ఈ నెలలోనే 15న, 143 ఏళ్ల క్రితం జన్మించిన ఉడ్‌హవుస్ నా ఫేవరేట్ ఆంగ్ల రచయిత. ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఉన్న ఒక తరం వారిలో ఉడ్‌హవుస్ రచన కనీసం ఒక్కటైనా చదవని వారుండరనే చెప్పవచ్చు. చదివి చప్పరించేసేవారూ ఉండవచ్చు. కానీ ఓ పుస్తకం చదివినా అభిమానిగా మారేవారే ఎక్కువ. అతనిది ఓ తరహా హాస్యం. అతను సృష్టించిన ప్రపంచమే ఒక తమాషా ప్రపంచం. పాత్రలన్నీ ఒక వింత తర్కంతో ప్రవర్తిస్తాయి. నేచురాలిటీ గురించి వెతికి ‘అబ్బే’ అని పెదవి విరిస్తే ఏం చేయలేం. ఆ ప్రపంచంలోకి వెళ్లడానికి ఇష్టపడ్డవాళ్లకి మాత్రం బోల్డంత రిలీఫ్ దక్కుతుంది.
ఎందుకంటే ఇంగ్లండులోని జమీందారీ వ్యవస్థలో పోతుటీగల్లా బతికే జనాల్ని ఆటపట్టించడమే తప్ప ద్వేషం కనబరచడతను. కథల్లో విలన్లు ఉండరు. దొంగలు, మోసగాళ్లు కూడా చాలా లవబుల్‌గా ఉంటారు. ప్రేమికులు ప్రేమించేసుకుంటూంటారు. అతి స్పీడ్‌గా ఎంగేజ్‌మెంట్ ఇలా చేసుకుంటారు, అలా బ్రేక్ చేసేస్తుంటారు! అంతేకాని భగ్నహృదయంతో ఆత్మహత్యలు చేసేసుకోరు. మారువేషాలు, మారుపేర్లు పెట్టుకుని ఇళ్లల్లో చొరబడిపోతూ వుంటారు. ఏదీ సీరియస్ కాదు. హీరోలు కూడా హీరోయిజం చూపరు. పోలీసుల హెల్మెట్లు కొట్టేసి జైలు పాలవుతూంటారు, చిన్న చిన్న విషయాల మీద పందాలు కట్టి ఓడిపోతూ వుంటారు. ప్రేమకోసం దొంగతనం చేయడానికి కూడా వెనుకాడరు.
కథాగమనం చాలా కాంప్లికేటెడ్, కథ ఎన్నో మలుపులు తిరుగుతూ నడుస్తుంది. ఒక్కోచోట ఆగిపోయి, అతి వివరంగా సన్నివేశం వర్ణించడం జరుగుతుంది. అంతలో సడన్ గా పరిగెడుతుంది. భాష కాస్త జటిలంగానే ఉంటుందని చెప్పాలి. ఇంగ్లీషు భాషపై పట్టు వుంటేనే, ఆనాటి చారిత్రక, సామాజిక, సాహిత్య విషయాలపై అవగాహన ఉంటేనే అర్థం అయ్యేలా ఉంటుంది. అయినా అతని కథలు, నవలలు నిత్యనూతనంగా ఉన్నాయంటే కారణం – ఉడ్‌హవుస్ ఎంచుకున్న థీమ్సే! ప్రేమ అతని ఫేవరేట్ సబ్జక్ట్. మనుష్యుల అవకరాలపై కాకుండా మనోవికారాలపై హాస్యం పండించాడు.
బ్లాండింగ్స్ కాజిల్ కథల్లో లార్డ్ ఎమ్‌వర్త్ అనే కారక్టర్ ఒకటి. మహా మతిమరుపు మనిషి. ఈయనకి పందులు పెంచడమంటే భలే ఇష్టం. ఓ పందిని పెంచి “ఎంప్రెస్” (చక్రవర్తిని) అని పేరు పెడతాడు. దాన్ని ఎవరైనా పంది అన్నారంటే వాళ్ల పని అయిపోయినట్టే! స్మిత్ అనే అతనికి చేప అంటే పడదు. ఏ పని చేయడానికైనా రెడీ. (చేపతో సంబంధం లేకుండా ఉంటే) అని ప్రకటించుకుంటాడు. అసలు స్మిత్ పేరులోనే తమాషా ఉంది. స్మిత్ అనేది ఇంగ్లండులో చాలా కామన్ నేమ్. తన పేరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పేరు ముందు పి’ చేర్చుకుంటాడు అతను. “పిస్మిత్‌యా?” అంటే కాదు. “పి సైలెంట్. సూడో, సైకాలజీ … లాటి పదాల్లో సైలెంటుగా వుండదూ, అలాగే” అంటాడు.
