ప్ర‌భుత్వాన్ని కూల్చుతారు జాగ్ర‌త్త‌!

ఎంత‌టి వారికైనా ప్ర‌జ‌లు చూస్తున్నార‌న్న భ‌యం వుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఒక్క శాతం కూడా అలాంటిది లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి రోజురోజుకూ రెచ్చిపోతున్నార‌నే అభిప్రాయం జ‌నంలో వుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల కూల్చివేత‌ల ఏకైక ఎజెండాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. త‌న‌కు రాజ‌కీయంగా గిట్ట‌ని వాళ్లంద‌రి ఇళ్లు, వ్యాపార స‌ముదాయాల్ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మున్సిప‌ల్ అధికారుల్ని అడ్డు పెట్టుకుని కూల్చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఇటీవ‌ల మున్సిప‌ల్ అనుమ‌తులు లేవ‌నే కార‌ణంతో వైసీసీ నాయ‌కుడికి చెందిన నిర్మాణాన్ని మున్సిప‌ల్ అధికారులు తాడిప‌త్రిలో కూల్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తాడిప‌త్రిలో మ‌రోసారి కూల్చివేత‌ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తాన‌ని ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. అలాగే రంజాన్ త‌ర్వాత వైసీపీ ముస్లిం నాయ‌కుడి ఇంటిని కూడా కూల్చుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

అయితే జేసీ ప్రభాక‌ర్‌రెడ్డి గుర్తించాల్సిన ప్ర‌ధాన అంశం ఒక‌టుంది. చేతిలో అధికారం వుంద‌ని, ప్ర‌త్య‌ర్థుల నిర్మాణాల‌ను ఏవో సాకుల‌తో ప‌డ‌గొట్టొచ్చు. అధికారంలో ఉన్నోళ్ల‌కు, అధికారిక యంత్రాంగం మ‌ద్ద‌తు వుంటుంది. ఉద్యోగాల్ని కాపాడుకునేందుకు ఎన్ని అడ్డ‌దారులైనా తొక్క‌డానికి సిద్ధంగా వుంటారు. అయితే ఈ కూల్చివేత‌లు… చివ‌రికి ప్ర‌భుత్వ కూల్చివేత‌కు దారి తీస్తుంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డే కాదు, అధికారంలో ఉన్న‌వాళ్లెవ‌రైనా గుర్తించాలి.

అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా బాగానే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. ఒక‌సారి అధికారం పోతే, ఇబ్బందులే అని కాలం అనేక సార్లు క‌ళ్ల‌కు క‌ట్టింది. మ‌రీ ముఖ్యంగా 2014-19 మ‌ధ్య అధికారంలో ఉన్న‌ప్పుడు ఓవ‌రాక్ష‌న్ చేయ‌డంతో వైసీపీ పాల‌న‌లో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌రిచిన‌ట్టున్నారు. ఎంత‌టి వారికైనా ప్ర‌జ‌లు చూస్తున్నార‌న్న భ‌యం వుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిలో ఒక్క శాతం కూడా అలాంటిది లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌న చేష్ట‌ల్ని రాష్ట్ర‌మంతా చూస్తోంద‌ని జేసీ గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్లే నోటికి హ‌ద్దు లేకుండా మాట్లాడుతున్నార‌నే విమ‌ర్శ లేక‌పోలేదు.

18 Replies to “ప్ర‌భుత్వాన్ని కూల్చుతారు జాగ్ర‌త్త‌!”

  1. పీకినారులే .. తీయ్.. ఆళ్ళకి అంత సీన్ లేదు… ఉండుంటే ఇప్పుడు వీళ్ళు ఇంత రెచ్చిపోయేవారు కాదు..

  2. పీ కినా రులే .. తీ య్.. ఆ ళ్ళకి అం త సీ న్ లేదు… ఉం డుం టే ఇప్పు డు వీ ళ్ళు ఇంత రె చ్చి పో యేవారు కా దు..

    1. cbn ప్రభుత్వాన్ని దించేది ఎవరండీ , GSDP డేటా ని రెండు వారాలలో 13.63 % నుండి 17.11 % కి ప్రకటించారు ,ఈయన vision కి hatsoff చెప్పాల్సిందే . 1 % లోపల change ఉంటేనే వేళా కోట్లలో మార్పు ఉంటుంది , ఈయన ఏకంగా 3.5 % చేంజ్ ప్రకటించారు , ఇంత దమ్ము , దైర్యం ఎవరికీ ఉంటుంది , కేవలం సంపద సృష్టించే వాళ్ళకి మాత్రమే ఉంటుంది ,అయన ఇప్పటికే చాల సంపద సృష్టించారు , అది ఒక మీట్ లో కూడా ఎవరో పెద్దాయన అడిగితే సంపద ఎలా సృష్టించొచ్చో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు

  3. ఏందీ .. మీ జగన్ రెడ్డి ని మళ్ళీ జనాలు నమ్ముతారనే ఆశ కూడా ఉందా..

    పట్టుమని 10 మంది గెలిచే అవకాశం ఉన్న నాయకులు లేనీ సన్నాసుల పార్టీ మీద..

    175 కే రండయ్యా బాబో ఆడుకుంటున్న పార్టీ మీది.. ఇక 225 అయితే.. కూటమి కి ఏకగ్రీవనాలు కూడా ఉంటాయేమో..

  4. అవునా !!! గత ప్రభుత్వం లో సబ్బం హరి ఇంటిని కూల్చినప్పుడు, గీతం ుునివర్సిటీ కూల్చినప్పుడు, పళ్ళ శ్రీనివాస్ ఇంటిని కూల్చినప్పుడు, అయ్యన్నపాత్రుడు ప్రహరీ కూల్చినప్పుడు ఈ నీతులు చెప్పినట్లు గుర్తులేదే?

    1. అప్పుడు కితకితలు పెట్టుకుని నవ్వుకున్నాడు ..

      ఇప్పుడు ఏడవలేక నీతులు చెపుతున్నాడు..

      మళ్ళీ జగన్ రెడ్డి గెలిచేస్తాడని.. కూటమి గెలిచిన రెండో రోజు నుండే మొదలెట్టేసాడు..

      అంత సీనే ఉంటె.. 2024 లో ప్రతిపక్ష హోదా అయినా దక్కేది.. అడుక్కోవాల్సిన ఖర్మ పట్టేది కాదు..

      1. దాన్నే సుంకానందం…కొన్ని ఊళ్లలో గుళానందం అని కూడా అంటారు

  5. reddy,

    mottham boring stuff rasthunnavu

    MBS sodi tappa nee site lo matter vundataledu

    full defence lo padipoyavu

    maku bore kodutunnadi

    deenikanna ABN ye yekkuva political gosiipis rastunnadi

    up your game or this site is becoming boring

  6. వైసీపీ పేటీఎం గ్రేట్ ఆంధ్ర మీ జగన్ మామయ్య అధికారం పెట్టినా రెండో రోజే కూల్చివేతల మొదలుపెట్టాడు అప్పుడు మీకు నీతులు గుర్తుకు రాలేదా అక్రమంగా ఎవరు ఇల్లు కట్టుకున్న అది తప్పే అయినా మీకు కోర్టులు జైలుకు వెళ్లటం మెయిల్ తెచ్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య మీకు మీ ముఖ్యంగా 31 కేసులు బెయిలు మీద తిరుగుతున్న మీ జగన్ మామయ్యకు

Comments are closed.