జగన్ …ది బిజినెస్ మాన్

జగన్ నెమ్మదిగా ఉంటారు. సైలెంట్ గా ఉంటారు. కానీ ఆయన విజన్ మాత్రం బహు గొప్పది. జగన్ ని ఒక వైపే అంతా చూశారా లేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిగట్టుకుని విష…

జగన్ నెమ్మదిగా ఉంటారు. సైలెంట్ గా ఉంటారు. కానీ ఆయన విజన్ మాత్రం బహు గొప్పది. జగన్ ని ఒక వైపే అంతా చూశారా లేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేసి అలా చూపించిందా అన్నది తెలియదు కానీ విజనరీ అంటే జగన్ అన్న మాట ఇపుడు అంతటా వినిపిస్తోంది.

ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పని చేసుకుకోవడమే జగన్ మార్క్ ఫిలాసఫి. తాను మాట్లాడకూడదు, తన పని మాట్లాడలి అన్నది జగన్ థియరీ. అందుకే ఆయన నాలుగేళ్ల పాలన చూసినా వాటి ఫలితాలను ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు మెచ్చుకున్నాకే చాలా మందికి తెలిసింది. గ్రామ సచివాలయాలు అయితేనేమి, డోర్ స్టెప్స్ కి ప్రభుత్వ సేవలు అయితేనేమి నేరుగా లబ్దిదారును ఖాతాలోకి నగదు బదిలీ అయితేనేమి జగన్ విజన్ అన్నిటా కనిపిస్తుంది.

ఏపీకి పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదు అని అన్న వారంతా విస్తుబోయి చూసేలా జగన్ విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్ కి దేశ విదేశాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు. కార్పోరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ తొలి రోజే వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. జగన్ సైతం ఆయనకు ఎదురేగి స్వాగతం పలకడం కాకుండా హత్తుకుని సభా స్థలికి తీసుకుని వచ్చారు.

జగన్ కి కార్పోరేట్ వరల్డ్ తో ఉన్న పరిచయాలు ఏంటి అన్నది విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు చూస్తే అర్ధమవుతోంది. నవీన్ జిందాల్ కానీ అదానీ కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కానీ ఏపీని చూసి వచ్చారు అనే కంటే జగన్ తో ఉన్న పరిచయాన్ని చూసి వచ్చారనడం సబబు. ముఖేష్ అంబానీ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారు.

అలాగే పాతిక వేల కోట్ల రూపాయల దాకా టూరిజం రంగంలో పెట్టుబడులు రానున్నాయి. ఒక్క ఎన్టీపీసీ లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక జిందాల్ సంస్థ ఏకంగా పదివేల కోట్ల‌ రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని సభా ముఖంగానే సంస్థ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రకటించడం జగన్ సాధించిన ఘనతగానే చూడల్సి ఉంటుంది.

అలాగే శ్రీ సిమెంట్ సంస్థ అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఇదంతా సమ్మిట్ మొదలైన తొలి గంటలోనే వచ్చిన పెట్టుబడులుగా చూడాలి. రెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ టార్గెట్ ని దాటి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. జగన్ ది బిజినెస్ మాన్ అన్నది ఈ సమ్మిట్ తో లోకానికి తెలుస్తుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు.