లిక్కర్ స్కామ్: వ్యక్తిగత పగలకు వేదికా?

లిక్కర్ స్కాం విచారణ పర్వం మొదలైన తరువాత ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు

లిక్కర్ స్కాం విచారణ పర్వం మొదలైన తరువాత ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ నుంచి బయటికి వచ్చి పార్టీలో ఎవరిమీదనైనా నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్న విజయసాయిరెడ్డి- కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి సిట్ విచారణ బృందం ఎదుట అనేక విషయాల వెల్లడించారు.

కొన్ని వారాలుగా సిట్ పోలీసుల నోటీసులు తీసుకోవడానికి కూడా అందుబాటులోకి రాకుండా జాగ్రత్త పడుతున్న రాజ్ కసిరెడ్డి ఆవేశంతో స్పందించి ఒక ఆడియో సందేశం విడుదల చేశారు. విజయసాయిరెడ్డి బాగోతాలన్నీ త్వరలోనే మీడియా ముందుకు వచ్చి బయటపెడతానని ఆయన అంటున్నారు.

సిట్ బృందం ఎదుట విచారణకు హాజరు కావడం అనే పాయింట్ ఒక్కటే కామన్ గా కనిపిస్తున్నది గాని.. ఈ ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరికి ఉన్న వ్యక్తిగత కక్షలు పగలు తీర్చుకోవడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతుంది.

విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కూడా మూడు నెలలు గడిచిపోయింది. రాజీనామా చేసిన సందర్భంలో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఒక కోటరీ ఏర్పడిందని, తన మీద వారు ఆయనకు చెప్పుడు మాటలు చెబుతున్నారని విజయసాయి ఆరోపించారు. ఆ కోటరీ దెబ్బకు తట్టుకోలేకనే జగన్మోహన్ రెడ్డికి తనమీద ప్రేమ లేదని తెలిసిన తరువాత తాను పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు.

అయితే విజయసాయి ఆ పార్టీని వీడడానికి ఏదైతే కోటరీ కారణం అని ఆరోపిస్తున్నారో, ఆ కోటరీలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నారా? విజయసాయి మీద జగన్మోహన్ రెడ్డికి పితూరీలు ఎక్కించారు- అనే మాట నిజమే అయితే కనుక అందులో కసిరెడ్డి పాత్ర ఉన్నదా? అందువల్లనే విజయసాయి- కసిరెడ్డికి వ్యతిరేకంగా తనకు తెలిసినది మొత్తం సిట్ బృందానికి చెప్పడానికే విచారణకు హాజరయ్యారా.. అని కూడా అనిపిస్తోంది.

ఎందుకంటే తన ఇంట్లో జరిగిన సమావేశానికి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గాని, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గాని హాజరైన సంగతి గుర్తు లేదని ఆయన సిట్ తో అన్నారు. ఈ కుంభకోణంతో మిథున్ రెడ్డికి సంబంధం ఉందో లేదో తెలియదని కూడా ఆయన చెప్పారు.

కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి మాత్రమే ఒక్కడే ఈ లిక్కర్ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహించాలి అన్నట్లుగా విజయసాయి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. పైగా రాజ్ కసిరెడ్డిది క్రిమినల్ బ్రెయిన్ అని దాని గురించి తెలియకుండా తానే పార్టీలో అనేక రకాల బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించానని అందుకు పశ్చాత్తాప పడుతున్న స్థాయిలో విజయసాయి చెప్పారు.

ఈ మాటలన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్లున్నాయి. ఇన్నాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకున్న ఆయన ఇప్పుడు ఆడియో సందేశం పంపారు. న్యాయపరమైన రక్షణ పొందేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నానని అన్నారు. ఆ సంగతి తేలిన తర్వాత స్వయంగా మీడియా ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి అవినీతి చరిత్ర మొత్తం చెబుతానని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి లిక్కర్ కేసు విచారణ పర్వంలో ఈ ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరికి ఉన్న వైరభావాన్ని ప్రదర్శించుకుంటూ.. తమకు తెలియకుండా తాము కూడా మరింతగా ఇరుక్కుపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు.

18 Replies to “లిక్కర్ స్కామ్: వ్యక్తిగత పగలకు వేదికా?”

  1. కర్మ ఎవరిని వదలదు మహానేత అయిన సరే జననేత అయిన సరే కర్మ అనుభవించక తప్పదు 

  2. ఏమిటి నోటీసు తీసుకోకుండా సిట్ దొరక్కుండా ఉండటం మీ భాషలో జాగ్రత్త అంటారా….దీన్ని గజగజ వనికి పారిపోవడం అని కదా అంటారు

  3. ఎలక ఎలక కొట్టుకుని.. పులివెందుల పిల్లి పేరు బయట పెట్టేస్తాయేమో.. కామెడీగా దొరికిపోతాడు..

    1. ఆ బొక్కలే ॥ ఆల్రెడీ ఉన్న కేసుల్తో పోల్చితే ఇదొక లెక్కా? కేసులన్నీ ఒక్కడే మోస్తున్నాడు అని సింపతీ పెరుగుతుంది. కాబట్టి ఆస్తులు కూడా అన్నీ నావే అని మా గొర్రెలు కన్విన్స్ అవుతారు. ఎలా ఉంది ఐడియా? 

  4. అక్కడ లిక్కర్ స్కాం లెనట్టు… కెవలం వ్యక్తిగత పగల కారణంగానె వళ్ళె విమర్సించుకుంటునట్టు ఎమి కలరింగ్ ఇస్తున్నావురా?

    .

    ఇంత జరుగుతుంటె జగన్ వచ్చి వివరణ ఇవ్వల్సిన అవసరం లెదా?

  5. అక్కడ లిక్కర్ స్కమ్మ్ లెనట్టు, కెవలం వ్యక్తిగత పగల కారణంగానె వాళ్ళు విమర్సించుకుంటునట్టు ఎమి కలరింగ్ ఇస్తున్నావు?

    .

    ఇంక జరుగుతుంటె జగన్ వచ్చి వివరణ ఇవ్వల్సిన అవసరం లెదా?

    1. వీడంతే . బూతులు లేకుండా కామెంట్స్ రాస్తే నచ్చదు వీడికి. కొంచెం మసాలా దట్టించి కామెంట్స్ పెడితే కళ్ళకు అద్దుకుంటాడు. ట్రై చేయండి.  అసలే వెబ్సైటు కి వ్యూయర్స్ తక్కువ . అన్న ఏమైనా ఇస్తున్నాడో లేదో తెలియదు. 

  6. మీరు ఎం convey చేద్దాం అనుకుంటున్నారో కానీ జనాలకి మాత్రం అన్న పాలస్ లో పబ్జీ ఆడుకుంటూ పాలనని , పార్టీ ని ఇలాంటి వాళ్ళకి వదిలేసారు అని మాత్రం convey అవుతుంది

Comments are closed.