అచ్చం ఆ ఐదేళ్ల‌లానే చంద్ర‌బాబు పాల‌న!

ఏతావాతా చంద్ర‌బాబు నాయుడు పాల‌న ఎలా ఉందంటే.. అప్ప‌ట్లానే అన్న‌ట్టుగా 2014 నుంచి 2019 మ‌ధ్య‌న ఎలా సాగిందో, ఇప్పుడూ అలానే సాగేలా ఉంది.

2014-2019ల మ‌ధ్య‌న ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పాల‌న సాగింది. కొత్త‌గా విడిపోయిన పాత రాష్ట్రం అప్పుడు. సీమాంధ్ర‌ను సింగ‌పూర్ చేస్తానంటూ చంద్ర‌బాబు నాయుడు అప్పుడు అధికారం ద‌క్కించుకున్నారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు సొంతంగా గెల‌వ‌లేదు. బీజేపీ తో పొత్తు వ‌ల్ల మోడీ హ‌వా చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చింది. అప్పుడే ప్ర‌శ్నించ‌డానికి అంటూ ఏర్ప‌డిన ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ ద్వారా కొంత క‌లిసి వ‌చ్చింది. అంత చేస్తే అప్పుడు చివ‌ర‌కు ఒక‌టిన్న‌ర శాతం అద‌న‌పు ఓట్ల‌తో ఏపీలో అధికారం చంద్ర‌బాబుకు అందింది. ఆ త‌ర్వాత ఆయ‌నేం చేశారో అందరికీ తెలిసిందే!

అమ‌రావ‌తి అంటూ త‌న మేధస్సుతో రాజ‌ధాని ప్ర‌క‌టన చేశారు. అప్ప‌టికే ఏపీ రాజ‌ధాని విష‌యంలో శివరామ‌కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌ను బుట్ట దాఖ‌లు చేశారు! త‌న‌కు మించిన మేధావా ఆ శివ‌రామ‌కృష్ణ‌య్య అన్న‌ట్టుగా చంద్ర‌బాబు ఆ క‌మిటీ నివేదిక‌ను ఖాత‌రు కూడా చేయ‌లేదు! ఆ త‌ర్వాత గ్రాఫిక్స్ తెర మీద‌కు వ‌చ్చాయి. అమరావ‌తికి వాళ్ల స‌హ‌కారం వీళ్ల సహ‌కారం అంటూ ఊద‌ర‌గొట్టారు! సింగ‌పూర్ తో మొద‌లుపెడితే.. శ్రీలంక వ‌ర‌కూ! అన్ని దేశాల పేర్ల‌నూ వాడేశారు. లెక్క‌లేన‌న్ని అతిశ‌యోక్తుల‌ను అమ‌రావ‌తి విష‌యంలో నింపేశారు! క‌ట్టుక‌థ‌లెన్నో చెప్పారు! చివ‌ర‌కు ఆ ఐదేళ్ల‌లో తాత్కాలిక స‌చివాల‌యం క‌ట్టారు, దాని నాణ్య‌త ఏమిటో కూడా అప్పుడూ అట్టే బ‌య‌ట‌ప‌డిపోయింది.

ఇలాంటి ఎన్నో విన్యాసాల ఫలితం, 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలేవీ అమ‌లు చేయ‌క‌పోవ‌డం.. చేసినా ఆఖ‌రి సంవ‌త్స‌రంలో చేసిన‌ట్టుగా అనిపించేయ‌డం, పోలింగ్ కు ముందు రోజు జ‌నం ఖాతాలో డ‌బ్బులు ప‌డేలా చూసుకున్నా.. ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు! బీజేపీకి తాలాక్ చెప్పి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ప్ర‌త్యేకంగా బ‌రిలో దించినా.. టీడీపీకి అప్పుడు ద‌క్కింది 23 సీట్లే!

ఆ త‌ర్వాత ఐదేళ్ల జ‌గ‌న్ పాల‌న‌, దానిపై తెలుగుదేశం పార్టీ త‌న అస్త్ర‌శ‌స్త్రాల‌న్నింటినీ ప్ర‌యోగించి.. వ్య‌తిరేక‌త పెంపొంద‌డానికి అవిశ్రాంతంగా కృషి చేసి, మ‌ళ్లీ బీజేపీతో జ‌త క‌ట్టి, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఈ సారి సీట్లు కూడా కేటాయించి.. ఎలాగోలా మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకుంది టీడీపీ. ఈ సారి 2014లో ఇచ్చిన హామీల‌కు మించిన హామీల‌ను ఇచ్చింది. దేశంలో అన్ని రాజ‌కీయ పార్టీల మెనిఫెస్టోల హామీల‌న్నీ కూట‌మి పార్టీల మెనిఫెస్టోలో విశాలంగా స్థానం క‌ల్పించారు! క‌ట్ చేస్తే.. ఈ కూట‌మి పాల‌న ఏడాదిని పూర్తి చేసుకునే స‌మ‌య‌మూ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది!

