హీరోయిన్లపై కక్ష కట్టిన హీరో?

హీరో అడివి శేష్ తో చెడ్డ చిక్కొచ్చి పడింది. అతడికి ఏ హీరోయిన్ ఓ పట్టాన నచ్చట్లేదు.

హీరో అడివి శేష్ తో చెడ్డ చిక్కొచ్చి పడింది. అతడికి ఏ హీరోయిన్ ఓ పట్టాన నచ్చట్లేదు. షూటింగ్ కానిచ్చేసి మరీ సినిమా నుంచి తీసేస్తున్నాడు. మొన్నటికిమొన్న శృతిహాసన్ విషయంలో ఇలానే జరిగింది.

డెకాయిట్ లో అడివి శేష్, శృతిహాసన్ హీరోహీరోయిన్లు. ఒకట్రెండు షెడ్యూల్స్ కూడా చేశారు. అంతలోనే ఏమైందో ఏమో శృతిహాసన్ తప్పుకుంది. ఆమె తప్పుకుంది అనే కంటే, అడివి శేష్ పొగబెట్టి పంపించేశాడంటారు చాలామంది. ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ప్రస్తుతానికి బండి లాగిస్తోంది.

డెకాయిట్ తో పాటు జీ2 (గూఢచారి 2) చేస్తున్నాడు అడివి శేష్. ఆశ్చర్యంగా, ఈ సినిమా నుంచి కూడా హీరోయిన్ ను తొలిగించినట్టున్నాడు శేష్. ఈ ప్రాజెక్టులో ముందుగా బనితా సంధును హీరోయిన్ గా తీసుకున్నారు. డెకాయిట్ లో జరిగినట్టే, ఇక్కడ కూడా బనితా సంధుతో షూటింగ్ చేశారు.

గుజరాత్ లోని భుజ్ లో జరిగిన షెడ్యూల్ లో బనితా జాయిన్ అయింది. అంతలోనే ఏమైందో ఏమో.. ఈరోజు సడెన్ గా వామికా గాబిని హీరోయిన్ గా ప్రకటించారు. యూరోప్ లో జరిగిన షెడ్యూల్ లో ఆమెతో షూటింగ్ కూడా చేశారు.

వామికా గాబీకి తెలుగులో ఇది రీఎంట్రీ. 2015లో వచ్చిన ‘భలే మంచి రోజు’ అనే సినిమాలో ఈమె నటించింది. మళ్లీ ఇన్నాళ్లకు గూఢచారి-2లో కనిపించబోతోంది. ఈ నెల్లోనే గూఢచారి-2 నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు.

4 Replies to “హీరోయిన్లపై కక్ష కట్టిన హీరో?”

  1. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

  2. పాపం ఐటి జాబ్ అమ్మాయిలకన్నా ఘోరంగా ఉంది ఈ హీరోయిన్ ల పరిస్తితి…

Comments are closed.