ఇటు డబుల్ ఇస్మార్ట్, అటు మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎవరి పద్ధతుల్లో వాళ్లు సినిమాకు ప్రచారం చేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ ప్రచారం కోసం ముంబయి వరకు వెళ్లింది యూనిట్.
కానీ డబుల్ ఇస్మార్ట్ విషయంలో ప్రచారం కంటే ముందు చేయాల్సి పని ఒకటుంది. దాన్ని మాత్రం మేకర్స్ ఆయాచితంగా మరిచిపోతున్నట్టున్నారు.
డబుల్ ఇస్మార్ట్ సినిమా చుట్టూ వివాదాలు నలుగుతున్న సంగతి తెలిసిందే. లైగర్ మూవీ మూలంగా వచ్చిన ఈ తలనొప్పుల్ని ఎలా సెటిల్ చేసుకుంటారు, ఏ పాయింట్ దగ్గర అవన్నీ ఆగుతాయనే విషయాలు పక్కనపెడితే.. ఈ ఇష్యూస్ వల్ల సినిమా వాయిదా పడుతుందనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి.
ప్రమోషన్ కంటే ముందు, వైరల్ గా మారిన ఈ ఊహాగానంపై మేకర్స్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాత్రి ట్విట్టర్ స్పేసెస్ లో ఆగస్ట్ 15 రిలీజెస్ గురించి కొంతమంది మాట్లాడుకున్నారు. అన్నీ తెలిసిన మీడియా జనం కూడా కొంతమంది డబుల్ ఇస్మార్ట్ విడుదలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక సామాన్య జనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి.. తమ ప్రచారం కంటే ముందు సినిమా కచ్చితంగా ఆగస్ట్ 15కే వస్తుందనే విషయాన్ని బలంగా చెప్పాల్సిన అవసరం డబుల్ ఇస్మార్ట్ యూనిట్ పై ఉంది. ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. లేదంటే ప్రమోషన్ కంటే ముందు వస్తుందా రాదా అనే చర్చలు ఎక్కువైపోతాయి. ఇది కూడా ఓ రకమైన ప్రచారమే కదా అనుకుంటే, ఇక చేసేదేం లేదు.
Vc estanu 9380537747
Call boy jobs available 834150897
Call boy works 8341510897
ఎక్కడో అక్కడ ఎలాగో అలా వస్తుందనుకోవచ్చు కదా!
Yekado thedaa koduthundhi seenaaa
జనం పట్టించుకోరు
ఎప్పుడు వచ్చినా థియేటర్లో చూడం