లిక్కర్ సిండికేట్ లను ఆపగలరా?

రివర్స్ టెండర్లు.. అన్నది జ‌గన్ పదం. దాని వల్ల అన్నీ నష్టాలే కానీ లాభాలు లేవని, అదంతా తుగ్గక్ చర్య అని తెలుగుదేశం పార్టీ తెగ యాగీ చేసింది. నిర్ణయాలు తిరగదోడడం సరికాదన్నారు. సరే,…

రివర్స్ టెండర్లు.. అన్నది జ‌గన్ పదం. దాని వల్ల అన్నీ నష్టాలే కానీ లాభాలు లేవని, అదంతా తుగ్గక్ చర్య అని తెలుగుదేశం పార్టీ తెగ యాగీ చేసింది. నిర్ణయాలు తిరగదోడడం సరికాదన్నారు. సరే, కాలం గడిచింది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేం జ‌రుగుతోంది. పేరు ఏదైనా జ‌రుగుతున్నది విధానాలను తిరగతోడడమే. లిక్కర్ విధానాలు అన్ని రాష్ట్రాలు తిరిగి చూసి, సరైన విధానం తెస్తామని ఊదరగొట్టారు. కావాలంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రొజుల్లో పత్రికలు చూసుకోవచ్చు. అలాగే పలు రాష్ట్రాలు తిరిగారు కూడా. ఇలా కొండను తవ్వి పట్టిన ఎలుక ఏమిటంటే, 2019 నాటికి వున్న విధానాన్నే మళ్లీ అమలు చేయడం.

నిజానికి ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మించడం మంచి విధానమే. ఎందుకంటే మధ్య దళారీలు వుండరు కనుక లాభం ఏదో ప్రభుత్వానికే వస్తుంది. నాణ్యమైన మద్యం అందించాలి అనుకుంటే వీలు అవుతుంది, జ‌గన్ ప్రభుత్వం చేపట్టిన విధానాల్లో లోపాలు వుండొచ్చు, లిక్కర్ సరైనది కాకపోయి వుండొచ్చు, రేట్లు ఎక్కువ వుండి వుండొచ్చు, అ రెండు సవరిస్తే సరిపోయేది, నగదు లావాదేవీలు నిషేధించి, అన్ లైన్ అమ్మకాలు చేస్తే చేయచ్చు.

కానీ ప్రభుత్వానికి కావాల్సింది అది కాదు, మద్యం సిండికేట్ లకు ప్రాణం పోయడం, మద్యం సిండికేట్ లు ఇప్పుడు తమ దుకాణాల్లో నగదు అమ్మకాలు జ‌రపవా? అ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోగలదా? సిండికేట్ లకు దుకాణాలు దక్కలేదు. ఎవరెవరికో దక్కాయి అంటూ మీడియా ఊదరగొడుతోంది. ఒక్క వారం అగితే తెలుస్తుంది. షాపులు ఎవరి చేతులకు చేరతాయో, వ్యక్తిగతంగా మద్యం దుకాణాలు నిర్వహించడం ఎవరి వల్లా కాదు. ఏదో ఒక సిండికేట్ తో చేతులు కలపాల్సిందే. వారికి అప్పగించి వాటా తీసుకోవాలి లేదా వారికి ఇచ్చేయాలి. అంతే తప్ప సిండికేట్ లను కాదని దుకాణాలు నిర్వహించడం అసాధ్యం అన్న సంగతి అ వ్యాపారం అను పానులు తెలిసిన వారికి తెలిసిన సంగతే.

ఒక్క నెల అగితే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏయే జిల్లాల్లో ఏయే సిండికేట్లు ఎన్నేసి దుకాణాలు నిర్వహిస్తున్నాయన్నది. పైగా అనధికారికంగా ఎమ్మెల్యేలకు లాభాల్లో వాటా అన్నది గతంలో వుండేది. ఇప్పుడు మళ్లీ అదే పునరావృత్తం కాదని చెప్పలేము. జ‌గన్ నిర్ణయం కాబట్టి తిరగదోడుతున్నారని అనుకోవడానికి లేదు. లిక్కర్ సిండికేట్లు తెలుగుదేశంతో కలిసి వున్నాయి కనుక ఇది జ‌రుగుతోంది. భాజ‌పా నేత పురంధ్వేశ‌రి కూడా గతంలో లిక్కర్ సిండికేట్ ల తరపున మాట్లాడుతున్నారనే మాట వినిపించింది.

మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం రెండు సిండికేట్ లకు ప్రాణం పోసింది. ఒకటి లిక్కర్ సిండికేట్ లు, రెండవది ఇసుక సిండికేట్ లు. ప్రైవేట్ ఇసుక ర్యాంపులకు జెండా ఊపడం అన్నది చాలా సైలంట్ గా జ‌రిగిపోయింది. పవన్ మాట్లాడలేదు,‌ మీడియా అంతకన్నా మాట్లాడలేదు,‌ కానీ జ‌నం మాట్లాడుకుంటున్నారు. అది వేరే సంగతి.

2 Replies to “లిక్కర్ సిండికేట్ లను ఆపగలరా?”

  1. ఏమిటి ఏమిటి . .ప్రభుత్వ ఆదీనంలో ఉంటె .. నాణ్యమైన మద్యం ఆడించొచ్చా .. మరి మా అన్న ఎందుకు నాసిరకం మద్యం హెచ్చు ధరలకు అమ్మడు ? డబ్బా అంత ఏమైంది అప్పుడు .. ??

Comments are closed.