Advertisement

Advertisement


Home > Politics - Analysis

పింఛను పై రెండు మాటలు

పింఛను పై రెండు మాటలు

పని చేసిన వారు పదవీ విరమణ చేసిన తరువాత గౌరవమైన బతుకు బతకాలి అని పింఛను విధానం ఏర్పాటు చేసారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, చాలా అంటే చాలా ఏళ్ల క్రితం మంచి యజమానులు తమ వద్ద పని చేసి మానేసిన వారి కోసం పింఛన్లు ఇచ్చిన దాఖలాలు వున్నాయి. కానీ రాను రాను ప్రయివేట్ సంస్థలకు పింఛను అనేది పోయింది.

ఒక్కప్పుడు జర్నలిస్ట్ లకు కూడా పింఛను వుండేది. దాన్ని కంట్రిబ్యూషన్ తో లింక్ పెట్టి పద్దతిని మార్చారు. ప్రభుత్వం పై పింఛన్ల భారం పెరిగిపోతోంది. డిఎ లు, పే రివిజన్ లు కూడా వర్తింప చేయడంతో ఆ భారం అలా అలా పెరిగిపోతొంది. భవిష్యత్ లో అయినా ఈ పద్దతి ని మార్చాలని కన్సాలిడేటెడ్ ఉద్యోగాలను, ఔట్ సోర్సింగ్ అని ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తోంది.

కేంద్ర, రాష్ఠ్ర ప్రభుత్వాల మీద పడే పెన్షన్ ల భారం మీద రకరకాల అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు వున్నాయి. ఇది ఒక పార్శ్వం.

మరోపక్క సామాజిక ఫించన్ల భారం వ్యవహారం వేరుగా వుంది. ఎన్నికలు వచ్చినపుడల్లా ఈ భారం మరింత పెరుగుతోంది. ఈ పార్టీ మూడు వేలు ఇస్తా అంటే మరో నాలుగువేలు అంటోంది. ఇంకో పార్టీ అయిదు వేలు అంటోంది. ఇంటికే తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది ఓ పార్టీ. అదే కొనసాగిస్తామంటోంది ఇంకో పార్టీ. రాను రాను ఈ వృద్ధులు, అర్హులు పెరుగుతూనే వుంటారు. ఈ పింఛన్లు పెరుగుతూనే వుంటాయి. ఎన్నికల కోసం, అధికారం కోసం అన్ని పార్టీలు చేస్తున్న పని ఇది.

రాజకీయ పార్టీలుగా పింఛన్లు పెంచుతూ పొతున్నాయి. అధికారం లో వున్నవారికి అసలు రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లే భారంగా మారుతున్నాయి. మరో రెండు టెర్మ్ ల ఎన్నికలు జరిగే సరికి ఈ సామాజిక పింఛన్లు పదివేలకు చేరిపోయినా ఆశ్చర్యం లేదు. ఈలోగా వృద్దుల సంఖ్య పెరుగుతూనే వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?