హోం మంత్రిగా అనితకి ఎన్ని మార్కులు?

ఉత్తరాంధ్రకు హోం మంత్రి గతంలో ఒకసారి దక్కింది. మళ్ళీ మూడున్నర దశాబ్దాల తరువాత ఉమ్మడి విశాఖకు చెందిన వంగలపూడి అనితకు ఈ ఉన్నతమైన పదవి లభించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళా…

ఉత్తరాంధ్రకు హోం మంత్రి గతంలో ఒకసారి దక్కింది. మళ్ళీ మూడున్నర దశాబ్దాల తరువాత ఉమ్మడి విశాఖకు చెందిన వంగలపూడి అనితకు ఈ ఉన్నతమైన పదవి లభించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళా ప్రజా ప్రతినిధికి ఈ పదవి దక్కడం అంటే గొప్పగానే చెబుతున్నారు.

హోం మంత్రిగా అనిత నెల రోజుల పాలన ఎలా ఉంది అన్న చర్చకు తెర లేస్తోంది. అనిత హో మంత్రిగా వంద రోజుల ప్రణాళికను ప్రకటించారు. అందులో మూడవ వంతు పూర్తి అయింది. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతామని అన్నారు.

అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలోని అనకాపల్లి, విజయనగరం లో మహిళలల మీద జరిగిన అత్యాచార ఘటనలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటనల మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.

అనిత హోం మంత్రి అయ్యాక అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయని ఆరోపిస్తోంది. అయితే హోం మంత్రి సమర్ధంగా పాలిస్తున్నారు అని టీడీపీ అంటోంది. కానీ ఎన్నడూ లేని విధంగా రాజకీయ దాడులు విద్వేషం ఘర్షణలు బాగా చోటు చేసుకున్నాయని వైసీపీ అంటోంది. అలాగే మహిళలు చిన్నారుల మీద దాడులకు కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే అని అంటున్నారు.

ఉమ్మడి విశాఖలో ఏకైక మంత్రిగా ఆమె జిల్లాలో పట్టు సాధించాల్సి ఉందని అంటున్నారు. సీనియర్లు అంతా విశాఖ జిల్లాలో ఉన్నారు. మూడు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రతిపక్ష వైసీపీకి ఇదే జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీటు లభించింది.

దాంతో జిల్లా రాజకీయాల మీద సైతం అనిత పట్టును పెంచుకోవాలని అంటున్నారు. హోం మంత్రి మహిళగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందని కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు అని వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు కూడా హోం మంత్రి జవాబు చెప్పాల్సి ఉంది అంటున్నారు. మూడు హత్యలు ఆరు రేపులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపిస్తున్నారు.

29 Replies to “హోం మంత్రిగా అనితకి ఎన్ని మార్కులు?”

  1. ఈ రోజు మన అన్నయ్య చేసిన శవ విజయ యాత్రకు ఎన్ని marks GA….. ఐనా మన అన్నయ్య స్పీచ్ లతో అదరగొడుతుంటే ఒక్క ఆర్టికల్ కూడా రాయలేదేంటి GA….😂😂

  2. ఒక్క నెలలోనే మార్కులు వేస్తె …. జగనన్న కు ఎన్ని మార్కులు వేయాలి ?

    1. అమ్మడు పక్కా హిందూ కాదు! బైబిల్ వెంటఉంచుకుంటుందని ఆమె చెప్పింది!

  3. వైసీపీ లో అయితే వనిత గారికి కానీ సుచరిత గారికి కానీ ఏ పని ఉండదు అది ఎలాగూ అలంకార పదవి కాబట్టి ఎవరో రెడ్డి గారు చూసుకొంటారు ఆవిడ పని పెట్టమన్న కాడ సంతకం పెట్టడమే టీడీపీ లో అయితే కనీసం 80 % వరకు అనిత గారు స్వతంత్రం గ చేసుకొంటారు టీడీపీ జనసేన లో బాబు పవన్ లోకేష్ గార్లు ఎప్పుడు ప్రెస్ కి అందుబాటులో వుంటారు అందులో కోడలి రోజా పేర్ని సజ్జల అందుబాటులో వుంటారు ఇక అనిత గారు జాగ్రత్తగా ఉండాలి వైసీపీ నేపథ్యం చెన్నారెడ్డి గారిని సీఎం పదవి దింపటానికి అనేక మందిని చంపించిన చరిత్ర సానుభూతి కోసం బాబాయిని వేసేసిన చరిత్ర simpathy కోసం రంగ గారిని వేసేసి టీడీపీ మీద తోసేసిన చరిత్ర వున్నా పార్టీ తో తలపడాలి వాళ్లే అల్లరులు సృష్టించి ప్రభుత్వ వైఫల్యం అని దాంట్లో టీడీపీ పాత్ర ఉందని చెప్పే సమర్థులు

  4. లా అండి ఆర్డర్ సరిగా ఉండుటకు ఇంకా కొంత సమయము పట్తుంది అని ఆమె చెప్పారు! దాని అర్థము- అమ్మ కంట్రోల్ లో లేదు అనే కదా! She is unfit to be a home minister!

  5. పరదాలు లేవు. హెలికాప్టర్లు లేవు. అధికారం లేదు. నేలమీద నిర్భయంగా సురక్షితంగా తిరగ గలుగుతున్నాdu jagan ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి? vaadi పాలనలో లేని రక్షణ కూటమి పాలనలో ఉందనడానికి jagane 100 markulu istunnadu

  6. పరదాలు లేవు. హెలికాప్టర్లు లేవు. అధికారం లేదు. నేలమీద నిర్భయంగా సురక్షితంగా తిరగ గలుగుతున్నావు. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి? నీ పాలనలో లేని రక్షణ కూటమి పాలనలో ఉందనడానికి..

  7. పరదాలు లేవు. హెలికాప్టర్లు లేవు. అ ధికారం లేదు. నేలమీద ని ర్భయంగా సు రక్షితంగా తిరగ గలుగుతున్నావు. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..నీ పాలనలో లేని ర క్షణ కూ టమి పాలనలో ఉందనడానికి

Comments are closed.