ఇప్పుడు వినిపిస్తున్న మాట‌లు ఏమిటంటే.. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డం, వాటిని ముందు ముందు అమ‌లు చేస్తామ‌నే మాట‌, సంప‌ద సృష్టిస్తానంటూ అధికారంలోకి వ‌చ్చి… అదెలాగో త‌న‌కు చెవులో చెప్ప‌మ‌ని జ‌నానికి చంద్ర‌బాబు ఇస్తున్న పిలుపులు! మ‌ధ్య‌లో అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అరుపులు, మ‌ళ్లీ అమ‌రావ‌తికి భూసేక‌ర‌ణ‌.. ఈ సారి మ‌రిన్ని వేల ఎక‌రాలు అట‌! ఉన్న దాన్ని అభివృద్ధి చేసింది లేదు, మ‌ళ్లీ కొత్త‌గా భూమా అంటూ చివ‌ర‌కు టీడీపీ అభిమానులు కూడా బుగ్గ‌లు నొక్కుకుంటూ ఉన్నారు! పెద్ద‌దానికి పెళ్లి లేక‌పోయినా, క‌డ‌దానికి క‌ల్యాణం అన్న‌ట్టుగా ఏదో ఒక సామెత ఉన్న‌ట్టుంది తెలుగులో! ఇప్పుడు అమ‌రావతికి మ‌ళ్లీ భూ సేక‌ర‌ణ అంటే.. ఇలాంటి సామెత‌లే గుర్తుకు వ‌స్తాయి మ‌రి!

అమరావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఎంత హైప్ క్రియేట్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నా ఈ ద‌ఫా అది అంత క్రియేట్ అవుతున్న‌ట్టుగా లేదు! అందుకు కార‌ణం వ‌ర‌ద‌లు, మ‌ళ్లీ జ‌గ‌న్ వ‌స్తే అంటూ.. టీడీపీ నేత‌లే మాట్లాడుతూ ఉండ‌టం వంటి కార‌ణాలు ఎన్నో ఉన్నాయి. అమ‌రావ‌తి అంటే అదేదో ఒక ప్ర‌త్యేకం అన్న‌ట్టుగా.. అది దేవ‌త‌ల న‌గ‌రం అంటూ టీడీపీ ఇచ్చే అతిశ‌యోక్తులు ఏ ద‌శ‌లోనూ సామాన్యుల‌కు ఎక్క‌వు! కేవ‌లం ఒక కులానికి, తెలుగుదేశం వీరాభిమాన వ‌ర్గానికి అలాంటి అతిశ‌యోక్తులు రుచిస్తాయేమో కానీ, మిగ‌తా వారికి ఆ అభూత‌క‌ల్ప‌న‌లు కామెడీ అయిపోయి చాలా కాలం అయ్యింది. మ‌ళ్లీ అలాంటి కాశీ మ‌జిలీ క‌థ‌లే ఇప్పుడు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.

ఏతావాతా చంద్ర‌బాబు నాయుడు పాల‌న ఎలా ఉందంటే.. అప్ప‌ట్లానే అన్న‌ట్టుగా 2014 నుంచి 2019 మ‌ధ్య‌న ఎలా సాగిందో, ఇప్పుడూ అలానే సాగేలా ఉంది. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య‌లో కూట‌మిని వ‌దిలి వెళ్లిపోయినా.. ఆయ‌న‌కు సీట్లు లేవు. ఇప్పుడు జ‌న‌సేన‌కు సీట్లు కూడా ఉన్నాయి. ప‌వ‌న్ బ‌య‌ట‌కు వెళ్తాడ‌ని కాదు కానీ, ఇప్పుడు ఎంత కాద‌న్నా టీడీపీకి ప‌వ‌న్ పంటికింద రాయిలాంటివాడే! అన్నింటికీ మించి.. 2014-19 ల మ‌ధ్య పాల‌న‌కు ప్ర‌జ‌ల పూర్తి తిర‌స్క‌ర‌ణ ఎదురైంది ఐదేళ్ల త‌ర్వాత‌! అయినా అదే క‌థ కొన‌సాగుతున్న‌ట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి!

-హిమ‌

34 Replies to “అచ్చం ఆ ఐదేళ్ల‌లానే చంద్ర‌బాబు పాల‌న!”

  1. ఆత్రం కొద్దీ ఏదో రాసవ్ కానీ పోలింగ్ ముందు డబ్బులు ఏ ప్రభుత్వం అయినా ఇవ్వగలదా?

