మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. వివేకా హత్య కేసులో సాక్ష్యులను అవినాష్ ప్రభావితం చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ నిందితుడు దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
దస్తగిరి పిటిషన్లో పేర్కొన్న అంశాలపై అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు తిప్పి కొట్టారు. అవినాష్‌రెడ్డి ఏ ఒక్కరినీ బెదిరించలేదని, సాక్ష్యులను ప్రభావితం చేయలేదని అవినాష్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవినాష్ తరపు న్యాయవాదుల వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. దస్తగిరి పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. దీంతో అవినాష్‌రెడ్డికి ఎన్నికల సమయంలో భారీ ఊరట లభించినట్టైంది.
అలాగే ఇదే కేసులో అవినాష్‌రెడ్డి తండ్రి ఏడాదిగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వృద్ధాప్య, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భాస్కర్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. ఇదే కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్‌యాదవ్‌లకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఒకే రోజు తండ్రీతనయుడికి న్యాయ స్థానం ఊరట ఇవ్వడం విశేషం.