చంద్ర‌బాబుకు త‌గ్గ వార‌సుడే!

ఇప్పటి రాజ‌కీయాల్లో అబద్ధాల్ని న‌మ్మించ‌డంలోనే స‌క్సెస్ ఉంద‌నే సూత్రాన్ని లోకేశ్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇదే త‌న తండ్రి నుంచి లోకేశ్ నేర్చుకున్న విద్య అనే విమ‌ర్శ లేక‌పోలేదు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి త‌గ్గ రాజ‌కీయ వార‌సుడే అని మంత్రి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో నిరూపించుకుంటున్నారు. నిజానిజాల‌తో సంబంధం లేకుండా చంద్ర‌బాబునాయుడు క‌ళ్లార్ప‌కుండా మాట్లాడుతుంటారు. రాజ‌కీయ అవ‌స‌రాల‌ను బ‌ట్టి చంద్ర‌బాబు మాట్లాడుతుంటారు. చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌స్థాన‌మంతా అట్లే సాగింది, ఇంకా కొన‌సాగుతోంది.

ఒక‌ప్పుడు మోడీని తిట్ట‌ని తిట్టు లేదు. అయితే కేంద్రంలో బీజేపీ బ‌లంగా వుండ‌డం, ప్ర‌ధానిగా మోడీనే కొన‌సాగుతుండ‌డంతో ఆయ‌న‌తో పేచీ రాజకీయంగా దెబ్బ‌తీస్తుంద‌ని ప‌సిగ‌ట్టారు. 2019లో మోడీతో గొడ‌వ పెట్టుకునే అధికారాన్ని కోల్పోయాన్న ఆవేద‌న బాబులో వుంది. దీంతో 2024 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి , మోడీతో రాజీప‌డ్డారు. తిట్టిన నోటితోనే పొగిడారు.

తండ్రి నుంచి లోకేశ్ రాజ‌కీయాన్ని బాగానే ఒంట‌బ‌ట్టించుకున్నార‌ని, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట తీరు తెలియ‌జేస్తోంది. శాస‌న‌మండ‌లిలో వీసీల రాజీనామా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో లోకేశ్ ద‌బాయింపు ఇందుకు నిద‌ర్శ‌నం. వీసీల‌ను బెదిరించి, భ‌య‌పెట్టి రాజీనామా చేయించార‌ని వైసీపీ స‌భ్యులు ఆరోపించ‌గా, లోకేశ్ దాన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించారు. ప‌చ్చి అబ‌ద్ధాల‌ని లోకేశ్ తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. ఆధారాలు చూపాల‌ని వైసీపీ నేత‌ల‌పై దాడి చేసినంత ప‌ని చేశారు.

అలాగే ఇదే మండ‌లి స‌మావేశాల్లో ఉద్యోగాల క‌ల్ప‌న‌పై లోకేశ్ దబాయింపు చూడొచ్చు. నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు బ‌డ్జెట్‌కు సంబంధించి తెలుగు అనువాదంలో ఉంద‌ని వైసీపీ స‌భ్యురాలు వ‌రుదు క‌ల్యాణి పేర్కొన్నారు. నాలుగు ల‌క్షల ఉద్యోగాలు ఎవ‌రికిచ్చారు? ఎక్క‌డిచ్చారో చూపాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

అయితే తాము అలా అన‌లేద‌ని, ఎక్క‌డుందో చూపాల‌ని లోకేశ్ ద‌బాయింపున‌కు దిగారు. వైసీపీ స‌భ్యురాలు తెలుగులో వుంద‌ని చూప‌గా, లోకేశ్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉన్న‌ బ‌డ్జెట్‌ను చ‌దువుతూ, భ‌విష్య‌త్‌లో క‌ల్పిస్తామ‌ని అన్నామ‌ని చెప్పుకొచ్చారు. పైగా మీరే క‌దా ఇంగ్లీష్ ముద్దు, తెలుగు వ‌ద్దు అని అన్నార‌ని లోకేశ్ దెప్పి పొడిచారు. ఎంత‌సేపూ తాము చెప్పిందే త‌ప్ప‌, ప్ర‌త్య‌ర్థుల మాట‌ల్ని ప‌ట్టించుకునేది లేద‌ని, నిజ‌మా, అబ‌ద్ధ‌మా అనే వాటితో సంబంధం లేకుండా మాట్లాడ్తామ‌ని లోకేశ్ వ్య‌వ‌హార తీరు వుంది.