ఈ విధంగా భాషలో కూడా ఉడ్‌హవుస్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. గంభీరమైన పదాలను సాధారణమైన విషయానికి అన్వయించి హాస్యం పుట్టించాడు. ఉదాహరణకి ఎసాసినేట్ అనే పదం పెద్ద పెదవులలో ఉన్నవారి హత్య గురించి చెప్పినప్పుడే ఉపయోగిస్తారని ఇంగ్లీషు చదివిన వారందరికి తెలుసు. కానీ దాన్ని అత్తను చంపడానికి ఉపయోగించి నవ్వు తెప్పిస్తాడు ఉడవుస్. “డూ యూ వాంట్ టు ఎసాసినేట్ యువర్ ఆంట్?” అని హీరో ప్రకటన ఇచ్చేడని రాస్తే నవ్వు వస్తుంది.
సాహితీలోకానికి ఎన్నో పాత్రలను సృష్టించి బహూకరించాడు ఉడ్‌హవుస్. ఎప్పుడూ ఎవరో ఒకర్ని ప్రేమించి ఫైనల్‌గా పెళ్లి చెడగొట్టుకునే ఫ్రెడ్డీ (అడుగు దూరం నడిస్తే ఏదో ఒకదాన్ని తన్నేయకుండా నడవలేడు), బార్‌లో కథలు చెప్పే మ్యులినర్, హుషారైనా మధ్యవయస్కుడు గేలహెడ్, సమర్థుడైన సెక్రటరీ బాక్‌స్టర్ – ఇలా ఎందరో చిరంజీవులు! అందరికంటే ఎక్కువగా నిలిచినది జీవ్స్ పాత్ర. జీవ్స్ మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చింది – 1917లో వెలువడిన “ది మాన్ విత్ టూ లెస్ట్ ఫీట్” అనే కథా సంకలనంలో. 1919లో “మై మాన్ జీవ్స్” అనే జీవ్స్ సంకలనం తర్వాత ఎన్నో సంకలనాలు, నవలలు వెలువడ్డాయి.
జీవ్స్, బెర్టీ ఊస్టర్ అనే పిల్ల జమీందారుకి వాలే (Valet)గా పని చేస్తూంటాడు. వాలే అంటే బట్లరికి కంటే ఎక్కువ. సెక్రటరీకి తక్కువ. యజమాని పనులు అన్నీ చూసిపెడుతూంటాడు. ఊస్టర్ తెలివితక్కువవాడు. అనేక గడ్డు పరిస్థితుల్లో అనవసరంగా ఇరుక్కుంటాంటాడు. జీవ్స్ చమత్కారంగా, అతని అహం దెబ్బతినకుండా బయట పడేస్తూంటాడు. ప్రపంచంలో జీవ్స్‌కి తెలియని విషయం అంటూ ఏదీ లేదన్నట్టు ఆ పాత్రను మలిచాడు ఉడ్‌హవుస్. ఇంటర్నెట్లో ఒక ప్రముఖ సెర్చ్ ఇంజన్ (అడిగిన సమాచారాన్ని సెకండ్లలో అందించేది) పేరేమిటో తెలుసా? ఆస్క్ జీవ్స్ డాట్‌కామ్!
