వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల వివాదంలోకి ప‌వ‌న్‌!

వైఎస్ జ‌గ‌న్ కుటుంబ ఆస్తుల వివాదంలోకి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌వేశించారు. ప‌వ‌న్ చేతిలో పంచాయ‌తీరాజ్‌తో పాటు అట‌వీశాఖ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ వాటాల‌పై జ‌గ‌న్‌, ష‌ర్మిల వాదించుకుంటున్న నేప‌థ్యంలో…

వైఎస్ జ‌గ‌న్ కుటుంబ ఆస్తుల వివాదంలోకి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌వేశించారు. ప‌వ‌న్ చేతిలో పంచాయ‌తీరాజ్‌తో పాటు అట‌వీశాఖ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ వాటాల‌పై జ‌గ‌న్‌, ష‌ర్మిల వాదించుకుంటున్న నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆదేశాలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి, మాచ‌వ‌రం మండ‌లాల్లో స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ సంస్థ భూముల్లో అట‌వీ భూములు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీయాల‌ని సంబంధిత అధికారుల‌ను ప‌వ‌న్ ఆదేశించారు. స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ కంపెనీకి భూములు ఎప్పుడో ఇచ్చిన‌వి. 2009 మే 18న సరస్వతి పవర్‌ సంస్థకు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 1,515.93 భూముల్ని ఇచ్చారు. ఆ త‌ర్వాత టీడీపీ ప్ర‌భుత్వం స‌ద‌రు కంపెనీకి సున్న‌పురాయి లీజుల్ని ర‌ద్దు చేసింది.

అనంత‌రం వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత పున‌రుద్ధ‌రించింది. నిజంగా ఆ భూముల్లో అట‌వీ భూములుంటే చంద్ర‌బాబు ఊరుకునే వారా? అలాగే వాగులు, వంక‌లు ఉండేవంటూ సాగుతున్న ప్ర‌చారం నిజ‌మే అయితే ఏనాడో ర‌ద్దు చేసి వుండేవారు క‌దా? స‌రే ఇప్పుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌ర‌స్వ‌తి ప‌వ‌ర్ కంపెనీపై దృష్టి సారించి, ఏం చేస్తారో చూడాలి. ప‌వ‌న్‌ను అడ్డు పెట్టుకుని చంద్ర‌బాబు కొత్త వ్యూహం ఏదైనా ర‌చిస్తున్నారా? అనేది త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం వుంది.

21 Replies to “వైఎస్ జ‌గ‌న్ ఆస్తుల వివాదంలోకి ప‌వ‌న్‌!”

  1. 14. Lo Chandra బాబు ఆల్రెడీ రద్దు చేస్తే మల్ల 2019 లో మలా పునరుద్ధరించారు అయిన 1500 ఎకరాలు లాండ్ జగన్ company ki అప్పజెప్పారు

  2. తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.

    ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?

    సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం

      1. ఎన్ని సార్లు ఇదే ఏడుపు పాట పాడతారు?

        2029 లో కూడా ఇలానే పాడండి.

        మీ ఏడుపు ఆంధ్ర ప్రదేశ్ పాలిట వరం.

        ఇంకా ఇంకా ఏడవండి.

        ఏడుస్తూనే ఉండండి.

      2. They will always go in alliance. TDP may be interested in power to satisfy the ego of a particular community but Pawan is bothered only about the ego of people and will be willing to take lower seats to make YCP 1 in 2029

  3. అప్పట్లో కొన్ని చూసే చూడనట్టు వదిలేసేవారు. ఇప్పుడు వెంట్రుక దొరికినా చుట్టేస్తారు. సరదా తీర్చేస్తారు.

  4. వారి భాష లోనే… చిటికెన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరు అన్నారుగా, అది దొరికినా చాలు మొత్తం పీకేస్తారు….

  5. లేని కంపెనీ కి షేర్స్ ఏమోటో దానికి కొట్టుకోవడం ఏమిటో, ఎవరన్నా చెప్పగలరా

  6. లేని ఇండస్ట్రీ కి షేర్స్ ఏమిటి దానికి కొట్టుకోవడం ఏమిటో కొంచెం చెప్పగలరా

  7. ఉల్లంఘన జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకొనే అధికారం గౌరవనీయులైన మంత్రి గారికి ఉంది.

    చట్ట వ్యతిరేకంగా జరిగినట్టయితే శిక్ష అనుభవించే హక్కు మాజీ ముఖ్య మంత్రి వర్యులకు ఉంది.

Comments are closed.