విజ‌న్-2020 పాయె.. బాబు విజ‌న్ 2047 !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపు రేఖ‌లు మార్చ‌డానికి విజ‌న్ 2020 ల‌క్ష్యంతో ప‌ని చేస్తాన‌ని అప్పుడెప్పుడో 1995లో ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. అప్ప‌ట్లో బాబు ప్ర‌చారం నిజ‌మే అని న‌మ్మిన వాళ్లు…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రూపు రేఖ‌లు మార్చ‌డానికి విజ‌న్ 2020 ల‌క్ష్యంతో ప‌ని చేస్తాన‌ని అప్పుడెప్పుడో 1995లో ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. అప్ప‌ట్లో బాబు ప్ర‌చారం నిజ‌మే అని న‌మ్మిన వాళ్లు ఎక్కువే. 2020 సంవ‌త్స‌రానిక‌ల్లా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం రూపురేఖ‌లు మారిపోతాయ‌ని ఎన్నెన్నో క‌ల‌లు. బాబు అనుకూల మీడియా బాబు విజ‌న్ -2020 గురించి అబ్బో ఆకాశ‌మే హ‌ద్దుగా ఊద‌ర‌గొట్టింది.

2004లో వైఎస్సార్ అధికారంలోకి వ‌చ్చారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వైఎస్సార్ నాయ‌క‌త్వంలో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ద‌క్కించుకుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు అదే ఏడాది వైఎస్సార్ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. అనంత‌రం రాష్ట్ర విభ‌జ‌న‌కు దారి తీసింది. విభ‌జిత ఏపీకి చంద్ర‌బాబునాయుడు మొట్ట‌మొద‌టి సీఎం అయ్యారు. బాబు ఐదేళ్ల పాల‌న ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదుర్కొంది. 2019లో జ‌గ‌న్‌, మ‌ళ్లీ ఐదేళ్ల తిరిగే స‌రికి బాబు సీఎం.

ఇప్పుడాయ‌న మ‌ళ్లీ మొద‌లెట్టారు. ఇప్పుడేమంటున్నారంటే విజ‌న్‌-2047 నినాదాన్ని ఎత్తుకోవ‌డం విశేషం. నీతి ఆయోగ్ సీఈవో అధికారుల‌తో చంద్ర‌బాబు స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఆయ‌న మ‌న‌సులో మెరుపులాంటి ఆలోచ‌న. విక‌సిత్ భార‌త్ -2047 ప్ర‌ణాళికను కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధం చేయ‌డాన్ని బాబు స్ఫూర్తిగా తీసుకున్నారు. విక‌సిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ -2047 కోసం నీతిఆయోగ్ అధికారుల‌తో చంద్ర‌బాబు చ‌ర్చించ‌డం విశేషం.

ఈ స‌మావేశంలో విజ‌న్ -2020 ల‌క్ష్యం, త‌న అనుభ‌వాల్ని నీతిఆయోగ్ అధికారుల‌తో చంద్ర‌బాబు పంచుకున్నార‌ని స‌మాచారం. 2047 నాటికి పేద‌రికం లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను త‌యారు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా సంపద సృష్టికి ప‌నికొచ్చే విధానాలకు విజన్‌ డాక్యుమెంట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని చంద్ర‌బాబు చెప్ప‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిందని అంటున్నారు.

10 Replies to “విజ‌న్-2020 పాయె.. బాబు విజ‌న్ 2047 !”

  1. … ఐనా వికసిత భారత్ లో వికసిత ఆంధ్రా కూడా ఉంటుంది కదా…మరి ఇక సెపరేట్ విజన్ ఎందుకు…!!

  2. Akkada babu plans ikkada ikkada son already working by hatching eggs aka sampada “srusti”. Looks like he forgot sampada and behind “srusti” as the quote by babu in last term “more population”

  3. విజన్ 2020కి దోపిడీ,దౌర్జన్యం,అరాచకం విజన్ అధికారంలోకి రావడం వల్ల విజన్2047 రావాల్సి వచ్చింది

    1. ఈ ఎర్రిపూకు విజనువాళ్లేరాష్ట్రం ముక్కలైంది. కేసీఆర్ నీ తొక్కాడు- వాడెల్లి తెలంగాణ తెచ్చాడు.

  4. అక్కడ బాబు plans ఇక్కడ already వర్కింగ్ hatching ఎగ్స్ అనగా సంపద సృష్టి. సంపద మరచి only “సృష్టి” లోనే నిమగ్న అయ్యాడు, as per babus quote in last election “AP needs more population”

  5. విజన్2047??? హహహ.. వీడు వీడికున్న రోగాలకి 2029 చూడటం కూడా కష్టమే.

  6. బొల్లి గాడు పెద్ద శని నాయలు- విజన్2020 అన్నాడు.. రెండు ముక్కలు అయ్యింది. 2047 ఇంకెన్ని సంకలు నాకిస్తాడో మన రాష్ట్రాన్ని.

Comments are closed.