చౌదరి గారి ఏడుపు ఎవరు తీర్చగలరు?

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని సామెత. కానీ ‘కమ్మ’ని కలలు పంచుకుంటే.. ఆ దెబ్బ ఖజానా మీద పడిందనేదే ఇప్పుడు అనేక మంది ఏడుపు? వారి ఏడుపును తీర్చడం ఎవరికి సాధ్యం? వారి దుఃఖాన్ని…

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని సామెత. కానీ ‘కమ్మ’ని కలలు పంచుకుంటే.. ఆ దెబ్బ ఖజానా మీద పడిందనేదే ఇప్పుడు అనేక మంది ఏడుపు? వారి ఏడుపును తీర్చడం ఎవరికి సాధ్యం? వారి దుఃఖాన్ని ఆర్చేదెవరు? తీర్చేదెవరు? ప్రస్తుతం వారి బాధ కూడా అదే.

వారి విలాపాలను పట్టించుకుని.. వారి స్వలాభాలను పెంచి పోషించే వాడిని జనం ఛీకొట్టి ఇంటికి పరిమితం చేశారు. అందుకే వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతూ గోలగోలగా ఏడుస్తున్నారు. వారి ఏడుపులకు కారణాలు, వాటి వెనుక రహస్యాలను కూడా కొడాలి నాని శాసనసభలో స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు జనం మొత్తం.. ‘ఓహో వారి ఏడుపులు ఇందుకా?’ అని విస్తుపోతూ నవ్వుకుంటున్నారు. 

ఇంతకూ సంగతి ఏంటంటే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే 72 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడు అచ్చమైన నికార్సయిన తెలుగుదేశం వాది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో ఆయన లక్ష్మీపార్వతి వెన్నంటే ఉన్నప్పటికీ.. తర్వాతి పరిణామాల్లో గతిలేక చంద్రబాబు పంచకు చేరారు. ఇప్పటికీ అడపాదడపా చంద్రబాబునాయుడు చేతగానితనం మీద, పార్టీని పాతాళానికి తొక్కేస్తున్న ఆయన గారి పుత్రప్రేమ మీద తనకు తోచినప్పుడెల్లా సెటైర్లు వేస్తుంటారు.

ఏదో కులసమీకరణల దృష్ట్యా గతిలేక తెలుగుదేశంలో కొనసాగుతున్నాడే తప్ప.. చంద్రబాబు మీద విశ్వాసం నమ్మకం ఉన్న నాయకుడు అని ఆయన గురించి ఎవ్వరూ అనుకోరు.

అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా చంద్రబాబు బుట్టలో పడ్డారు. ‘కమ్మ’టి రాజధాని వస్తుందని గ్రాఫిక్స్ చంద్రబాబు చేసిన మాయాజాలానికి టెంప్ట్ అయ్యారు. ఉన్నపళంగా అమరావతి ప్రాంతంలో తతిమ్మా తెలుగుదేశం నాయకులు అనేకమంది మాదిరిగా వెంటనే భూములు కొనేస్తే.. ఒకటిరెండేళ్లు తిరిగేసరికెల్లా కుబేరులు అయిపోవచ్చని.. రాజధాని రాగానే కోట్లకు పడగలెత్తుతామని ఆయన అనుకున్నారు.

అయితే సమయానికి చేతిలో డబ్బు లేదు. కానీ అమరావతి రాజధాని గురించి చంద్రబాబునాయుడు ఊదరగొడుతున్న మాటలు ఆయనను నిలువనీయలేదు. ఆశను పెంచాయి. రాజమండ్రిలో తనకున్న భూములను అమ్ముకుని మరీ అమరావతిలో పొలాలు కొన్నారు. ఆ రకంగా ఆయన అమరావతి పొలాలను ఒక్కొక్కటీ కోటి రూపాయల వంతున మూడు ఎకరాలు కొన్నారు. ఇప్పటికి ఇన్నేళ్లు గడిచాయి.

అమరావతి కాదు అది భ్రమరావతి అని తేలిపోయింది. ఆయన కొన్న భూములు మూడు నుంచి అతి కష్టమ్మీద నాలుగున్నర కోట్ల దాకా వెళ్లాయి. కానీ.. రాజమండ్రిలో ఆయన ఏ భూములనైతే ఆయన మూడు కోట్లకు తెగనమ్ముకున్నారో.. ఆ భూముల ప్రస్తుత విలువ అమాంతం పన్నెండు కోట్లకు పెరిగిపోయింది. 

కళ్లెదురుగా ఇంత భారీ నష్టం సంభవిస్తే ఎవరికి మాత్రం కళ్లమ్మట రక్తాశ్రువులు స్రవించకుండా ఉంటాయి. అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుఃఖానికి అంతులేకుండా పోయింది. అమరావతి రాజధాని గురించి ఆయన వల్లమాలిన ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతుంటారు. లోలోపల పెరగని ధరల గురించి విలపిస్తుంటారు. 

మొత్తానికి ఈ సీక్రెట్ మొత్తం కొడాలి నాని శాసనసభ సాక్షిగా.. బయటపెట్టారు. ఈ రకంగా చంద్రబాబునాయుడు కమ్మటి మాటలను నమ్మి.. తమ తమ ఊర్లలో ఉన్న విలువైన ఆస్తులను తెగనమ్ముకుని అమరావతిలో పెట్టుబడులు పెట్టి.. పేదలను వంచించి భూములు కొని.. ఇప్పుడు భోరుమంటున్న చౌదరి గార్లు ఇంకా ఎందరున్నారో ఏమిటో? అని జనం, తగిన శాస్తి జరిగిందని, నవ్వుకుంటున్నారు.