పేద‌రిక సృష్ట‌క‌ర్త‌లు.. దాన్ని నిర్మూలిస్తార‌ట‌!

చంద్ర‌బాబు పాల‌సీలు కేవ‌లం కొంత మందిని మాత్ర‌మే ధ‌న‌వంతుల్ని చేశాయి.

ప్ర‌చారం చేసుకోవ‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి మించిన నాయ‌కులు క‌నుచూపు మేర‌లో లేరు. ఆయ‌న ఏం చేసినా, ఆహా, ఓహో అని డ‌ప్పు కొట్ట‌డానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్, బ‌ల‌మైన మీడియా ఉన్నాయి. ఉగాది ప‌ర్వ‌దినాన పీ 4 అనే వినూత్న కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పేద‌రికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌న్న‌ది సంక‌ల్ప‌మ‌న్నారు. భావిత‌రాల భ‌విష్య‌త్ కోసం పీ4 రూపొందించిన‌ట్టు ఆయ‌న చెప్పారు.

సంప‌న్నుల‌ను పేద‌ల‌తో అనుసంధానించి, పేద‌రికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించిందే మార్గ‌ద‌ర్శి -బంగారు కుటుంబం, పీ4- జీరో పావ‌ర్టీ అని ఆయ‌న గొప్ప‌గా చెప్పారు. విన‌డానికి ఎంతో ముచ్చ‌ట‌గా ఉన్నాయి. ఉమ్మ‌డి, విభ‌జ‌న ఏపీలోనూ ఎక్కువ కాలం రాష్ట్రాన్ని ప‌రిపాలించిన ఘ‌న‌త త‌న‌దే అని చంద్ర‌బాబు ఎన్నోసార్లు చెప్పారు. ప్ర‌స్తుత కాలాన్ని క‌లుపుకుంటే చంద్ర‌బాబుకు సీఎంగా 15 ఏళ్ల అనుభ‌వం.

ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాల‌న్నా, లేదా ఆర్థికంగా ప‌త‌నం కావాల‌న్నా ప‌రిపాల‌నా విధానాలే కార‌ణ‌మ‌వుతాయి. పాల‌కులు అనుస‌రించే విధానాల్ని అనుస‌రించి, రాష్ట్రం బాగోగులు ఆధార‌ప‌డి వుంటాయి. సీఎంగా చంద్ర‌బాబు 15 ఏళ్ల‌లో ఏం చేశారో చెప్ప‌మంటే, ఇత‌రులు చేసిన దానిని కూడా త‌న ఘ‌న‌త‌గా చెప్పుకుంటారనే విమ‌ర్శ వుంది. ఐటీ రంగానికి ఆద్యుడిని తానే అని అంటారాయ‌న‌. నిజానిజాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ప్ర‌పంచ బ్యాంక్‌కు ఊడిగం చేసిన సీఎంగా చంద్ర‌బాబుపై ముఖ్యంగా వామ‌ప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేశాయి. అంతేగానీ, అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని ఈయ‌న గారి పాల‌నా విధానాల్ని చూసి, ఒక ఆర్థిక నిపుణుడు పుస్త‌క‌మే రాశారు. ఏపీ పేద‌రికానికి మొట్ట మొద‌టి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ చంద్ర‌బాబే అనే విమ‌ర్శ‌ల‌పై ఎవ‌రికి వారు జ‌డ్జ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ప్ర‌ధానంగా వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి వుంది. వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి జీవించే రైతులు, కూలీల జీవితాల్లో వెలుగులు నింపాలంటే, క‌రవులు లేకుండా చేయాలి. దాని కోసం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మించాలి. కానీ చంద్ర‌బాబు 15 ఏళ్ల పాల‌న‌లో ఒక్క‌టంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు అయినా నిర్మించారా? అంటే లేద‌నే స‌మాధానం వ‌స్తుంది.

వ్య‌వ‌సాయానికి ప్రాధాన్యం ఇచ్చిన ముఖ్య‌మంత్రుల‌లో ఎన్టీఆర్‌, వైఎస్సార్ పేర్ల‌నే రైతాంగం గుర్తు పెట్టుకుంటుంది. ఔన‌న్నా, కాద‌న్న పోల‌వ‌రం ఘ‌నత వైఎస్సార్‌దే. వ్య‌వ‌సాయ రంగం క‌ళ‌క‌ళ‌లాడితే, మొత్తం స‌మాజం అభివృద్ధి చెందుతుంది. ఎవ‌రో వ‌చ్చి పేద‌ల్ని ఉద్ధ‌రించాల్సిన ప‌నిలేదు. చంద్ర‌బాబు పాల‌సీలు కేవ‌లం కొంత మందిని మాత్ర‌మే ధ‌న‌వంతుల్ని చేశాయి. హైద‌రాబాద్‌లో హైటెక్ సిటీ క‌ట్టిన ఘ‌న‌త త‌న‌దే అని చంద్ర‌బాబు అంటుంటారు. అక్క‌డ భూములు కొన్న కొంత మంది బాగుపడ్డార‌నేది వాస్త‌వం కాదా? అది కూడా చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన రియ‌ల్ట‌ర్ల‌కు ముందే నిర్మాణాల సంగ‌తిని ఉప్పందించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్పుడు రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూడా అలాంటి ఆరోప‌ణ‌లే ఉన్నాయి.

