ఒలింపిక్స్.. ఇండియా ఇంకెన్నేళ్లు ఇలా!

1980ల నాటికే హాకీ ప్ర‌భావం అండుగంటాకా.. 1996 కు ముందు జ‌రిగిన వివిధ ఒలింపిక్స్ ల‌లో ఎక్క‌డా ఇండియా ఊసు లేదు! ప‌రుగుల రాణి పీటీ ఉష తృటిలో కాంస్య‌ప‌త‌కాన్ని మిస్ అయ్యి, నాలుగో…

1980ల నాటికే హాకీ ప్ర‌భావం అండుగంటాకా.. 1996 కు ముందు జ‌రిగిన వివిధ ఒలింపిక్స్ ల‌లో ఎక్క‌డా ఇండియా ఊసు లేదు! ప‌రుగుల రాణి పీటీ ఉష తృటిలో కాంస్య‌ప‌త‌కాన్ని మిస్ అయ్యి, నాలుగో స్థానంలో నిల‌వ‌డ‌మే మ‌న‌కు ఒలింపిక్స్ కు సంబంధించిన పాఠ్యాంశం! పీటీ ఉష సాధించిన ఆ ఘ‌న‌త‌నే ద‌శాబ్దాల పాటు మ‌నం గొప్ప‌గా చ‌దువుకున్నాం! అప్ప‌టికే ఇండియా జ‌నాభా అటు ఇటుగా వంద కోట్లు! అలాంటి దేశం త‌ర‌ఫున ఒలింపిక్స్ లో ఒకే ఒక అథ్లెట్ నాలుగో స్థానంలో నిల‌వ‌డం ద‌శాబ్దాల ఘ‌న‌తగా సాగిన పరిస్థితి.

1996లో అట్లాంటా ఒలింపిక్స్ లియాండ‌ర్ పేస్ కాంస్య ప‌త‌కాన్ని సాధించి.. ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఇండియా పేరును నిల‌బెట్టాడు. 2000లో జ‌రిగిన సిడ్నీ ఒలింపిక్స్ లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి ప‌త‌కాన్ని సాధించారు. ఆ త‌ర్వాత 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ స‌మ‌యానికి ఇండియాలో టీవీల వీక్ష‌ణ బాగా పెరిగింది. ఆ స‌మ‌యానికి ఇంటింటా టీవీలు అందుబాటులోకి వ‌చ్చాయి, ఆస‌క్తి ఉన్న వారు, ఇండియాలో ఒలింపిక్స్ వీక్ష‌ణ పెరిగిన స‌మ‌యం అదే! అయితే ఆ ఒలింపిక్స్ లో ఇండియాకు ఒకే ఒక ప‌త‌కం ద‌క్కింది. షూటింగ్ లో రాజ‌వ‌ర్ధ‌న్ సింగ్ రాథోడ్ ర‌జ‌త ప‌తాక‌న్ని సాధించాడు. అలా వ‌ర‌స‌గా మూడు ఒలింపిక్స్ ల‌లో ఒక్కోసారి ఒక్కో ప‌త‌కం రావ‌డ‌మే ఇండియా త‌ర‌ఫున అతి గొప్ప ఘ‌న‌త‌!

అలా మ‌హా అంటే ఒక ర‌జ‌త‌మో, కాంస్య‌మో ఇండియా స్థాయి అనే పరిస్థితిలో 2008లో బీజింగ్ లో జ‌రిగిన ఒలింపిక్స్ లో ఇండియా ప‌రిస్థితి కాస్త మెరుగైంది. అభిన‌వ్ బింద్రా షూటింగ్లో స్వ‌ర్ణం సాధించి ద‌శాబ్దాల త‌ర్వాత ఇండియా త‌ర‌ఫున స్వ‌ర్ణ ప‌త‌క‌ధారి అయ్యాడు. అదే ఒలింపిక్స్ లో రెజ్లింగ్, బాక్సింగ్ ల‌లో కూడా ఇండియాకు ఒక్కో ప‌త‌కం రావ‌డంతో.. భార‌త్ తొలి సారి మూడు ప‌త‌కాల ధార‌ణ‌తో త‌న స్థాయిని మెరుగుప‌రుచుకుంది. అక్క‌డ నుంచి ఇండియా ప‌రిస్థితి మెరుగవుతుంద‌ని చాలా మంది ఆశించారు. అయితే 2008 అంటే దాదాపు 16 యేళ్ల కింద‌ట‌! బీజింగ్ లో ద‌క్కింది మూడు ప‌త‌కాలు. క‌నీసం అప్పుడు ఒక స్వ‌ర్ణం అయినా ఉంది ఖాతాలో. బీజింగ్ నుంచి పురోగ‌తి అనుకున్నా.. 16 యేళ్ల త‌ర్వాత కూడా ఇండియా ప‌రిస్థితి అటు ఇటుగా అలాగే ఉంది!

