వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?

వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇపుడు మరో సారి బలంగా వినిపిస్తోంది.

విశాఖలో రైల్వే జోన్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న ప్రారంభిస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని అనుకున్నా దాని మీద అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు డివిజన్ అన్నది విశాఖలో నూటా యాభై ఏళ్ల నుంచి ఉంది, మంచి లాభాలతో నడితే డివిజన్ ఆరేళ్ల క్రితం ఎత్తేశారు.

రైల్వే జోన్ ప్రకటనతోనే దానిని ముక్కలు చేశారు. కొత్తగా రాయగడలో డివిజన్ ని ఏర్పాటు చేసి కీలక ప్రాంతాలను అందులో విలీనం చేశారు అన్న విమర్శలు ఉన్నాయి. వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇపుడు మరో సారి బలంగా వినిపిస్తోంది.

రైల్వే జోన్ ని ఏర్పాటు చేయడానికి పదేళ్లకు పైగా జాప్యం ఎందుకు జరిగింది అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 2019 మార్చిలో రైల్వే జోన్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఈ రోజుకూ పునాది రాయి వేయకపోవడానికి కారణాలు ఏంటని అంటున్నారు.

రైల్వే జోన్ కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఎందుకు విడుదల చేయలేదని కూడా లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నిస్తున్నారు. విశాఖ వస్తున్న ప్రధాని వాల్తేరు డివిజన్ మీద స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు.

కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని వాల్తేరు, గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్ల పరిధిలోని పనుల కోసం ఒక జీఎం స్థాయి అధికారిని నియమించాలని కోరారు వాలేరు డివిజన్ ని పునరుద్ధరించాలని దానిని ఆంధ్ర ప్రాంతంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేసారు.

ఇవేమీ కాకుండా రైల్వే జోన్ కి శంకుస్థాపన చేసి ఏమి చేయాలనుకుంటున్నారో ప్రజలకు అర్ధం కావడం లేదని ఆయన తప్పు పట్టారు. రైల్వే జోన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలలో ఏర్పడిన అనేక సందేహాలను నివృత్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

7 Replies to “వాల్తేరు డివిజన్ లేకుండా రైల్వే జోనా?”

  1. ఎం చేద్దాం..రాజకీయాలు ని బట్టే నిర్ణయాలు ఇక్కడ.. పక్కన ఒడిషా లో బీజేపీ ప్రభుత్వం వుంది…. వచ్చిన కాడికి తీసుకోవడమే. ..జగ్ డు ని గెలిపించిన పాప పరిహారం.. జనాలు కనీసం మన మీద కేంద్ర ప్రభుత్వం ఈ సారి ఆధార పడే విధంగా కూటమిని గెలిపించుకున్నారు…సంతోషిద్దాం.

  2. 5 ఏళ్లు జగన్ కేంద్రం వెనక పడకుండా ఏమి చేసినట్లు? 5 ఏళ్లక్రితం వాళ్ళు అడిగిన 50 ఎకరాలు కూడా పల్లంలో ఉందని వేరేది ఇమ్మని అడిగితే ఇవ్వకుండా కాలక్షేపం చేస్తే శంఖుస్తపాన ఎలా జరుగుతుంది? తెచ్చుకోవాల్సింది వెనక పడాల్సింది రాస్ట్రం కదా. “నా కేంటిట” అని కేంద్రం నుంచి కూడా లంచం ఆశించి, ఇప్పుడు ఇన్నాళ్లయిపోయిందేమిటి అని ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? వాల్తేరు డివిజన్ గురించి ఎప్పుడైనా జగన్ అడిగాడా లేక ఎప్పుడు కేసులగురించి కాళ్ళ బేరమేనా?

  3. ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి

Comments are closed.