విశాఖ డైరీ మీద పగ పట్టేశారా?

విశాఖలో ప్రసిద్ధి చెందిన సంస్థ విశాఖ డెయిరీ. దాని చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది, దాని వ్యవస్థాపకుడు ఆడారి తులసీరావు టీడీపీలోనే చివరి వరకూ ఉన్నారు. ఆయనను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఆహ్వానించి టికెట్ ఇస్తామని…

విశాఖలో ప్రసిద్ధి చెందిన సంస్థ విశాఖ డెయిరీ. దాని చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది, దాని వ్యవస్థాపకుడు ఆడారి తులసీరావు టీడీపీలోనే చివరి వరకూ ఉన్నారు. ఆయనను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఆహ్వానించి టికెట్ ఇస్తామని చెప్పినా వద్దు అని పాల వ్యాపారం చేసుకున్నారు.

అయితే టీడీపీకి అంగబలం అర్ధబలం తెర వెనుక నుంచే సమకూరుస్తూ పార్టీ మనిషిగానే ముద్ర వేసుకున్నారు. ఆయన వారసులు కూడా టీడీపీలోనే ఉంటూ వచ్చారు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 2024లో తులసీరావు వారసుడు ఆనంద్ వైసీపీ నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు

ఆ తరువాత ఆయన వైసీపీలో యాక్టివిటీని తగ్గించేశారు. తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయనను తిరిగి టీడీపీలోకి తీసుకుని రావడానికి ఒక మాజీ మంత్రి కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ప్రచారం సాగింది.

అయితే ఆడారి ఆనంద్ టీడీపీలో చేరడానికి ఆ పార్టీ కంటే జనసేన నుంచే బ్రేకులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. జనసేనకు చెందిన విశాఖ కార్పోరేటర్ ఒకరు వరసబెట్టి విశాఖ డైరీ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. లేటెస్ట్ గా ఆయన విశాఖ డైరీ భూములు కబ్జా చేసింది అని విశాఖ రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసారు. విశాఖ అరిలోవలో 7.95 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆ ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

దీంతో ఈ కేసు మీద భీమిలి ఆర్డీఓ విశాఖ డెయిరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారంలో విశాఖ డెయిరీ యాజమాన్యం ఇబ్బందులో పడినట్లు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీలో చేరాలనుకుంటున్న వేళ ఈ నోటీసులు రావడంతో ఆనంద్ చేరిక ఉంటుందా లేదా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. అనకాపల్లి ఎలమంచిలి వంటి ప్రాంతాలలో మంచి పట్టు డెయిరీ యాజమాన్యానికి ఉంది. అక్కడ ఆశావహులే టీడీపీలో చేరకుండా ఈ విధంగా అడ్డుపుల్లలు వేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

5 Replies to “విశాఖ డైరీ మీద పగ పట్టేశారా?”

Comments are closed.