బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?

ప్ర‌భుత్వం త‌మ‌దే అని భావించే కులానికి చెందిన పోసానిని అరెస్ట్ చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆ కులంలో వ్య‌తిరేక‌త రాద‌ని పాల‌కుల భావ‌న‌గా వుంది.

చంద్ర‌బాబు స‌ర్కార్ చివ‌రికి త‌న ప్ర‌తాపాన్ని సినీ న‌టుడు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళిపై చూపుతోంది. ఏదైనా శ్రుతిమించితే న‌ష్టం త‌మ‌కే అని ప్ర‌భుత్వం గ్ర‌హించిన‌ట్టు లేదు. ఎవ‌రెవ‌రినో సంతృప్తిప‌ర‌చ‌డానికే పోసానిపై కేసుల మీద కేసులు పెడుతూ, భూమి గుండ్రంగా వుంద‌న్న కార‌ణంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా తిప్పుతున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

అన్న‌మ‌య్య జిల్లాలో అరెస్ట్ అయిన పోసానికి బెయిల్ ల‌భించింది. అలాగే మ‌రికొన్ని కేసుల్లో కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. ఇప్ప‌టికే వారానికి పైగా పోసాని జైలు జీవితాన్ని గ‌డుపుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వానికి పోసాని సులువుగా టార్గెట్ కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న కుల‌మే.

ప్ర‌భుత్వం త‌మ‌దే అని భావించే కులానికి చెందిన పోసానిని అరెస్ట్ చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆ కులంలో వ్య‌తిరేక‌త రాద‌ని పాల‌కుల భావ‌న‌గా వుంది. ఒక‌వైపు న్యాయ‌స్థానాల్లో పోసానికి ఊర‌ట ల‌భిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం మొండిగా వెళుతోంది. తాజాగా విజ‌య‌వాడ భ‌వానీపురం పోలీసులు కొంప‌లేవీ మునిగిపోతున్న‌ట్టుగా… క‌ర్నూలు జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్ కింద పోసానిని అదుపులోకి తీసుకున్నారు.

హైద‌రాబాద్ మీదుగా విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారంటే, పోసానిపై పాల‌కులు ఎంత అక్క‌సుతో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. కోర్టులో హాజ‌రుప‌రిస్తే, న్యాయ‌మూర్తి ఆదేశాల‌ను అనుస‌రించి పోసాని ఎక్క‌డుంటార‌నే సంగ‌తి తెలుస్తుంది. పోసాని చేయ‌కూడ‌ని నేరాల్ని చేశార‌నే రీతిలో ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం, రాష్ట్ర‌మంతా తిప్ప‌డం చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌భావం చూప‌లేని వ్య‌క్తిని ఇంత‌గా హింసించ‌డం అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న పాల‌కుల మ‌న‌సుల్లో మెద‌ల‌నంత వ‌ర‌కూ బ‌హులా… ఇలా తిప్పుతూనే ఉంటారేమో!

25 Replies to “బాబు స‌ర్కార్ ప్ర‌తాపం పోసానిపైనా?”

  1. చొక్కా ఎగరేస్తుకుంటూ పర్సనల్ గ ఎవడు తిట్టమనాడు వెంకట్రావు .. అప్పుడు తిట్టాడు ఇపుడు అనుభవిస్తున్నాడు … నువ్వు తప్పించి ఎవడు పటించుకోవడం లేదు ..

        1. Endhuku sir potta chinchukunte kalla meeda paduthundi….Posani di reaction matrame…Action kaadu…Jagan ni eavadanna thidithe ne tv looki vasthadu…prathi okkadu Jagan ni enni thitlu thittaru sir..pycho padam lekunda asalu evadanna matladada….tnadrini champadannaru battalu vipputha annaru ucccha poistha annaru…okata renda…kaka pothe rajakeyam matallo nunchi chethalloki vachesindhi…evvadu emi cheyyaledu …idla continue avvalindhe..madhyalo nalugi poyyedhi police lee

          1. అయ్యో పాపం..

            విజయ్ గారు పోలీసుల గురించి ఎంతగా తపన పడిపోతున్నారో..

            అదేదో మీరు వచ్చాక ప్రతిచర్య ఉంటుంది అంటున్నారు కదా.. మీరు గట్టిగా ప్లాన్ చేసుకోండి.. మేము కూడా “సిద్ధమే”..

            ఇక ఉడత ఊపులు ఆపేసి.. వెళ్లి పోసాని ని పరామర్శించుకోండి..

            ఇప్పుడు అదే మీ ప్రతిచర్య..

  2. ఇలా అనవసరంగా కులాల మీద వాగితెన్నె పొసానిని లొపలెసారు! నువ్వు కూడా కులాల మీద పిచ్చి వాడుగు తగ్గించు!!

  3. నోరు వుంది కదా అన్ని వెనక ముందు ఆలోచించ కుండా జగన్ అన్న కోసం వేషం చిమ్ముకుంటూ పోయాడు, షార్ట్ ఎగరేసుకుట్టు భూతులు మాట్లాడుతూ కామన్ మనిషికి కూడా వినలేని బూతులు మాటలాడి పాలిత ఇలానే ఉంటుంది. తొంభయ పెర్చెంత్ ప్రజలు పోసాని మాటలు వెనలేక, విని తట్టుకోలేక పోయారు

  4. నోరు వుంది కదా అన్ని వెనక ముందు ఆలోచించ కుండా జగన్ అన్న కోసం వేషం చిమ్ముకుంటూ పోయాడు, షార్ట్ ఎగరేసుకుట్టు భూతులు మాట్లాడుతూ కామన్ మనిషికి కూడా వినలేని బూతులు మాటలాడి పాలిత ఇలానే ఉంటుంది. తొంభయ పెర్చెంత్ ప్రజలు పోసాని మాటలు వెనలేక, విని తట్టుకోలేక పోయారు

  5. పోసాని బూతులు వీడియోస్ చూసి ఆర్టికల్ వ్రాసి ఉండాలి. ఒకసారి చూడు నీకే తెలుస్తుంది.

  6. Anna GA sorry, mee pillalu neeky puttaara anna, leka mee pakkintollaki or edurintollaki puttaara, now think brother, ilaa matladatam enta pedda tappo artham avutundi

  7. పోసానికి పగలడం పక్కా.. మీరు ఎన్ని ఆర్టికల్స్ రాసినా ప్రజల నుండి కనీస సానుభూతి దొరకదు

  8. ఈ గుడ్డి ఆంధ్రా రెడ్డి కి.. ఇలాంటి కథనాలు రాయడం తప్పా ఇంకేమి చేత కాదు.. రాజకీయాలలోకి భార్య , పిల్లల్ని తప్పుగా మాట్లాడితే.. ఉంది కదా అని ఊర కుక్కలా వాగితే…లోపలేసి మడతేస్తారు..

Comments are closed.