చీపురుపల్లి, భీమిలి సీట్ల విషయంలో సస్సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నా, చివరకు ఆ రెండూ సీనియర్లకే ఇస్తారని, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులకే ఆ రెండూ ఫిక్స్ చేసి వుంచారని ‘గ్రేట్ ఆంధ్ర’ ముందే చెప్పింది. అప్పటి వరకు జరిగేది అంతా జస్ట్ ఏదో చేస్తున్నారు అని సీన్ క్రియేట్ చేయడానికి తప్ప వేరు కాదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అదే జరిగింది.
చీపురుపల్లి నుంచి కళా వెంకటరావుకు, భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావుకు పోటీకి టికెట్ లు ఇచ్చేసారు. గంటా విషయంలో చినబాబు లోకేష్ అంత సంతృప్తిగా లేరని, అందుకే ఆలస్యమైందని వార్తలు వున్నాయి.
అయితే కనీసం నలుగురు అసెంబ్లీ అభ్యర్దుల ప్రచారానికి కావాల్సిన ఆర్థిక మద్దతును సమకూర్చడానికి గంటా ఆఫర్ ఇచ్చారో, ఆఫర్ తీసుకున్నారో, మొత్తానికి ఆ విధంగా డీల్ కుదరిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ప్రాంతాల వారీగా కొన్ని సీట్లు ఈ విధంగానే ఇచ్చారు. పార్టీ మీద ఆర్థికభారం పడకుండా ఎక్కడిక్కడ సర్దుబాటు అయ్యేలా కొంత మంది సౌండ్ పార్టీలను ఎంపిక చేసి, అవకాశాలు ఇచ్చారు. నెల్లూరు, గుంటూరు, విజయవాడ, అనకాపల్లి, విశాఖ ఇలా పలు చోట్ల ఓ పది మంది వరకు ఇలాంటి వారు వున్నారు.
దాని వల్ల కనీసం 70 మంది వరకు అభ్యర్ధులకు వీరు ఆర్థికంగా అండగా వుంటారు. మిగిలిన వారిలో వారికి వారు చూసుకోగలిగిన వారు సగం మంది అయినా వుంటారు. ఓ ముఫై, నలభై మందికి పార్టీ చూడాల్సి వుంటుంది. తప్పదు.
ఇదిలా వుంటే చీపురుపల్లిని నమ్ముకుని కళా వెంకటరావు బంధువు నాగార్జున గత అయిదేళ్లుగా చాలా కష్టపడ్డారు. ఖర్చు పెట్టారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతూనే వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నారు. ఇప్పుడు మరి రాజీనామా అంటున్నారు. దానికేముంది.. ఏ ఎమ్మెల్సీనో, మరోటో మాట ఇస్తారు. సైలంట్ అవుతారు. అది కామన్ నే. కానీ ఎన్నికల వేళ ఏ మేరకు సిన్సియర్ గా కోపరేట్ చేస్తారు అన్నది డౌటు. అది ఏ నియోజకవర్గమైనా.