హవ్వ.. పవన్ తో రీమేక్ కాదంట!

ముందు ‘భవదీయుడు భగత్ సింగ్’ అన్నారు.. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా పేరు మార్చారు. ఇలా ఎన్ని పేర్లు మార్చినా ఇది ‘తేరీ’ సినిమా రీమేక్ అనే విషయం చిన్న పిల్లాడ్ని…

ముందు ‘భవదీయుడు భగత్ సింగ్’ అన్నారు.. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా పేరు మార్చారు. ఇలా ఎన్ని పేర్లు మార్చినా ఇది ‘తేరీ’ సినిమా రీమేక్ అనే విషయం చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతాడు.

నిజానికి దర్శకుడు హరీశ్ శంకర్ చేతికి రాకముందే, ఈ ప్రాజెక్టు తేరి రీమేక్ అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే, అప్పటికే మరో దర్శకుడు ఈ సినిమాపై వర్క్ చేసి తప్పుకున్న తర్వాత హరీశ్ వచ్చాడు.

అయితే తనదైన స్టయిల్ లో హరీశ్ ఈ ప్రాజెక్టుకు మార్పుచేర్పులు చేశాడు. తను కేవలం పాయింట్ మాత్రమే తీసుకొని, గబ్బర్ సింగ్ రీమేక్ కు ఎలాగైతే మార్పుచేర్పులు చేశానో, అలా చేశానని వెల్లడించాడు.

అదే విషయాన్ని ఈ సినిమాకు రైటర్ గా పనిచేస్తున్న మరో దర్శకుడు దశరధ్ కూడా పలుమార్లు నిర్థారించాడు. తేరి సినిమా నుంచి హరీశ్ శంకర్ ఓ పాయింట్ తీసుకున్నాడని, దాన్ని పవన్ ఫ్యాన్స్ కు నచ్చేలా అన్ని ఎలిమెంట్స్ తో నింపేశాడని చెప్పుకొచ్చాడు.

ఇంతవరకు బాగుంది, ఇదంతా అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా నలుగుతున్నది/నడుస్తున్నది కూడా ఇదే. మరి ఇప్పుడీ సినిమా హఠాత్తుగా తేరి రీమేక్ కాకుండా పోతుందా? గతంలో రీమేక్ అని చెప్పిన దశరధే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కాదంటున్నాడు. అదే ట్విస్ట్.

దశరధ్ తాజా వెర్షన్ ఏంటంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తేరీ రీమేక్ కానే కాదంట. కానీ ఆ సినిమాకు దగ్గరగా మాత్రం ఉంటుందట. అక్కడితో ఆగలేదీయన. గతంలో సమాచార లోపం వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ ను అంతా రీమేక్ అనుకున్నారట. ఇకపై ఎవ్వరూ అలా అనుకోవద్దంటున్నాడు. తేరి నుంచి హరీశ్ ఓ మంచి పాయింట్ మాత్రమే తీసుకున్నాడట. అదీ సంగతి.

3-4 ఏళ్లుగా రీమేక్ గా ముద్రపడిన ఈ ప్రాజెక్టు హఠాత్తుగా రీమేక్ కాకుండా పోతుందా..? ఈ గ్యాప్ లో కథ మార్చారా.. లేక మాట మార్చారా? హరీశ్ శంకర్ ఎప్పట్లానే తన స్టయిల్ లో రీసెంట్ గా ఓ రీమేక్ తీసి డిజాస్టర్ కొనితెచ్చుకున్నాడు. ఆ ప్రభావం పవన్ సినిమాపై పడకుండా ఉండేందుకు ఇలా కవర్ చేస్తున్నారా? లేక చాలామంది దర్శకులు చేసినట్టుగానే హరీశ్ శంకర్ కూడా ‘స్ఫూర్తి’ పొందాడా?

6 Replies to “హవ్వ.. పవన్ తో రీమేక్ కాదంట!”

Comments are closed.