అడ‌ప‌డ‌చుల భ‌ద్ర‌త‌పై ప‌వ‌న్ సూక్తులు… ఖ‌ర్మ‌రా బాబూ!

మాటలు, చేత‌లు ఒకే ర‌కంగా వుంటేనే విలువ‌. మాట‌ల‌కు, చేత‌ల‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా క‌నిపిస్తే మాత్రం… ఎవ‌రూ విలువ ఇవ్వ‌రు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఇదే ప్ర‌ధాన స‌మ‌స్య‌. ప‌వ‌న్ మాట‌ల‌కు,…

మాటలు, చేత‌లు ఒకే ర‌కంగా వుంటేనే విలువ‌. మాట‌ల‌కు, చేత‌ల‌కు న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా క‌నిపిస్తే మాత్రం… ఎవ‌రూ విలువ ఇవ్వ‌రు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో ఇదే ప్ర‌ధాన స‌మ‌స్య‌. ప‌వ‌న్ మాట‌ల‌కు, ఆచ‌ర‌ణ‌కు ఎంతో తేడా క‌నిపిస్తుంది. రాజ‌కీయమైనా, వ్య‌క్తిగ‌త అంశాలైనా ఆయ‌న చెప్పేదొక‌టి, చేసేది మ‌రొక‌టి అన్న‌ట్టుగా వుంటుంద‌నే విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తూ వుంటుంది.

పొత్తుల‌పై ప‌వ‌న్ మాట మార్చిన‌ట్టు మ‌రే నాయ‌కుడిని మ‌నం చూసి వుండం. ఒక‌సారి పొత్తు వుంటుంద‌ని, మ‌రొక‌సారి ఉండ‌ద‌ని, ఒంట‌రిగా పోటీ చేసి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని, మ‌రోసారి ప్రాణాల్నే లెక్క చేయ‌న‌ని ఏవేవో చెబుతుంటారు. ఒక‌సారి ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏపీలో వ‌స్తుందంటారు. ఇంకోసారి జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మంటారు. త‌న‌కంటూ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, ఆలోచ‌న లేకుండా మాట్లాడ్డంలో ప‌వ‌న్‌కు మించిన నాయ‌కుడు ఉండ‌రు.

ఇవాళ ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు చెప్పారు. ఎప్ప‌ట్లాగే ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించేందుకు ర‌క్షాబంధ‌న్‌ను అవ‌కాశంగా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాజ‌కీయంగా ప‌వ‌న్ వాడుకోవ‌డం వ‌ర‌కూ బాగుంది. కానీ మ‌హిళ‌ల‌పై ఏ మాత్రం గౌర‌వం లేక‌పోవ‌డం వ‌ల్లే మూడునాలుగేళ్ల‌కు ఒక‌సారి భార్య‌ల్ని మారుస్తార‌నే ప్ర‌ధాన ఆరోప‌ణ‌ను ప‌వ‌న్ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

మ‌హిళ‌ల‌పై నిజంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గౌర‌వం వుంటే, ఎవ‌రో ఒక‌రితో చ‌క్క‌గా కాపురం చేసుకునేవాడ‌ని, త‌ర‌చూ ఆడ‌బిడ్డ‌ల జీవితాల‌తో ఆడుకునేవాడు కాద‌నే విమ‌ర్శ‌లు మ‌రోసారి ఆయ‌న‌పై వెల్లువెత్తుతున్నాయి. ర‌క్షాబంధ‌న్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా త‌న ప‌క్షాన‌, జ‌న‌సేన శ్రేణుల ప‌క్షాన అక్కాచెల్లెళ్ల‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు చెప్పారు.

ఆడపడుచులకు అండగా ఉంటామని రక్ష కట్టించుకుంటున్న మనం.. మన కళ్లెదుట ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మన సమాజం, ముఖ్యంగా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం శ్రేయస్కరం కాదని ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేలకు పైగా ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్న అధికారిక గణాంకాలు గుండెల్ని పిండేస్తున్నాయని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాపోయారు. ఈ అదృశ్యాల గురించి ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఆడబిడ్డల గతేంటి అని ఆయ‌న ప్రశ్నించారు. వారి తల్లిదండ్రుల ఆర్తనాదాలు వినేవారు ఎవరని నిల‌దీశారు. ఆడపడుచుల పట్ల ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించినప్పుడే నిజమైన రక్షాబంధన్ అని.. ఆ రోజు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  

ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూక్తులు చెప్ప‌డం అంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా వుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు ఎదురు దాడికి దిగారు. ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ గురించి ప‌వ‌న్ ఎంత త‌క్కువ మాట్లాడితే ఆయ‌న‌కు అంత గౌర‌వ‌మ‌ని హిత‌వు చెబుతున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌హిళ‌ల‌పై మాట‌ల్లో చూపుతున్న అభిమానం, ప్ర‌ద‌ర్శిస్తున్న గౌర‌వంలో క‌నీసం ప‌దో వంతు ఆచ‌రించినా బాగుంటుంద‌ని ప్ర‌త్య‌ర్థులు చీవాట్లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు అన్యాయం చేశాడ‌ని ఇటీవ‌ల ఆయ‌న మాజీ భార్య రేణూదేశాయ్ చెప్పిన వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.