ఊహించ‌ని విధంగా కొన్ని ప‌త‌కాలు క‌లిసి రావ‌డ‌మే త‌ప్ప‌.. అంచ‌నాల‌తో వెళ్లిన వారు రాణిస్తుండ‌టం అరుదుగా మారింది. గ‌త ప‌ర్యాయం ప‌త‌కం సాధించిన హాకీ జ‌ట్టు, నీర‌జ్ చోప్రాలు మ‌రోసారి ప‌త‌క సాధ‌న చేయ‌డమే ఈ సారికి సంతృప్తిక‌ర‌మైన అంశం. అయితే హాకీ జ‌ట్టు కొన్ని అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకుని ఉంటే.. ఈ సారి కాంస్యం క‌న్నా మెరుగైన ప‌త‌కంగా ర‌జ‌తం ద‌క్కేది. నీర‌జ్ చోప్రా స్వ‌ర్ణం సాధించి ఉంటే.. ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఇండియా స్థానం చాలా మెరుగ‌య్యేది.

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా ఏడు ప‌త‌కాల‌ను సాధించింది. అది గ‌రిష్ట స్థాయి, అయితే ఈ సారి అన్ని ప‌త‌కాలు ద‌క్క‌వ‌ని స్ప‌ష్టం అయిపోతోంది. ప్ర‌త్యేకించి ఈ సారి స్వ‌ర్ణ ప‌త‌కం లేన‌ట్టే! ఇది నిరాశ క‌ర‌మైన అంశం. 20, 30 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న చాలా దేశాలు ఒలింపిక్స్ లో ఇండియా క‌న్నా చాలా మెరుగైన స్థాయిలో ప‌త‌కాల‌ను సాధించాయి. మ‌నం ఆస్ట్రేలియాతోనో, అమెరికాతోనో, చైనాతోనో పోల్చుకోక‌పోయినా.. పేద ఆఫ్రిక‌న్ దేశాలు, ల‌క్ష‌ల జ‌నాభా మాత్ర‌మే ఉన్న యూర‌ప్ దేశాల‌తో అయినా పోల్చుకోవ‌చ్చు! అయితే వాటితో పోల్చుకున్నా.. మ‌న‌ది మ‌రోసారి పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌నే! ఆఖ‌రికి పాకిస్తాన్ కూడా స్వ‌ర్ణ సాధ‌న‌తో ప‌త‌కాల ప‌ట్టిక‌లో ఈ సారి ఇండియా క‌న్నా మెరుగైన స్థితిలో ఉంది.

2012 లండ‌న్ ఒలింపిక్స్ నుంచి అయినా ఇండియా ప‌రిస్థితి పురోగ‌మిస్తుంది అనుకుంటే, మ‌ళ్లీ 2016 రియో ఒలింపిక్స్ లో ఇండియా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. అప్పుడు రెండంటే రెండే ప‌త‌కాలు ల‌భించాయి. టోక్యోలో ప‌రిస్థితి మెరుగ‌య్యింది అనుకుంటే, ఈ సారి మ‌ళ్లీ ప‌త‌కాల సంఖ్య త‌గ్గిందే కానీ, పెర‌గ‌లేదు, స్వ‌ర్ణ‌మూ సాధ్యం కాలేదు!