ఇప్పటి రాజ‌కీయాల్లో అబద్ధాల్ని న‌మ్మించ‌డంలోనే స‌క్సెస్ ఉంద‌నే సూత్రాన్ని లోకేశ్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఇదే త‌న తండ్రి నుంచి లోకేశ్ నేర్చుకున్న విద్య అనే విమ‌ర్శ లేక‌పోలేదు. ఇక హామీల అమ‌లు విష‌యంలోనూ లోకేశ్ అదే ద‌బాయింపును న‌మ్ముకున్నారు. చంద్ర‌బాబు రాజకీయాన్ని లోకేశ్ న‌డ‌త మ‌రీమ‌రీ గుర్తు చేస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రానున్న రోజుల్లో లోకేశ్ మ‌రింత రాటుదేలుతార‌ని… ఆయ‌న‌లో పొలిటిక‌ల్ కాన్ఫిడెన్స్ చూస్తే ఎవ‌రికైనా అభిప్రాయం ఏర్ప‌డుతుంది.

30 Replies to “చంద్ర‌బాబుకు త‌గ్గ వార‌సుడే!”

    1. అలా అంటే మీ జగనన్న కి కోపం వస్తుంది రోయ్, దేనిలో అయినా వాడే నెంబర్ వన్ అంటాడు. మల్ల చూసుకో..

  1. కల్లు ఆర్పకుండా అభద్దాలు చెప్పెది మన జగన్ ఎరా అయ్యా!

    పింక్ డైమొండ్ అని బొంకినా

    నారాసుర రక్త చరిత్ర అని అన్నా

    పెపర్ చూపిస్తూ 32 కమ్మ DSP లు అన్నా మొరిగినా

    మొడీ మెడలు వంచి స్పెషల్ స్టెటస్స్ తెస్తా అని చెప్పినా

    వారం లొ CPS రద్దు అన్నా

    ఆమరావతె రాజదాని అన్నా, 3 రాజదానులు అన్నా

    కొడికత్తి గాటు చూసినా, గులక రాయి ఎపిసొడు చూసినా,

    ఇత్తె అర్దం అవుతంది!

    1. బాబూ ..లెవ్…లెవ్…బాబూ

      ఇంకా 2015 లోనే వున్నావా ??

      పది సంవత్సరాలయింది….ఇది 2025

  2. బాబుని చంపాడని గోల గోల చేసి స్టోర్లు పగలకొట్టి… అదే అంబానికి రాజ్యసభ సీటు ఇచ్చినోడికంటే.. మోదీని తిట్టి మళ్ళీ పొగడడం పెద్ద తప్పేమీ కాదేమో? ఇంక వీసీల రాజీనామాల విషయంలో 2019 లో మీరు కంటిన్యూ చేశారా? పైగా క్రైస్తవులను అదీ అత్త కోడళ్లను వేంకటేశ్వర యూనివర్సిటీ కి వీసీ గా వేశారు..

    1. వచ్చి సంవత్సరం కావస్తుంది….

      ఏమైనా చేసేది వుందా….ఇంకా ఏడవటమేనా.

    1. దాని కోసం తిరుమల శ్రీవారి డబ్బులతో ధర్మపోరాట దీక్ష చేసాము కదా.

  3. ఈడు Memes మెటీరియల్, ట్రోలింగ్ స్టాక్.. వారానికి ఒకసారి వస్తే

    వారం అంతా అవే చూడాలంటే బోరింగ్.. కనీసం నెలలో 11 సార్లు ఇలా press మీట్ పెట్టు..సోషల్మీడియా లో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది..ఆంధ్ర మొత్తం సంతోషంగా u ట్యూబ్ లో నీ కామిడీ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

  4. రాజకీయాలో ఓపికగా ఉండేవాళ్ళు పైకి వొస్తరు .. అంతే గాని రాత్రికి రాత్రికి ఎదో అయిపోవాలి అనుకుంటే ఒక సరి మెరిసే ఆలా వెళిపోవడమే ..

  5. నిజాయితీగా పని చేస్తే ..ఎగనామం!

    ప్రజలకి, పథకాలకి.. పంగనామం!!

    దేన్నైనా దిగమింగుడే ..అసలురూపం!!

  6. ముఖ్యం గ చంద్రబాబు గారు కొడుకుకు రెండు విషయాలు నేర్పించాలి రంగ గారిని చంపేసి అది ఎన్టీఆర్ మీద తోసేసి ఆయనను ఓడించిన దుర్మార్గం బుల్లిబాబు ను చంపేసి అది బాబు గారు మీద తోసేసి గెలిచినా విధానం చెప్పి ఆ పద్మ వ్యూహం నుంచి ఎలాగా బయటకు రావాలి ఇలాంటి వాళ్ళ విషయం లో ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎలాగా వాడాలి నేర్పించాలి ఎంత సేపు అభివృద్ధి మంత్రం పాటిస్తే కుదురు రాజు నేరస్తులను కఠినం గ శిక్షించక పొతే తాను ప్రజలు నష్టపోవాల్సివస్తుంది

Comments are closed.