ఈ జీవ్స్ పాత్రను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలని నేను అభిలషించాను. మన తెలుగు రచయితలెందరో ఉడ్‌హవున్ అభిమానులే! డి.వి. నరసరాజు గారికి ఎంతో పేరు తెచ్చిన “నాటకం”కి ప్రేరణ ఉద్‌హవుస్ రచనే! పాలగుమ్మి పద్మరాజుగారి “బ్రతికిన కాలేజీ” ఉడ్‌హవుస్ స్టయిల్ నవలే! ప్రపంచ స్థాయిలో బహుమతి గెలిచి తెలుగు కథకు గుర్తింపు తెచ్చిన పద్మరాజు గారు ‘‘బ్రతికిన కాలేజీ’’ ముందుమాటలో మన హాస్యం గురించి, ఉడ్‌హౌస్ రచనాశైలి గురించి చాలా చక్కగా వివరించారు – ” మన జాతి జీవనంలోనూ, సామాజిక జీవనంలోనూ హాస్యం పాలు తక్కువ ఒక రకమైన హాస్యం, సంస్కృత నాటక సంప్రదాయంలో ఉన్నా, మన సాహిత్యంలో హాస్య రచనలని చెప్పుకో దగ్గవి ఇంచుమించు లేవనే చెప్పాలి. హాస్యంలో ఎన్నో రకాలున్నాయి. ఒకటి వెకిలితనాన్ని ప్రదర్శించేది. మన సంస్కృత నాటకాలలో విదూషకులు మొదలు నేటి సినిమా విదూషకుల వరకు యీ రకం హాస్యానికి ప్రతిరూపాలు. తమ వెకిలి చేష్టలతో మనల్ని నవ్వించడం ఒక్కటే ఈ పాత్రల ప్రయోజనం. ఒకవేళ మనం నవ్వకపోయినా ఆ పాత్రలు నవ్వుతాయి. అవి ఏడిచినా, బాధపడ్డా, ప్రమాదంలో చిక్కుపడ్డా- మనం నవ్వాలి. ఈ పాత్రల అనుభూతితో మనకి సంబంధం లేదు.
“మరొక రకం హాస్యం మనల్ని పొడిచేది. దీనికి సాంస్కృతికమైన ప్రయోజనము ఒకటుంది. రచయిత నమ్మిన కొన్ని సత్యాలను ప్రచారం చెయ్యడానికి ఇదొక శక్తిమంతమైన సాధనం. తన సిద్ధాంతాలకు, నమ్మకాలకు విరుద్ధమైన విషయాల కొందరు ప్రతినిధులను సృష్టిస్తాడు రచయిత. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా, తోలుబొమ్మలలా ఆడించి మనం ఈసడించు కొనేటట్టు చేస్తాడు. ఈ రకం హాస్యం, కొద్దిగా నవలల్లోనూ, ఎక్కువగా నేటి నాటకాలలోనూ కనబడుతుంది. దీన్ని వ్యంగ్య హాస్య మనొచ్చు. పై రెండు పద్ధతులలోనూ, వాస్తవికతను కొంతగానో, ఎక్కువగానో వికృతం చేసి చూపటం సంప్రదాయం. గయ్యాళి అత్తగారూ, దొంగ వ్యాపారస్థుడూ, రాజకీయ నాయకుడూ వాస్తవికంగా వెకిలి వ్యక్తులు కారు. అయితే వాళ్ళ లోని ఒక తరహా వెకిలి చూపడం వల్ల రచయిత ఒక చెడ్డ గుణాన్ని వెక్కిరిస్తున్నాడన్న సంతృప్తి రచయితకీ, చదువరికీ కలుగుతుంది.
మన జాతీయ సాహిత్యాలలో మచ్చుకైనా కనబడని ఒక రకం హాస్యం విదేశీ రచనల్లో ఉంది. ఆ హాస్యానికి నిర్దిష్టమైన స్పష్టమైన సామాజిక ప్రయోజనం ఏదీలేదు. కేవలం సాహిత్య ప్రయోజనమే ఉంది. అటువంటి హాస్య సంప్రదాయం ఒక్క ఆంగ్ల సాహిత్యంలోనే బలంగా ఉన్నట్టు కనబడుతుంది. డికెన్స్, జెరోమ్ కె. జెరోమ్, ఉడ్‌హౌస్ నేను చెప్పిన హాస్యరచనా పద్ధతిలో నిష్ణాతులు. డికెన్స్ కూడా పూర్తిగా కాదు. ఈ హాస్యశిల్పం ఉడ్‌హౌస్‌లో పరాకాష్ట నందుకుందని నా నమ్మకం. అతని పాత్రలలో అతనికయిష్టు లంటూ లేరు. అతి న్యాయవర్తనుడైన లార్డ్ మొదలుకొని, కన్నపు దొంగవరకూ అతనికి ఆప్తులే. చిత్రమేమంటే వాళ్లు మనకి కూడా ఆప్తులైపోతారు. ఆయన కథలు చదువుతుంటే, ఎవరి మీదా ఏవగింపు గాని, కోపం గాని కలగదు మనకి. ‘మానవ లోకాన్ని ఇంచుమించు ఒక ఋషిలాగ చూస్తాడాయన,’ అన్నాడొక విమర్శకుడు. పెద్దల్నీ పిన్నల్నీ చండశాసనుల్నీ మెత్తని మనుషుల్నీ చంటివాళ్ళని చూసినట్లు చూస్తాడాయన. లోకానుభవంతో పండిపోయిన మనిషి ఈ చిలిపి మానవ లోకాన్ని చిరునవ్వుతో, ఆప్యాయతతో చూసినట్టు అన్నమాట.