మ‌హాభారతంలో కూడా దాన క‌ర్ణుడే ఒక్క‌డే ఉన్నాడు. అలాంటిది క‌లియుగంలో బాబు పిలుపు అందుకుని వందలాది మంది దాన‌క‌ర్ణులు వ‌చ్చి, పేద‌ల్ని పైకి తీసుకొస్తారంటే న‌మ్మేదెట్టా? ఉదాహ‌ర‌ణ‌కు లూలూ సంస్థ‌నే తీసుకుందాం. వేల కోట్ల భూమిని ఒక కంపెనీకి క‌ట్ట‌బెట్టి, వంద‌లాది మంది చిన్న వ్యాపారుల దుకాణాలు మూత‌ప‌డేలా చేసి, కొంత మందికి ఉపాధి క‌ల్పిస్తే, ఉద్యోగాలు ఇచ్చిన‌ట్టు అవుతుందా? రాష్ట్రం పేద‌రికంతో వుందంటే, దానికి ప్రధాన కార‌కుల్లో చంద్ర‌బాబే అగ్ర‌గ‌ణ్యుడు.

ఎందుకంటే ఇంత వ‌ర‌కూ ఎక్కువ కాలం మ‌న‌ల్ని పాలించింది, పాలిస్తోంది ఆయ‌నే కాబ‌ట్టి. మంచి ప‌రిపాల‌న చేస్తే, ప్ర‌జ‌లకు జీవ‌నోపాధి క‌లుగుతుంది. మ‌రెవ‌రో విదిల్చే ఎంగిలి మెతుకులు తినాల్సిన దుస్థితి ఏపీ స‌మాజానికి అవ‌స‌రం లేద‌ని పాల‌కులు గ్ర‌హించాల్సి వుంది.

28 Replies to “పేద‌రిక సృష్ట‌క‌ర్త‌లు.. దాన్ని నిర్మూలిస్తార‌ట‌!”

  1. P4- పథకం కాదు అది ఒక సామాజిక బాధ్యత ..

    జగ్లక్ gaadu 5 ఇయర్స్ మింగబెట్టినది ఇప్పుడు కూటమి సరిదిద్దుతుంది.

    Jai Kootami Jai JSP

  2. ప్రాజెక్టులు అంటూ రాసావు ..సరే .. తండ్రి పేరు రాసి కొడుకు పేరు ఎందుకు చెప్పలేక పోతున్నావు ..

  3. మన కడుపుమంట ని ఇలా ఆర్టికల్ రాతల్లో వెళ్లగక్కితే.. కాస్తయినా ఉపశమనం దక్కుతుందనేది.. మానవ నైజం..

    సంవత్సరానికి 15000 ముష్టి పడేస్తే.. పేదలు ధనికులు అయిపోతారనేది.. మన వెంకట్ రెడ్డి నమ్మకం..

  4. Rey pichha naa kodaka…chillara teeskoni chetha rathalu Enduku raa rastav…aa ys family edo painundi digi vachhinattu tega mostunnav..valla dopidi sommu tinnav nuv kuda…anduke entasepu CBN meda padi edustav. Aa ys family lekundaa unte AP ippudu no1 state ayyundedi… Irrigation project lu CBN time lo kattinavi nee kantii kanipinchav ra gottam gaa…kallalo jagan gadidi pettukunte anthe mari

  5. ఈ ఆర్టికల్ రాసినోడికి మతి స్థిమితం తప్పిందేమో అనిపిస్తుంది, లేకపోతే అసూయ ద్వేషం కక్కాడు పబ్లిక్ గా

  6. ///అవునన్నా కాదన్నా పొలవరం ఘనత Y.-.S.-.R దె!///

    .

    డౌటే లెదు! వీడికి కూడా లండన్ మందులు ఇవ్వండి!!

  7. లెవెనన్న 10 లక్షల్ కోట్లు అప్పు దెంకొచ్చి, అందులో సగం కొట్టేసి, మిగతాదానికి జనవరి లో బటన్ నొక్కీతే జూన్ లో అరకొరగా అకౌంట్స్ లో వేసి ప్రజలందరినీ కోటేశ్వరులని చేసేసాడు కదా మావోడు.. ఇంకెక్కడి పేదలు??

  8. మొన్న TVలొ పాస్టర్ గారిది హత్యె.. అని మొండిగా వాదించె వారిని చూసా… ఇప్పుడు వీడిని చూస్తున్నా!

    .

    కొందరు అంతె!! వారు పట్టుకున్నా కుందెలుకు మూడె కాళ్ళు! మీరు ఎన్ని సాక్షాలు అన్న చూపించండి. కొందరు అంతె!

Comments are closed.