ఓడిపోయే పార్టీ అన్నారు..మళ్లీ ఇలా?

రోజూ ఏదో ఒకటి రాయడమే పనిగా పెట్టుకున్న వారికి లాజిక్ లు కనిపించవు. వాటిని మిస్ అవుతున్నాం అనిపించదు.  Advertisement నిత్యం వైకాపా కు వ్యతిరేకంగా ఓ బ్యానర్ అయిటమ్ వుండాలంతే. అందులో సరుకు…

రోజూ ఏదో ఒకటి రాయడమే పనిగా పెట్టుకున్న వారికి లాజిక్ లు కనిపించవు. వాటిని మిస్ అవుతున్నాం అనిపించదు. 

నిత్యం వైకాపా కు వ్యతిరేకంగా ఓ బ్యానర్ అయిటమ్ వుండాలంతే. అందులో సరుకు లేశమైనా వుండాలన్న ఆలోచన వుండకపోవచ్చు. ఈ రోజు ఎంచుకున్న అంశం. వైకాపాలో అసమ్మతి. 

ప్రతి నియోజక వర్గంలో టికెట్ ల కోసం ఒకటికి మించి ఇద్దరు..ముగ్గురు పోటీ పడుతున్నారని, ప్రతి చోటా ఇదే విధమైన కుమ్ములాటలు వున్నాయని పెద్ద కథనం వండి వార్చారు. బాగానే వుంది.

కానీ ఇదే కథనాన్ని మరో కోణంలో చూస్తే… అసలు వైకాపా ఓడిపోతుందని పది సీట్లకు పరిమితం అవుతుందని, పాతిక సీట్లు వస్తే గొప్పని కథనాలు ఓ పక్క వండుతున్నారు. లోకేష్ పాదయాత్ర ఫలితం మామూలుగా లేదని గప్పాలు కొడుతున్నారు. ఇంక ఇవ్వాళో, రేపో ఆంధ్రలో అధికారం వైకాపా చేజారిపోవడం తథ్యం అని రాసుకువస్తున్నారు. మరి అలాంటపుడు అదే వైకాపా టికెట్ మీద పోటీ చేయాలని ఎవరు అనుకుంటారు? ఓడిపోయే పార్టీ టికెట్ కోసం కొట్టుకునేంత సీన్ వుంటుందా?

డిమాండ్..సప్లయ్ సూత్రం అన్నది తెలియని బ్రహ్మ పదార్థం కాదు. వైకాపా లో టికెట్ ల కోసం ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా, కొట్టుకునే పరిస్థితి వుందీ అంటే ఏ కోణంలో అర్థం చేసుకోవాలి. తెలుగుదేశంలో ఇలాంటి పరిస్థితి లేదూ అంటే…లేదనే అనుకోవాలి. ఎందుకంటే వుంటే రాసేవాళ్లేమో కదా? రాయలేదు అంటే లేదనే కదా…అక్కడ టికెట్ లకు డిమాండ్ లేదనుకోవాలా?

ఏంటో ఈ బాధలు..ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వుందో ?