సంఘటన ఎంత గంభీర మైనదైనా, ఎంత భయంకర మైనదైనా, ఎంత విషాదకర మైనదైనా మనకి ఆయన కలిగించే అనుభవం హాస్యమే. ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎంతటి విషాదంలోనైనా నవల చదువుతుంటే మనకి తెలియకుండా మనం అప్రయత్నంగా నవ్వితే, అలా నవ్విన తర్వాత కూడా మనకి ఏ రకమైన లజ్జాభావం కలగకపోతే అది ఖచ్చితంగా నూరు శాతం ఆరోగ్యకరమైన హాస్యమే. అంచేత ఉడ్‌హౌస్ తరహాలో ఒక కథ కులాసాగా చెప్పాలని బుద్ధి పుట్టింది. ప్రయత్నం చేశాను.’ అని చెప్పుకుని, తెలుగులో ఒక కొత్త పద్ధతికి కట్టుబడి వెకిలితనం, వ్యంగ్యం, అపహాస్యం, అహంకారం లేకుండా సాత్వికత నిండిన ‘‘బ్రతికిన కాలేజీ’’ రాశారాయన. అది నాకు ఎంతో నచ్చింది, ఒరిజినల్ ఉడ్‌హౌస్‌ను చదవమని ప్రేరేపించింది.
“పెళ్లిసందడి” (1959) వంటి తెలుగు సినిమాలలో, విజయా వారి చిత్రాలలో ఉడ్‌హౌసియన్ కారెక్టర్లు ఎన్నో కనబడతాయి. అయితే ఊస్టర్-జీవ్స్ పాత్రలను తెలుగైజ్ చేసి (ఊస్టర్‌కు అనంతశయనం అని, జీవ్స్‌కి అచలపతి అని నామకరణం చేసాను) ఈనాటి పరిస్థితులకు వాళ్లు ఎలా స్పందిస్తారో చూపాలనే కోరికతో ఉడ్‌హౌస్ తరహా కథలంటూ నేను రాసిన “అచలపతి కథలు” అనే దాదాపు 20 కథలు “రచన” పత్రికలో వరుసగా ప్రచురించ బడ్డాయి. వాటికి లోగో వేయమని బాపుగారిని (మరో ఉడ్‌హవుస్ వీరాభిమాని) కోరగా చక్కటి తెలుగు వాతావరణం బొమ్మ వేసి పెట్టారాయన. “హాసం”లో నేను చేసిన ఉడ్‌హవుస్ రచనలు చదివి బాపుగారు “మీ ఉడ్‌హవున్ అనువాదం అద్భుతంగా వుంది. రమణ గారిది తర్వాత అంత చక్కటి అనువాదం నేను చదవలేదు” అని ఆశీర్వదించడం నా అదృష్టంగా భావిస్తాను.
‘‘హాసం’’లోనే ‘‘రాంపండు లీలలు’’ పేర కొన్ని కథలు వరుసగా సీరియల్‌గా రాశాను. బింగో లిటిల్, ఫ్రెడ్డీ ట్రీప్‌వుడ్ అనే యిద్దరు ఉడ్‌హౌస్ కారెక్టర్లను కలగలిపి, కొన్ని సందర్భాల్లో రెండేసి కథలను కలిపి, బాగా తెలుగైజ్ చేసి రాశాను. ‘‘అచలపతి కథలు’’ క్లిష్టమైన హాస్యంతో కూడుకున్నది కాబట్టి ఒక వర్గం వారికి విపరీతంగా నచ్చింది, కానీ ‘‘రాంపండు లీలలు’’ అన్ని వర్గాల వారినీ మెప్పించింది. పుస్తక రూపంలో వేసినప్పుడు రెండూ మూడేసి ముద్రణలు పొందాయి. 2009లో తెలుగు యూనివర్శిటీ నుంచి హాస్య రచయితగా కీర్తి పురస్కారం రావడంలో ‘‘అచలపతి కథలు’’ దోహదపడిందని నా నమ్మకం.