వంద కోట్ల‌కు పైగా జ‌నాభా, గ‌తంతో పోలిస్తే ఇన్ ఫ్రా అభివృద్ధి జ‌రిగింది. ఆర్థికంగా చాలా మంది స్థితిమంతులు అయ్యారు. అయిన‌ప్ప‌టికీ అథ్లెట్ల‌ను, స్పోర్ట్స్ స్టార్స్ ను త‌యారు చేయ‌డంలో ఇండియా కుంటుబాటు స్థితిలోనే కొన‌సాగుతూ ఉంది. చ‌దువే ప‌ర‌మావ‌ధి అన్న‌ట్టుగా స్కూళ్లు త‌యార‌య్యాయి. గేమ్స్ పిరియ‌డ్ అనేది స్కూళ్ల‌లో ప్ర‌శ్నార్థ‌క‌మే! మెజారిటీ స్కూళ్ల‌కు గ్రౌండ్ అనేదే ఉండ‌దు! ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఫీజుల‌ను వ‌సూలు చేసే ప్రైవేట్ స్కూళ్ల‌లో కూడా గ్రౌండ్ ఉన్న స్కూళ్లు ఎన్ని? పాఠ‌శాల‌ల‌కు గ్రౌండ్లు ఉండ‌వు, ఒక‌వేళ ఉన్నా.. నైపుణ్యాన్ని వెలికి తీసే ప్ర‌య‌త్నాలు ఉండ‌వు, పిల్ల‌లు స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపినా వారిలో ప్ర‌తిభ ఉన్నా.. ప్రోత్స‌హించే మ‌న‌సు త‌ల్లిదండ్రుల‌కు రాదు!

ఇలాంటి బాలారిష్టాలే ఇండియాలో ఇంకా కొన‌సాగుతూ ఉన్నాయి. వీట‌న్నింటికీ తోడు క్రికెట్ డ్యామినేష‌న్, స్పాన్స‌ర్లంతా క్రికెట్ వెంటే ప‌డుతూ ఉంటారు. ఇతర క్రీడ‌ల వైపు వెళితే సంపాద‌న కూడా అనుమాన‌మే అనే భ‌య‌మూ ప్ర‌తిభ ఉన్న వాళ్ల‌లో కూడా ఉంటుంది! ఒలింపిక్స్ లో ఇండియా వెనుక‌బాటు త‌నానికి క‌ర్ణుడి చావుకున్న‌న్ని కార‌ణాలున్నాయి. వీట‌న్నింటినీ జ‌యించి ఎప్ప‌టికి ఇండియా ఒలింపిక్స్ లో ప‌త‌కాల పంట పండించాలి?

1996లో ఒక ప‌త‌కంతో మ‌న ప్ర‌స్థానం పునఃప్ర‌యాణం మొద‌లుపెడితే, 2008కి మూడు ప‌త‌క‌ల స్థాయికి వ‌చ్చింది. టోక్యోలో కాస్త మెరిసినా, పారిస్ లో మ‌ళ్లీ ఆ స్థాయి కూడా లేదు. ఇప్పుడో ఐదు ప‌త‌కాల స్థాయికి చేరింది. మ‌రో ఆరు మంది నాలుగో స్థానంలో నిలిచార‌ని చెప్పుకోవ‌డ‌మే కానీ, మ‌న జ‌నాభాకు ఇలా చెప్పుకోవ‌డం కూడా అవ‌మాన‌మే! క‌నుచూపు మేర‌లో అయితే ప‌రిస్థితిలో మార్పులు జ‌రిగి, అద్భుతాలు జ‌రుగుతాయ‌నే అంచ‌నాలు, ఆశ‌లు పెట్టుకోన‌క్క‌ర్లేదు కూడా!

ఇంకో ఇర‌వై ముప్పై సంవ‌త్స‌రాలు కూడా ఇండియా ప‌త‌కాల గురించి ఇలా ఒక‌టీ రెండు లెక్క‌లు వేసుకోవాల్సిన ప‌రిస్థితుల్లోనే క‌నిపిస్తూ ఉంది. ఇది య‌ధార్థ స్థితి.

20 Replies to “ఒలింపిక్స్.. ఇండియా ఇంకెన్నేళ్లు ఇలా!”

  1. మన వాళ్ళు పథకం గెలిస్తే డబ్బు ఇస్తారు, అదేదో ముందే క్రీడలకు నిధులు ఇస్తేక్రీడలకు నిధులు ఇస్తే ఈ పరిస్థితి వుండదు

  2. డబ్బు లేని వాళ్ళు ఎలాగూ గారంటీ గా వెంటనే డబ్బు వచ్చే ఉద్యోగాలకి ఆరాట పడతారు, మరి డబ్బు ఉన్నవాళ్లు స్పోర్ట్స్ కి ఎందుకు వెళ్ళరు?

