వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వంశీలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో, టీడీపీ ఈ ఇద్దరు నేతలను వదిలేసిందా?

ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కక్షపూరిత రాజకీయాలకు పెద్ద పీట వేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని తెలిసినా తమ ప్రత్యర్థి పార్టీలను, నాయకులను, కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బందులకు గురి చేయడం అనేది అధికారంలో ఉన్న పార్టీ తమ జన్మహక్కుగా భావిస్తోంది. ఇందులో ఏ పార్టీ మంచిది, చెడ్డది అని చెప్పడం కష్టం. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను అరెస్టు చేయకపోయినా, ఇబ్బందులకు గురిచేయకపోయినా, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు కూడా నిలదీస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలు కొంత మంది నాయకులను టార్గెట్‌ చేసుకున్నా, ఈ ఏడాది వారు అరెస్టుల వరకు వెళ్లలేదు. మరి వచ్చే ఏడాది అయినా వారి అరెస్టులు ఉంటాయా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

కొడాలి నాని, వల్లభనేని వంశీ:

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినాయకత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను టీడీపీ మొదటి టార్గెట్‌గా పెట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వారంలోపే కొడాలి నాని, వంశీల ఇళ్లపై టీడీపీ శ్రేణులు దాడులు కూడా చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టగానే ముందుగా కొడాలి నాని, వంశీ అరెస్ట్ అవుతారని భావించారు. కానీ దాదాపు ఏడు నెలలు కావస్తున్నా వారు కనీసం పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కకపోవడం గమనార్హం.

కొడాలి నాని, వంశీలకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ, ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కార్యకర్తల్లో సందేహాలను రేకెత్తిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, వంశీలపై విరుచుకుపడిన టీడీపీ నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో, టీడీపీ ఈ ఇద్దరు నేతలను వదిలేసిందా? అనే చర్చ టీడీపీ వర్గాల్లో గుసగుసలాడుతోంది.

పెద్దిరెడ్డి కేసు:

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చార్జ్‌షీట్ దాఖలు కాలేదు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో పెద్దిరెడ్డి బాధితులు అంటూ పెద్ద హంగామా న‌డిపిన ఆయ‌న‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో పెద్దిరెడ్డిపై న‌డిపిన హైడ్రామా అంత ఉత్తుతిదేనని తేలిపోయింది. టీడీపీ సోషల్ మీడియా వర్గాలు, కార్యకర్తలు మాత్రం ఈ ముగ్గురిపై వచ్చే ఏడాది అయినా వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2024లో రాజకీయ అరెస్టులు జరుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.

రాజకీయ కక్షసాధన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు చిన్న చిన్న వైసీపీ నాయకులు వందల సంఖ్యలో జైల్లో ఉన్నారు. ఇప్పటికే ఏపీలో రెడ్‌బుక్ రాజ్యం నడుస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. ఈ ముగ్గురు నాయకులను వచ్చే ఏడాది అరెస్ట్ చేస్తే, ఏపీలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగే అవకాశం ఉంది.

10 Replies to “వచ్చే ఏడాదిలో ఈ ముగ్గురు నాయ‌కులు అరెస్ట్ త‌ప్ప‌దా..!”

  1. సొల్లు అపరా అయ్యా! నెను 5 ఎళ్ళ తర్వాత కక్ష సాదింపు గుర్తుకి వచ్చిందా? కక్ష సాదింపె పరమావదిగా పరిపాల చెస్తె ఇప్పటికె ఎంతొ మంది జైల్ లొ కూర్చునె వారు!

    RRR కెసులొ చలా మంది ఇంకా బయటె తిరుగుతున్నరు! అలనె కాదంబర జత్వాని కెసు! IPS సంజయ్, RGV ఇలా ఎంతొ మంది విషయంలొ సాక్షాలు చాలా clear గా ఉన్నాయి కదా!

  2. సొల్లు అపరా అయ్యా! నెను 5 ఎళ్ళ తర్వాత కక్ష సాదింపు గుర్తుకి వచ్చిందా? కక్ష సాదింపె పరమావదిగా పరిపాల చెస్తె ఇప్పటికె ఎంతొ మంది జై.-.ల్ లొ కూర్చునె వారు!

    RRR కె.-సులొ చలా మంది ఇంకా బయటె తిరుగుతున్నరు! అలనె కాదంబర జత్వాని కె.-.సు! IPS సంజయ్, RGV ఇలా ఎంతొ మంది విషయంలొ సాక్షాలు చాలా clear గా ఉన్నాయి కదా!

  3. అప్పుడే 7 నెలలయిపోయిందా కొడాలి నాని ప్రెస్ మీట్ లో భూతుల దండకం విని..

    కొడాలి అన్న.. మా కోసం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టవా ..! నీ భూతుల పంచాంగం వినాలని ఉంది..

    ..

    ఈ పాడు లోకం నీ టాలెంట్ ని గుర్తించలేకపోతోంది..

    ముప్పై ఏళ్ళు అధికారం నాదే అని విర్రవీగిన ఒక నియంత ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత నీది..

    175 కి 175 అని రెచ్చిపోయిన ఒక నీచుడిని.. పాతాళానికి తొక్కేసిన వాయిస్ నీది..

    కౌటింగ్ రోజున 9 గంటలకే కౌంటింగ్ సెంటర్స్ నుండి పారిపోయేలా చేసిన ముష్టి నోరు నీది..

    ..

    మొత్తానికి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని శాశ్వతం గా వదిలించేసిన దరిద్రపు మొఖం నీది..

    ..

    మరొక్కసారి మరియు చివరిసారి.. నీ ప్రెస్ మీట్ కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు..

  4. 2024 అయిపొయింది .. ఇంకా వేచి చూడడం ఏమిటి .. ముందు 2025 ఒక ప్రూఫ్ రీడర్ ని పెట్టుకోండి ..

  5. కేవలం రాజకీయ కక్ష ఐతే కోర్టులు చూస్తూ ఊరుకోవు హామీలు గాలికి పాలన చేతకాని తాతయ్య

  6. peekithe geekithe Vamsi gaadini emaina chesukuntaaru..

    Jagan committed grave mistakes of accepting a polit beauro member of tdp into his party..

    everything is known, all loop holes of tdp and their income and where they did all scams..

    perhaps he wasn’t useful enough nor he is been misused to the purpose..

    very inefficient in using him.

    perhaps time to learn basics in nasty politics

Comments are closed.