  2. ,అహా!!! 94% సీట్లు సాధించి, ఎదుటివారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తే నీ దృష్టిలో ఎలాగోలా గెలవడమా? సరే నమ్మేశం

      1. అందుకే రెండు సింగిల్స్ తో ఇంటికి తరిమారు…పాపం హైదరాబాద్ ఇంటికి పోలేని పరిస్థితి…బెంగళూర్ దాకా డెక్కల్సివస్తుంది.

      2. రాజకీయాలలో గుంపు నీతో లేకుండా , ఒంటికై సొంతికొమ్ము అంటే నువ్వు ఎంత గలీజుగాడివి అనేది తెలుస్తుంది

      3. కరెక్ట్ మనోడు సింగల్ సింహం.. కానీ ఓ డౌట్ .. ఈ సింహం ఏ “zoo సింహం” వీర్యం తో పుట్టింది?? నేను మహా మనిషి రక్తం అనుకున్నా..  Zoo సింహం రక్తమా ??

  3. అవునా !!! మూడు రాజధానులు అన్నప్పుడు గుర్తులేదా… కట్టుకున్నదానికి తాళిబొట్టు లేదుకానీ వుంచుకున్నదానికి ఏడువారాల నగలు అని

  4. పవన్ టీడీపీ పంటి కింది రాయేమో, కానీ వైసిపి ముడ్డి కింద మంట అని తెలియలేదు తమరికి

  5. 94% సీట్లు సాధించడం ఏదోలా గెలవడం అంటారు అని హిమ గారి డిక్షనరీ కొత్త అర్థం చెబుతుంది

  6. జగన్ రెడ్డి కోసం ఎవరెన్ని పల్లకీలు మోసి ఏమి లాభం..

    అసలోడు రాష్ట్రం వదిలి పారిపోయి .. యెలహంక పాలస్ లో దాక్కున్నాడు..

    వాడికెన్ని కష్టాలో ఆలోచించేవాళ్లే కరువైపోయారు..

    ఎంత సేపు .. కెజిఎఫ్ లో లాగా.. వస్తాడు.. వస్తాడు అని అరుస్తున్నారే గాని..

    వాడు ఎందుకు రావడం లేదో.. వాడికెన్ని ఇబ్బందులున్నాయో .. వస్తే కరుసైపోతాడేమో.. అని ఆలోచించే నాధుడే లేడు ..

  7. ///శివరామ‌కృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌ను బుట్ట దాఖ‌లు చేశారు!///

    .

    అరె తుగ్లక్! గుంటూరు, విజయవాడా కూడా శివరామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఒక ఆప్షన్ గా ఇచ్చింది!

  8. శివరామ‌కృష్ణ‌న్ క‌మిటీ page No: 35 లొ District & Capital Zone Suitability Index అనె పట్టిక వెసి చలా clear గా RISK, CONNECTIVITY, WATER AVILABILITY, LAND AVILABILITY, REGINAL DEVELOPMENT అనె అంశాల మీద ఒక్కొక నగరానికి మార్కులు వెసింది!  కాస్త వెళ్ళి చూస్కుండి

    Visakhapatnam

    RISK 2.86,

    CONNECTIVITY -1.24,

    WATER 0.14,

    LAND 1.74,

    REG DEVELOPMENT 1.09

    Vijayawada

    RISK 0.5,

    CONNECTIVITY 1.81,

    WATER 1.61,

    LAND -0.64,

    REG DEVELOPMENT 1.39

    Guntur

    RISK -0.55,

    CONNECTIVITY 1.49,

    WATER 0.92,

    LAND -0.34,

    REG DEVELOPMENT 1.04

    1. విశాకకి రాస్త్రం లొనె అత్యదికం గా risk ఉంది అని risk కి అత్యదిక మార్కులు వెసింది. అలానె Connectivity కి negative మార్కులు, water availability కి అతి తక్కువ మార్కులు వెసింది.

  9. 2014.  లో.   ఎంత చేశారో తెలియడం లేదు మునయంగ  స్టేట్ డివైడ్ అయిపోయాక చక్కగా చక్క దిహ్దారు . జీతాలు బాకీలు పెట్ట లేదు ఉన్న పథకాలు ఆపలేదు. కాంట్రాక్టర్లను ఏడ్పించి లేదు పోలవరం 70 శాతం చేసారు .రాజధాని కట్టడం అంటే మూడుముక్క లేసినంత ఈసీ కాదు.   చూసాం మీ పాలన .  అభివృద్ధి కూడా ముఖం మంచి వెల్త్ క్రియేట్ చేసి అప్పుడు పంచాలి తప్ప ఇలా కాదు అందుకే చిత్తు గా ఓడిపోయారు ఇంకా బుద్ధి రాలేదు

  10. అంతన్నాడింతనాడే చంద్రబాబు “కమోడు” మీద మామిడిపండన్నాడే చంద్రబాబు. ఆశపడి నేనువెళ్తేనే చినబాబు “కమోడు” గుంత చూపేడే చిన్నబాబు

  11. శివరమక్రిష్నన్ కమిటీ అంటావ్, అందులొ ఎముందొ రాస్తె డిలీట్ చెస్తావ్ ఎమిటిరా అయ్యా!