తన హాస్య రచనలతో పాఠకుల హృదయాలలో సుస్థిరస్థానం ఏర్పరచుకున్న ఉడ్‌హవుస్ ఖ్యాతి ఇంగ్లండుకే పరిమితం కాలేదు. అతని రచనలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. కథావాతావరణం ఇంగ్లండుకీ, అందునా ఒక పీరియడ్‌కి సంబంధించినదైనా, అవి రాసి దాదాపు 100 ఏళ్లు గడిచినా వాటిని ఇంకా విరివిగా చదువుతూనే ఉన్నారు. అతని పుస్తకాలు పదేపదే పునర్ముద్రింప బడుతున్నాయి.
ఉడ్‌హవుస్ ప్రతిభ నవలలు, కథల్లోనే కాక మ్యూజికల్స్‌లో కూడా చూడవచ్చు. కోల్ పోర్టర్, ఇర్వింగ్ బెర్లిన్, జార్జ్ గెర్హ్‌విన్ వంటి వారితో కలిసి అనేక మ్యూజికల్ కామెడీస్‌కు రచన చేసాడు. తన నవలలను గై బోల్టన్, అయాన్ హేలతో కలిసి నాటకాలుగా మలిచాడు. తొలిరోజుల్లో అతడు హాంగ్‌కాంగ్ షాంఘై బ్యాంక్‌లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి, అది మానేసాడు. జర్నలిజాన్ని చేపట్టాడు. కథలు కూడా రాసేవాడు. 1902లో “గ్లోబ్” పత్రికలో “బై దివే” అనే కాలమ్ మొదలు పెట్టాడు. “ది కెప్టెన్” అనే పిల్లల మ్యాగజైన్కి స్కూలు స్టోరీస్ పంపుతూండేవాడు. (ఆ సీరీస్ లోనే స్మిత్ మొదటిసారి దర్శనమిచ్చాడు) 1909 తర్వాత అతను ఇంగ్లండులో ఉన్నది తక్కువ. ఎక్కువగా అమెరికాలోనూ, పారిస్ లోనూ ఉన్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూండగా 1940లో అతను పారిస్‌లో చిక్కుకు పోవడం వల్ల చాలా హాని జరిగింది. జర్మనీ వాళ్లు ఫ్రాన్సును ముట్టడించి ఉడ్‌హవుస్‌ను అరెస్టు చేశారు. దేశం విడిచి పోకూడదని ఆంక్షలు విధించారు. అలా నాలుగేళ్లు గడిచేక అతని అభిమానులైన జర్మనీ ఆఫీసర్ల కోరిక మేరకు తన జైలు జీవితం గురించి కొన్ని హాస్య ప్రసంగాలు చేసాడు ఉడ్‌హవుస్. కష్టకాలంలో కూడా హాస్యధోరణిని విడిచి పెట్టని గొప్ప రచయిత తాత్వికత కనబడుతుంది ఆ ప్రసంగాల్లో వాటిని బెర్లిన్ రేడియో బ్రాడ్‌కాస్ట్ చేయడంతో ముప్పు వచ్చిపడింది. ఉడ్‌హవుస్ శతృవులకు అమ్ముడు పోయాడని, జర్మన్ ముష్కరత్వాన్ని అసలు రంగుల్లో చూపకుండా ప్రపంచ ప్రజలకు వారిపై సానుభూతి కలిగేట్లు సహాయ పడ్డాడని ఇంగ్లండులో ప్రచారం జరిగింది. దానిలో నిజం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆ ప్రసంగంలో కొన్ని భాగాలను యిస్తున్నాను.
‘‘నాలుగేళ్లగా ఖైదీ (ఇంటర్నీ)గా ఉన్నాను. “అలా ఎలా వున్నారు సార్?” అని కొంతమంది అడుగుతున్నారు. దానికి చాలా మార్గాలు ఉన్నాయి. నా పద్ధతి ఏమిటంటే ఫ్రాన్సులో ఓ బంగళా కొనడం, జర్మనీ వాళ్లు వచ్చేదాకా వేచి వుండడం. ఇది అతి సింపుల్ మెథడ్. మీరు బంగళా కొనుక్కుంటే చాలు, జర్మనీ వాళ్లు తక్కినది చేసుకుపోతారు…. మొట్టమొదటిసారి జర్మనీ వాళ్లను చూసినప్పుడు గాలి లోకి పదడుగులు ఎగిరాను. అలా ఓ వారం గడిచేసరికి ఐదడుగులే ఎగిరే వాణ్ని. క్రమంగా ఎగరడం మానేసాను. అలవాటు పడతాంగా…!
