ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?

వైసీపీకి నిజంగా చిత్త‌శుద్ధి వుంటే, ఏబీవీపై కేసులు ఎలా వేస్తారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాలి. ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌ర‌చూ వార్త‌ల్లో వుంటారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. దీనికి కార‌ణం.. కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న‌పై కేసులు ఎత్తేయ‌డమే. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ సంద‌ర్భంలో ఆయ‌న‌పై వైసీపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నార‌ని, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఫిరాయింపుల్లో ఏబీ కీల‌క పాత్ర పోషించార‌నేది ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌ధాన ఆరోప‌ణ‌. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న్ను సస్పెండ్ చేశారు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఒక‌రోజు ముందు ఆయ‌న‌కు పోస్టింగ్ ఇచ్చి, ఆ ర‌కంగా గౌర‌వంగా సాగ‌నంపారు.

ఇప్పుడు కూట‌మి స‌ర్కార్ ఏబీవీకి అనుకూల నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేశారంటూ వాట‌న్నింటిని కూట‌మి ప్ర‌భుత్వం ఎత్తేసింది. ఈ ప‌రిణామాన్ని ఊహించింది. అయితే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై తీవ్ర ఆరోప‌ణ‌లుండ‌గా కేసు ఎలా ఎత్తివేస్తారంటూ వైసీపీ సొంత పత్రిక క‌థ‌నం రాయ‌డం ఏబీవీకి కోపం తెప్పించింది. ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిగా ఏబీవీ ఘాటైన పోస్టు పెట్టారు. త‌న‌పై అవాకులు చెవాకులు పేలే సాక్షితో పాటు యూట్యూబ‌ర్ల‌కు చ‌ట్టం అంటే ఏంటో తెలిసేలా చేస్తాన‌ని హెచ్చ‌రించారు.

చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాదు. వైసీపీకి నిజంగా చిత్త‌శుద్ధి వుంటే, ఏబీవీపై కేసులు ఎలా ఎత్తి వేస్తారంటూ న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించాలి. ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎందుకంటే, గ‌తంలో వైసీపీ హ‌యాంలో కొంత మంది నాయ‌కుల‌పై కేసులు ఎత్తేస్తే, టీడీపీ హైకోర్టులో స‌వాల్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేసుల్ని ఎత్తివేయ‌లేక‌పోయారు. ఆ ప‌ని ఇప్పుడు వైసీపీ ఎందుకు చేయ‌లేక‌పోతోంది? అనే ప్ర‌శ్న‌కు ఆ పార్టీ నాయ‌కులే స‌మాధానం చెప్పాలి.

నిజంగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌ప్పు చేశార‌ని వైసీపీ న‌మ్ముతుంటే, అందుకు త‌గ్గ ఆధారాలుంటే, న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించ‌డానికి బ‌దులు, ప‌త్రిక‌లో క‌థ‌నాలు రాయ‌డం ఏంటో ఎవ‌రికీ అర్థం కాదు.

18 Replies to “ఏబీవీకి చ‌ట్టం రుచి చూప‌డం వైసీపీకి చేత‌కాదా?”

  1. జ..గ్గా…గాడి నుండి బోరుగడ్డ వరకు గు..ద్ద కింద బరిసెలు దిగుతున్నాయి ప్రతొడికి.సొంత కొంపలు కొల్లేరు అవుతుంటే ఇక వీటి గురుంచి ఎవుడు థేకేది?

  2. ABV ఎదొ తపు చెసినట్టు… పాపం పత్తితు Jagan కి, చట్టం రుచి చూపించటం తెయనట్టు…. ఈ సొల్లు మాటలు ఎమిటి రా GA?

    .

    విచారణ పెరుతొ ABV సస్పెండ్ చెసారు. చార్గెషీట్ మాత్రం వెయరు!

    నెను తప్పు చెస్తె, నా మీద నెరం మొపుతూ చార్జ్ షీట్ వెసి నా ఉదొగం తీసెయండి, నెను కొర్ట్లొ నిరొపించుకుంటాను అంటె ఆ పని చెయారు! విచారణ పెరుతొ సుస్పెండ్ చెసి 5 ఎళ్ళు కాలక్షెపం చెసారు!

  3. A1సైకో’ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై, ప్రశ్నించిన ప్రజలపై, చివరికి జడ్జిల పై A1 ‘సైకోగాళ్ళు ‘హత్యలు, తప్పుడు ‘కేసులు పెట్టి వేధింపులు, దాడులు ఇలా ఎన్నో ‘అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్టులు పెట్టి వికృతఆనందం పొందారు. అత్యంత ‘హేయమైన, ‘జుగుప్సాకరమైన పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు, ‘మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్టు చేశారు. చివరకు సొంత ‘తల్లి విజయమ్మ, సోదరి ‘వైఎస్ షర్మిల, మరో సోదరి సునీతపై కూడా ‘అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వైసీపీ ‘నీచత్వానికి నిదర్శనంగా నిలిచింది. .అలాంటి ‘సైకోలు ఇప్పుడు అనుభవిస్తున్నారు

  4. YCP వల్ల ఏమీ అవ్వదు . అదొక దద్దమ్మ పార్టీ వాళ్ళ నాయకుడు ఒక మబ్బుగాడు . లీగల్ టీం ఉండదు పార్టీ కోసం పోరాడిన వాళ్ళకి ఉపయోగం ఉండదు లోకల్ లీడర్స్ కి ఆదాయం ఉండదు డబ్బున్నా మంచి మందు కొనలేరు సొంత మీడియా దేనికి పనికి రాదు . తిరుమలలో దేవ దేవుడికి వస్త్రాలు సమర్పిచంగలిగే అద్భుతమైన అవకాశం వస్తే సతిసమేతంగా రాలేడు . ఇంకా ఎన్నో మరెన్నో ఉన్నాయ్ . ఇంక జనసేన మాత్రమే ప్రతిపక్ష పార్టీ . నాయకులు కార్యకర్తలు పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు . #RIPYCP

  5. చేతకాదు అని తేలిపోయింది కదా…ప్రభుత్వం లో ఉన్నప్పుడే ఎం పీకలికపోయారు

  6. న్యాయమూర్తుల వ్యవహారం తెలిసే ఉంటుంది అందుకే ఇంకో కేసు వెయ్యటం దాన్ని కొట్టేయటం ఎందుకని మానేసి ఉంటారు

  7. మన న్యాయస్థానాలు ,న్యాయమూర్తుల వ్యవహారం తెలుసుగా అందుకే మానుకునిఉంటారు

Comments are closed.