  12. ఆకలైతే అన్నం పెట్టేవాడు లీడర్ కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పేవాడు అసలైన లీడర్. ఒక్క సారి నేర్పితే జీవితాంతం సంపాదించుకుని తింటాడు. ఏ పనీ చేసుకోలని వాళ్లకు రోజూ కడుపు నింపే సంక్షేమం ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్మారు. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.

    రాజకీయాల్లో అజాతశత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రధాన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మంచి చేసినా.. చెడు చేసినా.. చెడుగానే ప్రచారం చేస్తారు. బయట ప్రపంచం అంతా ఆయనను ఆరాధిస్తుంది. కానీ సొంత రాష్ట్రంలో అంత ఏకపక్ష మద్దతు ఉండదు. ఎన్టీఆర్‌కే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. చంద్రబాబుకు కూడా అంతే. ఆయనను రాజకీయంగా కుల, మత, ప్రాంతం కారణంగా విబేధించేవారు ఉంటారు కానీ.. పనితీరు పరంగా ఎవరూ విమర్శించలేరు.

  13. ప్రజల జీవితాలను మార్చే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో ఉండేలా చూసుకోవాల్సిన పని లేదు… కానీ ప్రతి కుటుంబం ఎదుగుదలలో ముద్ర ఉంటేలా చేస్తే మాత్రం జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించినట్లే. తెలుగుదేశం పార్టీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘనత సాధించారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పనులు సంస్కరణల వల్ల ప్రతి కుటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశాలు పొందింది. కొంత మంది ఆ అవకాశాల్ని ఉపయోగించుకుని ఓ మెట్టు పైకి ఎదిగి ఉండవచ్చు..కొంత మంది నేలపాలు చేసుకుని ఉండవచ్చు.. కానీ చంద్రబాబు ప్రయత్నాలు మాత్రం విఫలం కాలేదు.

    చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు నేటి తరానికి తెలియవు. అప్పట్లో అభివృద్ధి అనేది ద్వితీయ ప్రాధాన్య అంశం. ఉపాధి అవకాశాల గురించి ఆలోచించే నేతలు ఉండేవారు కాదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ రాజకీయ దృక్కోణం మారిపోయింది. యువతకు ఉపాధి అందించడానికి ఆయన సాహసం చేశారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజలు బాగుపడితే తనకు జరిగే నష్టం పెద్ద నష్టం కాదని ముందుకే వెళ్లారు. ఇంజనీరింగ్ విద్య నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ.. వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందే యువతకు సాయం వరకూ చంద్రబాబు ముద్ర అనన్య సామాన్యం.

  14. పథకాలు అమలు చేయకపోతే ఆటోమేటిక్ గా సంపద సృష్టి జరుగుతుంది.గుడ్ ప్లాన్ మార్క్

  15. చంద్రబాబు మా రాష్ట్రానికి సీఎం అయి ఉంటే ఈ పాటికి చైనాతో పోటీపడే ఎకానమీని సాధించేవాళ్లం అని ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు 2004లో ఓడిపోకపోతే.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు.

    మీరు మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నేలకి ఇంకా చాలా సేవ చేయాలని కోరుకుంటూ

    పనిలోనే విశ్రాంతి వెదుక్కునే అవిశ్రాంత “అభివృద్ధి రుషి”కి 75వ జన్మదిన శుభాకాంక్షలు.

  16. Time ki jeetam raadu

    Sak shi paperki 430 crores

    Assembly kattadam raadu…

    Annaya kosam 500 crores illu

    Okka building punadi ledu…. kani 3 rajadanulu..

    Teachers leru kani english medium and tabs..

    900 crores scam with byju

    Notifications levu…. kani. Auto 10000/- chenetha 10000 BC 10000 and nayi brahmans 10000

    Roads undav … annayaki matram helicopter..

    Idena abhivruddi….

    Tax payers dabbu ni panchataniki ayana evaru?? 

    Tana sontha dabbu okka rupee aina ichadaa..

    Talli ki chelli ki dikku ledu..

  17. Jagan 1.5 Lakh secretariat jobs , Uddanam Hospital 🏥 35k RTC employees merged into govt, 5 medical colleges kattina antha anandam raledu

Comments are closed.