ఓ రోజు… ఓ జర్మన్ సైనికుడు వచ్చాడు. నా కారు ఇచ్చేయ మన్నాడు, రేడియో ఇచ్చేమన్నాడు. సైకిల్ కూడా ఇచ్చేయ మన్నాడు. మిగతా రెండూ పోయినా ఫరవాలేదు. కానీ సైకిల్ ఇవ్వకూడ దనుకున్నాను. నాకొచ్చిన ఏకైక జర్మన్ వాక్యం “Esist schones Wetter” ఉపయోగించి చూసాను. ఏ ప్రభావమూ కనబళ్లేదు. వాడేమీ మాట్లాడకుండా సైకిలు కూడా పట్టుకు పోయాడు. స్కూలు రోజుల్లో గ్రీకు, లాటిన్ బదులు జర్మన్ నేర్చుకున్నా బాగుండు ననిపించింది ఆ క్షణంలో! ..రోజులు ఇలా గడిచిపోయినా బాగుండు ననుకుంటూ ఉండగానే ఓ రోజు పిలిచి ఖైదులో పెడతామన్నారు. ఇంటికెళ్లి కావలసిన సామాన్లు తెచ్చుకోమన్నారు. వెంట ఓ సైనికుణ్ని పంపారు. ఇంటికొచ్చి స్నానం చేసి, పైపు కాల్చుకుని కాస్సేపు జీవితం గురించి ఆలోచించుకుని బయల్దేరదా మనుకున్నాను నేను. కానీ నాతో వచ్చిన వాడు తొందర మనిషి. ఐదు నిమిషాలంటే వాడి దృష్టిలో చాలా ఎక్కువట. కాస్సేపు వాదించుకున్నాక పది నిమిషాలకు రాజీ కుదిరింది.
రేపు నా జీవిత చరిత్ర రాద్దామనుకునే వాళ్లు గమనించవలసిన అంశం ఒకటి ఉందిక్కడ. ఈ ఖైదు సమయంలో నేను షేక్స్‌పియర్ మొత్తం రచనలు చదివేయాలని తీర్మానించుకున్నాను. నలభై ఏళ్లగా ఆ పని చేద్దామని అనుకుంటూనే ఉన్నాను. ఏ మాక్‌బెత్తో కాస్త మొదలు పెట్టేటప్పటికి డిటెక్టివ్ నవలేదో కనబడేది, దాన్ని పక్కన పడేసేవాణ్ని. కానీ ఈ జైలు జీవితం పుణ్యమాని షేక్స్‌పియర్ మొత్తం చదివేటంత తీరిక కలగజేసారు ఈ జర్మన్ వాళ్లు. నేను ఆ పుస్తకాలు, ఇంకా ఇతర సామాగ్రి సూట్ కేసులో సర్దుకుంటూ ఉంటే మా ఆవిడ ఉన్నవి చాలనట్టు వెన్న పాకెట్ పెట్టుకోమని గోల చేసింది. వెచ్చని వాతావరణంలో సూట్‌కేసులో వెన్న పాకెట్ పెడితే ఏమవుతుందోనన్న ఆలోచన లేదావిడకి. నేను షేక్స్‌పియర్ పుస్తకాలు చదువుదా మనుకున్నానంటే వెన్నపూసిన షేక్స్‌పియర్ పుస్తకాలు కాదని ఆవిడకి నచ్చ చెప్పవలసి వచ్చింది…’’
1945లో యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాతనే ఉడ్‌హవుస్ విడుదల చేయబడ్డాడు. కానీ జీవితాంతం దేశద్రోహి ముద్ర అతన్ని వెంటాడింది. యుద్ధం ముగిసిన 10 సంవత్సరాల దాకా అతనికి అమెరికా పౌరసత్వం లభించలేదు. అతని ప్రతిభకు దక్కవలసిన నైట్ హుడ్ (‘సర్’ బిరుదం) ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత గానీ, అంటే చనిపోయేందుకు కొద్దివారాల ముందు దాకా లభించలేదు.