  3. మీ మీడియా లో రాసే వార్తలు, ఆర్టికల్స్ లో వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారో సమీక్ష చేసుకుంటే అర్ధం అవుతుంది.

  4. Cricket ki importance thagginchali… Olympics lo qualify ayinavallaki prize money pettali. Medals gelichina vallaki cricketers kante ekkuva benefits ivvali. Sports academy

    ‘s lo politics ni kukativellatho eripareyali.

  5. కొత్త క్రీడాకారుల గురించి దేవుడెరుగు, కనీసం ఉన్నవాళ్లనైనా గౌరవిస్తున్నారా ? ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ తెచ్చిన ఆడబిడ్డలు తమకు జరిగిన కీ#చ#క వేధింపుల గురించి నోరువిప్పినందుకు, ఆ కీ#చ₹కు%డు దేశం చెవిలో పువ్వులు పెట్టే పార్టీ సభ్యుడన్న కారణంగా వాడికో భక్తగణంగా తయారయ్యి, వినేష్ పోఘాట్ ని బూతులు తిడుతున్నారు. ఇలాంటి ఉన్మాద సమాజంలో ఛాంపియన్స్ ఎలా తయారవుతారు ? పైగా మనమే “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతే” అంటూ ప్రపంచానికి మన ధర్మం గురించి గొప్పగా చెప్తాం..

  6. కొత్త క్రీడాకారుల గురించి దేవుడెరుగు, కనీసం ఉన్నవాళ్లనైనా గౌరవిస్తున్నారా ? ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ తెచ్చిన ఆడబిడ్డలు తమకు జరిగిన కీచక వేధింపుల గురించి నోరువిప్పినందుకు, ఆ కీచకుడు దేశం చెవిలో పువ్వులు పెట్టే పార్టీ సభ్యుడన్న కారణంగా వాడికో భక్తగణంగా తయారయ్యి, వినేష్ పోఘాట్ ని బూతులు తిడుతున్నారు. ఇలాంటి ఉన్మాద సమజంలో ఛాంపియన్స్ ఎలా తయారవుతారు ? పైగా మనమే యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతే అంటూ ప్రపంచానికి మన ధర్మం గురించి గొప్పగా చెప్తాం..

  7. కొత్త క్రీడాకారుల గురించి దేవుడెరుగు, కనీసం ఉన్నవాళ్లనైనా గౌరవిస్తున్నారా ? ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో మెడల్స్ తెచ్చిన ఆడబిడ్డలు తమకు జరిగిన కీ*చ*క వే*ధిం*పు*ల గురించి నోరువిప్పినందుకు, ఆ కీ*చ*కు*డు దేశం చెవిలో పువ్వులు పెట్టే పార్టీ సభ్యుడన్న కారణంగా వాడికో భక్తగణంగా తయారయ్యి, వి*నే*ష్ పో*ఘా*ట్ ని బూతులు తిడుతున్నారు. ఇలాంటి ఉ*న్మా*ద స*మా*జంలో ఛాంపియన్స్ ఎలా తయారవుతారు ? పైగా మనమే యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతే అంటూ ప్రపంచానికి మన ధర్మం గురించి గొప్పగా చెప్తాం..

  8. సవ్యమైన భాషలో రాసిన కామెంట్లను కూడా పబ్లిష్ చెయ్యడానికి ధైర్యం లేనప్పుడు ఈ వెబ్సైట్ నడపడం ఎందుకు ? మడిచి అవతల పడేసుకోండి..

  9. మాకు మత మార్పిల్లు కుల కుంపట్లు అవినీతి నల్లధనం ఇష్టం…. ఒలింపిక్స్ ni శాశ్వతంగా ban చేద్దాం…

  10. No encouragement & sponsors for upcoming talented children in sports except cricket. My ward is also one of the sufferer(Tennis sport). India lo anthe.

  11. We have only ONE largest Sports Academy at Ludhiana.. Government should develop more such Regional Sports Academies throughout the country.. which will increase sports enthusiasm in the country..

Comments are closed.