తారక్ గురించి తెరవెనక మాత్రమే..!

ఎన్టీఆర్ హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమంట.

కొన్ని రోజుల కిందట స్ట్రీమింగ్ కు వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో దర్శకుడు బాబీతో చిట్ చాట్ చేశారు బాలకృష్ణ. బాబి డైరక్ట్ చేసిన సినిమాలన్నింటి గురించి అడిగి, జై లవకుశ గురించి, ఎన్టీఆర్ గురించి మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

దీనిపై సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్ నడించింది. ప్రతిసారి ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా.. లేక ఈసారి ఆహా యాజమాన్యం ఎన్టీఆర్ పేరును కట్ చేసిందా అనే చర్చ జోరుగా సాగింది. ఎట్టకేలకు ఈ వివాదంపై దర్శకుడు బాబి స్పందించాడు.

“అన్ స్టాపబుల్ లో అంత డ్రామా జరగలేదు. ఎన్టీఆర్ పేరును కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. స్క్రీన్ పై వచ్చిన ఫొటోల గురించి మాత్రమే బాలయ్య అడిగారు. నేను వాటికి సమాధానం చెప్పాను. అంతే జరిగింది. ఇక షో మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తుంటాయి. ఆ గ్యాప్ లో ఓ సినిమా టాపిక్ వచ్చింది. అలాంటి సినిమాలో మా తారక్ అయితే చాలా బాగుంటాడని నాతో బాలయ్య అన్నారు. రికార్డ్ కాకపోవడం వల్ల అది బయటకు రాలేదు.”

ఇలా జరిగిన తప్పును కవర్ చేసే ప్రయత్నం చేశాడు బాబి. అంటే, ఎన్టీఆర్ గురించి షూట్ గ్యాప్స్ లో మాట్లాడుకుంటారు కానీ, ఆన్ రికార్డ్ ప్రస్తావించరన్నమాట. ఈ సందర్భంగా మరో వివరం కూడా బయటపెట్టాడు బాబి.

ఎన్టీఆర్ హీరోగా తన డైరక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమంట. 2-3 సార్లు ఆ సినిమా గురించి బాబితో బాలయ్య మాట్లాడారంట. అలా తెరవెనక మాట్లాడుకుంటారు కానీ, కెమెరా ముందు మాత్రం ఎన్టీఆర్ పేరు, ఆయన సినిమాల్ని ప్రస్తావించరన్నమాట.

ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ.. బాబి మాత్రం అదేమంత పెద్ద ఇష్యూ కాదంటున్నాడు. “ఓ ఫ్యామిలీ మేటర్ ను మనమే పెద్దది చేస్తున్నాం” అనేది ఆయన అభిప్రాయం.

5 Replies to “తారక్ గురించి తెరవెనక మాత్రమే..!”

  1. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి

Comments are closed.