ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో వివిధ ఏజెన్సీలు, రాజకీయ పార్టీల తరుపున వ్యక్తులు సర్వేలు ప్రారంభించారు. ఇప్పటి వరకు నిర్వహించిన చాలా సర్వేల్లో చాలా వరకు సీఎం జగన్ కే మరోసారి అధికారంలోకి వస్తుందని అంచన వేస్తున్నారు.
తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య 2024 జరగబోతున్న దృష్టిలో పెట్టుకొని చేపట్టిన తాజా సర్వే ఫలితాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన పవన్ బస్సు యాత్ర మొదలు… బస్సు యాత్ర తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేశారు.
పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర ప్రారంభించే లోపు ఎన్నికలు జరిగితే అధికార వైఎస్సార్ సీపీ 47 శాతం ఓట్లతో 95 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని, అలాగే టీడీపీ 38 శాతం ఓట్లతో 65 సీట్లు, జనసేన 14 శాతం ఓట్లతో 15 సీట్లు గెలుచుకోనున్నాయి అంటూ సర్వే ఫలితాలు వెల్లడించారు.
అయితే, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిగితే పరిస్థితులు అనూహ్యంగా మారుతాయని జోగయ్య అంచనా వేశారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని.. అందులో 40 శాతం ఓట్లతో 80 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని వైసీపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని.. టీడీపీ 38 శాతం ఓట్లతో 55 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని, అయితే జనసేన 20 శాతం ఓట్లతో తన సంఖ్యను 40కి పెంచుకుంటుందని అంచన వేశారు.
ఏ పార్టీ సృష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ వస్తే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతాడని జోగయ్య జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే టీడీపీతో చేతులు కలపాల్సి ఉంటుందని జ్యోసం చెప్పారు.