విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లకు ఎర వేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికల్లో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం మాట అటుంచితే ఈ ఫిరాయింపులతో పార్టీ లోపలా బయటా కూడా విమర్శలు వస్తున్నాయని అంటున్నారు.
గత మూడున్నరేళ్ల పాటు వైసీపీలో ఉంటూ టీడీపీని ఇబ్బంది పెట్టిన వారు అప్పట్లో చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టుకు వస్తే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేసి అలజడి సృష్టించిన వారు టీడీపీని తమ వార్డులలో ఏమీ కాకుండా చేయాలని చూసిన వారు అంతా ఇపుడు అధికారం ఉంది కదా అని టీడీపీ కూటమి వైపు నడిచారు.
వారిని తెచ్చిపెట్టుకుని టీడీపీ కూడా అభాసుపాలు అయింది అని అంటున్నారు. ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి భారీ మెజారిటీలతో టీడీపీని గెలిపించారు. టీడీపీకి చూస్తే వార్డులలో బలమైన నాయకులు ఉన్నారు. అయినా సరే వారి మీద వ్యతిరేకంగా ఉన్న వారిని తెచ్చి పెట్టుకోవడం ఏమిటి అన్న చర్చ పార్టీ లోపల సాగుతోంది.
విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తీరుని చూసిన జనాలు కూడా విస్తుపోతున్నారు. నోటు గెలిచింది అని అంటున్నారు తప్ప టీడీపీ బలం పెరిగింది అనుకోవడం లేదు. దాంతో టీడీపీ ఇమేజ్ కి ఇది ఇబ్బందికరంగా మారింది అని అధినాయకత్వానికి కూడా కొంతమంది నేతలు నివేదికలు పంపించారు. ప్రజలు ఒక మంచి మేండేట్ ఇచ్చినా కూడా ఇంకా రాజకీయ కక్కుర్తి పనులు చేయడం వల్ల జనంలో పలుచన కావడమే కాకుండా రానున్న రోజులలో ఆదరణ సైతం కోల్పోతామని కూడా పార్టీ హితైషులు సూచిస్తున్నారు.
ఈ రకమైన ఫీడ్ బ్యాక్ రావడం వల్లనే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఫిరాయింపులను చేసి ఆ పదవిని గెలుచుకోవాలా అన్న మీమాంశలో అధినాయకత్వం ఉందని అంటున్నారు. టీడీపీ అయినా మరో పార్టీ అయినా విపక్షం నుంచి ఫిరాయింపులు చేస్తే అది రాజకీయంగా బాగానే ఉంటుంది కానీ జనాలు మాత్రం వాటిని సహించలేరు అని అంటున్నారు.
మంగళవారం కబుర్లు
అలా అయితే సంతోషపడాల.. కానీ నువ్వు అసూయ పడుతున్నావు ..
ఎవ్వరికీ జగనన్న అంటే ప్రేమలేదు పదవి వుంటే ఉంటారు లేకపోతే సర్దుబాట అది నీతి,
Vc available
Bolli gaani bratuke Ila sachindi 40 years nundi, briefed me marchipoyaava
టీడీపీ బలం పెరిగింది అనుకోడం లేదా ????అసలు విశాఖ లో మన అన్న పార్టీ కి వచ్చిన సీట్లు ఎన్ని టీడీపీ కి వచ్చిన సీట్లు ఎన్ని ????
అసలు స్థానిక ఎన్నికలు ఎలా ఆగోరించాయో మీరే చెప్పారు కదా మల్ల ఇది ఎందుకు …ఆశ నిరాశ మధ్య కొట్టు మిట్టాడుతూ రోజుకోటి రాసుకోవడమే….ఎటు ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే గడిచిపోతాయి కదా
Vc estanu
Call boy works 8341510897