Advertisement

Advertisement


Home > Politics - Analysis

కేకే అయితే ఓకే!

కేకే అయితే ఓకే!

విశాఖ ఉత్తర నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం..

రాజకీయాల్లో రెండు ప్లస్ రెండు నాలుగు ఎప్పుడు కాదు! జనాలను నమ్ముకొని.. జనం మధ్య ఉంటూ ఉంటే ఖచ్చితంగా పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. పట్టుదల శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. గత ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు అలుపెరుగని పోరాటం చేశారు. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మున్ముందుకు సాగారు అన్నది ఎవరు కాదనలేని నిజం.

గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పై అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజల మధ్య ఉన్నారు వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ సహకారాన్ని పొందుతూ పలు అభివృద్ధి పనులు చేస్తూ మున్ముందుకు సాగారు. ఆ కృషి అనేది 2024 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కేకే రాజుకు ఈ ఎన్నికలు కేక్ వాక్ లా మారాయి అని చెప్పడంలో సందేహం లేదు.

ఇద్దరు రాజుల మధ్య యుద్ధం.

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు రాజుల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. ఒకరు వైసీపీ అభ్యర్థి కేకే రాజు కాగా మరొకరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన విష్ణుకుమార్ రాజు. కేకే రాజు ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్లడం ఓడిపోయినా దిగాలు చెందకుండా ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటం చేయడం ముఖ్యంగా అధికార వైసీపీలో ఉండటం వల్ల ఆయన పదేపదే ప్రజా సమస్యల విషయంలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందగలిగారు.

అధికార వైసీపీ పార్టీలో కేకే రాజు ఉండటం ఒక వరం అయితే ఆయన ప్రభుత్వ సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటూ నియోజవర్గ అభివృద్ధిలో కృషి చేయడం అనేది ఇంకో రకమైన ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ముఖ్యమంత్రి తో సన్నిహితంగా ఉంటూ వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం అలాగే కీలక సమస్యల పరిష్కారంలో కృషి చేయడం ఇవన్నీ కూడా కేకే రాజు పట్ల ప్రజల ఆదరాభిమానాలు పొందడానికి పెరగడానికి కారణమయ్యాయి.

2014లో కూటమి అభ్యర్థిగా గెలిచిన విష్ణుకుమార్ రాజు .. బిజెపి కేంద్రంలో ఉన్నప్పటికీ ఇటు రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గానికి ఏదైనా ప్రత్యేకంగా చేశారు అంటే పెద్ద సున్నానే కనిపిస్తుంది. కేవలం టిడ్కో ఇళ్లు పేరుతో మంజూరైన ఇళ్ల  సంఖ్య వందల్లో అయితే దానికి మూడింతలు చేసి దరఖాస్తులు తీసుకోవడం ప్రజలను మభ్యపెట్టడం విష్ణుకుమార్ మోసం చేసాడంటూ చాలా మంది ప్రజలు తర్వాత అసలు నిజం తెలుసుకోవడం అనేది ఇక్కడ బయటపడ్డ వాస్తవ విషయం.

అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సభ్యునిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కూడా ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా కొండ ఏటవాలు ప్రాంతాల ప్రజల సమస్యలు అలాగే కనీస మూలిక సదుపాయాలు కల్పించే విషయంలో విష్ణుకుమార్ రాజు ఏనాడు సక్సెస్ కాలేదు మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూటమి తరపున రంగంలో దిగిన విష్ణుకుమార్ రాజుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు సహకరించే పరిస్థితి లేదు. పరిస్థితులు తారుమారు అవుతుండడంతో ప్రెస్ స్టేషన్ కు వెళ్ళిపోతున్న విష్ణుకుమార్ రాజు వైసీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన ఇరకాటంలో పడిపోయారు. తరువాత నాలుక కరుచుకొని నేనేం ఇలా మాట్లాడలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన వైఖరి ఏంటో సమాజానికి తెలిసిపోయింది.

ఎవరి బలం ఎంత?

ఎవరి బలం ఎంత అనేది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మనం పరిశీలిస్తే 2014 నుంచి అలాగే 2019 వరకు ఒక ఎత్తు అయితే 2019 నుంచి 2024 వరకు మరో ఎత్తుగా మనం చెప్పుకోవాలి. విష్ణు కుమార్ రాజు ఆర్భాటం తప్ప ప్రజా సమస్యలు, కీలక సమస్యలు పరిష్కారంలో 2014లో గెలిచినప్పటికీ సక్సెస్ కాలేదు. అలాగే 2019లో టిడిపి తరఫున గెలిచిన ఘంటా శ్రీనివాసరావు గెలిచిన తొలి రోజు నుంచి ఆయన ముఖం కూడా నియోజకవర్గ ప్రజలకు చూపించలేదు.

టిడిపి శ్రేణులు భారతీయ జనతా పార్టీ శ్రేణులు.. ఇద్దరు నేతల విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లోను నియోజవర్గాలను మార్చడమే పనిగా పెట్టుకున్న గంటా శ్రీనివాసరావు ఈసారి ఉత్తర నియోజకవర్గం ప్రజలకు ముఖం చాటేసి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఉత్తర నియోజకవర్గం ప్రజలంతా అసలు ఎందుకు గంటా శ్రీనివాసరావుకు ఓటు వేసి గెలిపించామా అన్న భావనలో పడిపోయారు. ప్రజల మధ్య ఉండే నాయకుడ్ని నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించుకోవాలన్న ఆలోచనతో ఉత్తర నియోజకవర్గం ప్రజానీకం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక కేకే రాజు విషయంలో తొలి నుంచి 2019లో ఓటమి పాలైన మొదటి రోజు నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే విషయంలో కేకే రాజు ఎక్కువగా శ్రద్ధ చూపారు అన్నది ప్రజల మాట. ఇక వైసిపి సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా ఈసారి ఎన్నికల్లో కేకేరాజుకు అదనపు లాభంగా ఉండబోతున్నాయి. కేకే రాజు విషయంలో ప్రజలు కూడా ఒకే ఒక మాటను గుర్తు చేసుకుంటుంది.'అరే తొలి నుంచి కూడా ఆయన తిరుగుతున్నాడు ఒకసారి ఆయనకి అవకాశం ఇద్దాం' అనే భావన ప్రజల నుంచి రావడం స్పష్టంగా కనిపిస్తోంది.

ధనవంతులు, మధ్యతరగతి ప్రజానీకం, పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉండే ఉత్తర నియోజకవర్గం లో కచ్చితంగా పేదలు మధ్యతరగతి బడుగు బలహీనవర్గాల ఓటర్లే కీలకంగా మారే అవకాశం ఉంది .ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరూ తీసుకుంటున్న వేళ వీటి ప్రభావం ఈ ఎన్నికల్లో కచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. మరో వైపు కూటమి అభ్యర్థిగా చెప్పుకుంటున్న విష్ణు కుమార్ రాజుకు తెలుగుదేశం జనసేన శ్రేణులు అంతగా సహకరించకపోవడం పెద్ద మైనస్ గా చెప్పుకోవాలి.

2014 పరిస్థితులను బెరీజు వేసుకొని చంకలు గుద్దుకుంటున్న బిజెపి అభ్యర్థికి ఈసారి చేదు అనుభవాలు తప్పవేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏమైనాప్పటికీ కేకే అయితే ఓకే అన్న భావన మెజార్టీ ప్రజానీకంలో ఉత్తర నియోజకవర్గం లో కనిపిస్తుంది. మరి ఎన్నికల పోలింగ్ తేదీ నాటికి తన అనుకూల పరిస్థితులను కేకే రాజు ఎలా వినియోగించుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?