పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. ఇది హాస్యాస్పదం. అక్కసుతో మాట తప్ప మరొకటి కాదు. చిత్తూరు జిల్లా రాజకీయాలు తెలిసిన వారికి పెద్దిరెడ్డి తెలుసు, కిరణ్ శక్తి కూడా తెలుసు.
1).పెద్దిరెడ్డి ఫైటరే తప్ప, కాళ్లు పట్టుకునే రకం కాదు.
2).1 997లో డీసీసీ అధ్యక్షుడయ్యారు. అప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారమేమీ లేదు. పెద్దిరెడ్డికి జిల్లాలో నిరంతరం ప్రత్యర్థే తప్ప, కిరణ్ అనుకూలురు కాదు. ఒకేపార్టీలోని ప్రత్యర్థులు.
3). డీసీసీ అధ్యక్షుడు అయ్యినప్పుడు పార్టీ వర్గాలు పెద్దిరెడ్డికి సహకరించలేదు. ప్రమాణ స్వీకారానికి చిత్తూరు గాంధీభవన్‌కి వెళ్తే సీకే బాబు దాడి చేయించాడు. పెద్ద గొడవలయ్యాయి.
4). చిత్తూరు జిల్లాలో ఏనాడూ శక్తిమంతమైన నాయకుడు కాదు. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువగా ఆశ్చర్యపోయింది చిత్తూరు జిల్లా వాసులే.
5). డీసీసీ అధ్యక్షుడిగా తన స్థానం పదిలం చేసుకోడానికి పెద్దిరెడ్డి ఏకంగా సోనియాగాంధీని తిరుపతి రప్పించి తిరుచానూరు రోడ్డులో పెద్ద సభ పెట్టించారు. ఆ రోజుల్లోనే కోట్లు ఖర్చు పెట్టారు. సోనియా సభ పెట్టించగలిగిన వ్యక్తి కిరణ్ కాళ్లు పట్టుకుంటారా?
6). పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు తిరుపతి భీమాస్ హోటల్‌లో పంచాయితీ పెట్టి పెద్దిరెడ్డి అభ్యర్థి రెడ్డెమ్మని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. వ్యూహాల్లో సిద్ధహస్తుడైన పెద్దిరెడ్డి తన చిరకాల ప్రత్యర్థి అయిన కిరణ్ కాళ్లు పట్టుకున్నాడని 27 ఏళ్ల తర్వాత ఈ బ్రహ్మ రహస్యాన్ని విప్పడం నవ్వులాట కాకపోతే మరేంటి?
7). 94 తర్వాత పెద్దిరెడ్డి ఎప్పుడూ ఓడిపోలేదు. కిరణ్, ఆయన తమ్ముడు ఎన్ని సార్లు ఓడిపోయారో అందరికీ తెలుసు.
8). ఒకే పార్టీ అయినా పీలేరులో పెద్దిరెడ్డిని ఓడించడానికి కిరణ్ ప్రయత్నిస్తే, వాయిల్పాడులో కిరణ్‌ను ఓడించడానికి పెద్దిరెడ్డి ప్రయత్నించేవారు.
9). కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ని వదిలేశారు.
10). చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారనే విమర్శలో నిజం వుంది. కాళ్లు పట్టుకోకపోవచ్చు కానీ, ఢిల్లీలో గప్పాలు కొట్టి పదవి తెచ్చుకున్న కిరణ్ ఎంత దారుణంగా విఫలమయ్యారో అందరికీ తెలుసు.
11). ఎన్ని విమర్శలు చేసినా, ఎంత తిట్టినా పెద్దిరెడ్డి శైలి తెలిసిన వాళ్లు కిరణ్ మాటలు నమ్మరు. ఓటమి భయంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మిథున్ చేతిలో ఎలాగూ ఓడిపోతారు.