కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?

పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి కావలిస్తే.. పార్టీ తరఫున సెపరేట్ పోర్టల్ నడుపుకోవచ్చు

చంద్రబాబునాయుడు మంగళవారం నాడు తన కుప్పం పర్యటనలో ‘జననాయకుడు’ అనే పోర్టల్ ను ప్రారంభించారు. ప్రజలు తమ ఎమ్మెల్యే లేదా, ఎంపీలకు తమ ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు చెప్పుకునే ఆన్ లైన్ పోర్టల్ ఇది. కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ఈ పోర్టల్ ను ప్రారంభించారు.

నిజానికి ఇది చాలా మంచి ఏర్పాటు. నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా సరే.. పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడి కౌంటర్లనుంచి తమ సమస్యలను పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఫిర్యాదులు రిజిస్టర్ చేయడం మాత్రమే కాదు. వాట్సప్ ద్వారా కూడా సమాచారం ఇవ్వడానికి వెసులుబాటు కల్పించారు.

అయితే ఈ పోర్టల్ తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహిస్తున్న పోర్టల్ లాగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధినేత. గెలిచి, ముఖ్యమంత్రి అయిన తర్వాత.. యావత్ రాష్ట్ర ప్రజలకు ఆయన నాయకుడు కదా? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనే దానితో నిమిత్తం లేకుండా.. అన్నిచోట్లా ప్రజలు తమ కష్టాలు చెప్పుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేది కదా..? అనేది ప్రజల సందేహంగా ఉంది.

బహుశా ఈ పోర్టల్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాల ప్రజలు కూడా రిజిస్టరు చేసుకునే అవకాశం ఉండవచ్చు. కానీ, ఒకసారి రిజిస్టరు చేసిన తర్వాత.. ఆ పని కోసం వారు తెలుగుదేశం నేతల చుట్టూనే తిరుగుతూ ఉండాల్సి వస్తుంది.

ఇలాంటి మంచి ఏర్పాటును, ఆలోచనను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా.. ప్రభుత్వం తరఫున మొత్తం 175 నియోజకవర్గాలకు అమల్లోకి తీసుకువచ్చే ఆలోచన చంద్రబాబు ఎందుకు చేయడం అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

పార్టీ వ్యవహారాలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి కావలిస్తే.. పార్టీ తరఫున సెపరేట్ పోర్టల్ నడుపుకోవచ్చునని.. కష్టాలు, కన్నీళ్లు చెప్పుకునే పోర్టల్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారికి సమానంగా అవకాశం ఇవ్వాలి కదా.. ప్రభుత్వం తరఫున దానిని నిర్వహిస్తే ఆటోమేటిగ్గా అధికారుల్లో కూడా జవాబుదారీతనం ఉంటుంది కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

7 Replies to “కష్టాలు చెప్పుకునే హక్కు కూడా లేదా?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. నీ దగ్గర ఊడిగం చేసే ఆ “పలువురు” కి చెప్పు..

    ఈ పోర్టల్ ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్ట్ గా కుప్పం లో మాత్రమే స్టార్ట్ చేశారు.. 3 నెలలు పరిశీలించాక .. సత్పలితాలను ఇస్తే.. లేదా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటె.. అన్నీ కరెక్ట్ చేసుకుని.. తొందరలోనే 175 నియోజకవర్గాల్లో ఇంప్లీమెంట్ చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది..

    ..

    కాబట్టి.. ఆ “పలువురు” ఉచ్చా ఆపుకుని జరిగే ప్రగతి ని గమనిస్తూ ఉండమని చెప్పు..

    గత ఐదేళ్లు నిద్రపోయారు.. ఇప్పుడే లేచి మొత్తం చిటికె లో అయిపోవాలని తొందర పడిపోతున్నారు..

    ప్రభుత్వం మీకు నచ్చినట్టు నడవదు.. మాకు నచ్చినట్టు నడుస్తుంది.. ఎందుకో అర్థం చేసుకుంటే బాగుపడతారు..

  3. జగన్ దగ్గర జనాల నుండి దొబ్బేసిన వేల కోట్లు వున్నాయి. సొంత కంపెనీల్లో వందల మంది వున్నారు.

    చిటికెలో ఇలాంటి వెబ్సైట్లు పోటీగా తయారుచేయవచ్చు.

    ఇంటికి వచ్చిన జనాలని చూడటానికే వొళ్ళు బద్దకం.

    పైగా డబ్బు కజేయడమే కానీ ఖర్చు అంటే అసలు కుదరదు కదా.

Comments are closed.