political-leaders-a-way-out-to-justify-their-falter-on-promises.

    You-do-not-need-to-play-blame-game-to-motivate-kootami-government-supporters-as-they-would-by-and-large-support-kootami-governance.

    Next,-by-playing-the-blame-game,-you-can-attempt-to-justify-kootami-government’s-actions-and-sway-YCP-supporters-who-more-or-less-will-only-vote-for-YCP-in-upcoming-elections.

    The-people-that-you-need-to-sway-by-justifying-government’s-actions-are-the-swing-voters-who-do-not-fall-for-these-blame-games-and-can-only-be-swayed-by-fulfilling-promises-made.

    So,-government’s-focus-must-be-to-fulfill-the-promises-they-made.

    1. Every body knows 40% stay with YCP, so does 40% of TDP voters. The so called swing voters does not care for promises. If you still think 10% swinged just because of promises, any god can not bring YCP back to power let alone voters. YCP lost elections somewhere and still searching for it some where else. YCP fulfilled all promises and still lost that where the reason lies. Not every body votes for promises.

  21. మాకు డబ్బు వట్టినే వొద్దు….jobs business loans ease of doing ఇస్తే మేమే tax కడతాం… ఐనా మాకు హిందూ ధర్మం ముఖ్యం…. గొఱ్ఱె ద్రోహులు rule చేయకూడదు….

  22. AP lo evariki sankshema pathakalu avasaram ledu…Abivrudhi jarigithe chalanukoni votelu vesaru andaru… Anthe Kani government iche money kosam kaadu… Cast and Government schemes ni assalu pattinchukoru maa rashtram lo…

  23. గ్రేట్ ఆంధ్రా అరాచక పాలన చేసిన జగన్ నే ఒంగోపెట్టి తన్నాలేదు. ఇక చంద్రబాబు ని ఎందుకు చేస్తారు. నీవు చంద్రబాబు హామీలు చూసి ప్రజలు ఓటేసారని అనుకుంటున్నావు. అసలు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయకపోయినా, ఏ హామీ ఇవ్వక పోయిన ఇదే ఫలితం వచ్చేది. ఇప్పటికైనా నీవు జగన్ శ్రేయోభిలాషివి అయితే సజ్జల సలహాలు లాంటివి కాకుండా అతను డెమోక్రటిక్ పరిపాలన కాకుండ నియంత పరిపాలన చేశాడు. అది సరిదిద్దుకోమని చెప్పు. ఆడవారితో illegal వ్యవహారాలు నడిపే వారిని పార్టీ నుండి బహిష్కరించమని చెప్పు. అంతేగాని ఊరికే పవన్ కళ్యాణ్ మీద పడి ఏదవొద్దని చెప్పు

  24. Assalu endukochina free pathakalu ivi..prajalaki kavalsindi Prashantham ga vunde society.Farmers ki 20k iche badulu fertilizers cost lo subsidy ivvatam better.Anthe kani 20l ye mulaki vasthay.Panikoche panulu cheyyanadi ra babu..Aina TDP kutami win ayyindi kevalam pathakala valla kaadu

Comments are closed.