దీనిలో బ్రిటన్‌కు చేసిన ద్రోహం ఏమిటో వారికే తెలియాలి. పారిస్ నుండి విడుదల అయిన తర్వాత ఉడ్‌హవున్ అమెరికా వచ్చి అక్కడే ఉండిపోయాడు. హాలీవుడ్‌కి కూడా పని చేశాడు. చనిపోయే దాకా రాస్తూనేవున్నాడు. అతను సృష్టించిన పాత్రల ద్వారా చిరంజీవిగా మిగిలిపోయాడు. ఆయన జీవిత విశేషాలు క్లుప్తంగా పూర్తి పేరు: పెహ్లమ్ గ్రీన్విల్ ఉడ్‌హవుస్ జననం: అక్టోబరు 15, 1881, సర్రీ (ఇంగ్లండు)లోని గిల్డ్‌ఫోర్డ్‌లో, విద్యాభ్యాసం: డల్విచ్ కాలేజి, హాబీలు: క్రికెట్ (స్కూలు రోజుల్నించీ,) బాక్సింగ్, వివాహం: 33వ ఏట, ఈథెల్‌తో, పిల్లలు లేరు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టర్ డిగ్రీ: 1939, అమెరికా పౌరసభ్యత్వం: 1955, ఇంగ్లండు రాణి నుండి సర్ బిరుదం: 1975, మరణం: 1975 ఫిబ్రవరి 14, మొత్తం రచనలు: 293 కథలు, 71 నవలలు, ఎన్నో మ్యూజికల్స్, నాటకాలు, ఆత్మకథలు: పెర్ఫామింగ్ ఫ్లీ (1953), ఓవర్ సెవెంటీ (1957).
-ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2024)
హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…
జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…
నువ్వు రాసెది చూసాక అంతకంటె అగ్రగన్యుడు నువ్వె అనిపిస్తుంది !
హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ గుడ్డి కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ గాడు మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…
హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ అందః కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…
పెసాదూ… ఏమిటీ మార్పు… జ్ఞానోదయమా, అజ్ఞానపు రాతలకు తాత్కాలిక విరామమా
హమ్మయ్య… ఎప్పుడూ జగన్ గొప్పోడూ పెపంచం లో సాటి లేని మంచోడు అని వేపుళ్ళు మానేసి, నీ అందః కళ్ళు తెరచి కొత్త పెపంచాన్ని షూష్తున్నావు. షుభకరమైన షంతోషకరమైన విషయమే పెసాదు.. ఎన్నాళ్ళో మరి ఈ అజ్ఞానం లేని విజ్ఞానపు జీవితం… ఐనా నీకు షానా కట్టమొచ్చింది పసాదు… జగన్ మంచోడు అంటే జనాలు నమ్మరు కానీ అలా చెప్పకుండా నువ్వు బతకలేవు… నువ్వు ఈ షాపం నుంచీ బిరిక్కిన విముక్తుడివి కావాలని మా ఏడుకొండల వెంకన్న సామిని కోరుకొని దండం పెట్టుకొంటా…
తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.
ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?
సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం
Kuhana medavi mbs Prasad goppa varu
Ukridge and Uncle Fred in Spring Time are my favourites. I read these almost every month. The pages have become Brown but the pleasure PGW books bring is time less.
ప్రసాద్‌గారి రాజకీయ అభిప్రాయాలు ఆయన ఇష్టం. అవి మనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఈ తరంవారు కనీసం పేరైనా వినని పీజి ఉడ్‌హౌస్ గురించి పరిచయం చెయ్యడం చాలా అభినందనీయమైన ప్రయత్నం. ఉడ్‌హౌస్ కథలు, నవలలు మరీ ఎక్కువగా చదలేదు కానీ చదివినంతవరకూ చాలా నచ్చాయి.
MBS Garu should have given more elaborate details of P.G. Wodehouse (at least in 3 series), instead of telling more about himself. Mullapudi l& Yerramsetti Sai succeeded in bringing out the ‘quick humour’ style of Wodehouse..
Adventures of Sally & Heavy Weather are my favourites of Wodehouse with non-stop humour…
Dear Sir,
Could you please let me know if ‘Padakkurchi Kaburlu’ is available in audio format? If so, I would greatly appreciate it if you could share the source or link where I can purchase it.