టీటీడీ చైర్మ‌న్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్ర‌నేత

ఇదే సూత్రం మీకు కూడా వ‌ర్తిస్తుంద‌ని, అప్పుడు వృద్ధాప్య కార‌ణంతో ప్రాణాలు పోయాయ‌ని కుటుంబ స‌భ్యులు వ‌దిలేస్తారా?

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిని బీజేపీ అగ్ర‌నేత‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి టార్గెట్ చేశారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మ‌రీ ముఖ్యంగా టీటీడీ గోశాల‌లో గోవుల మృతిపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. త్వ‌ర‌లో ఈ వ్య‌వ‌హారంపై న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తాన‌ని మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. టీటీడీ గోశాల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని ఆయ‌న సేక‌రించిన‌ట్టు తెలిసింది.

నెల‌ల వారీగా గోశాల‌లో గోవుల మ‌ర‌ణాల‌పై అధికారిక లెక్క‌ల్ని కూడా ఆయ‌న సంపాదించి, ఆధారాల‌తో స‌హా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌నుండ‌డం ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వానికి భ‌యం క‌లిగిస్తోంది. బీజేపీ నేత అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న ఎవ‌రి మాట వినే ర‌కం కాదు. ఒక్క‌సారి ఆయ‌న కేసు స్వీక‌రించారంటే, ప్ర‌త్య‌ర్థుల‌ను ముప్పుతిప్పలు పెట్టే వ‌ర‌కూ వ‌దిలిపెట్ట‌ర‌నే పేరు ఆయ‌న‌కు వుంది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ప్ర‌స్తుతం సోనియాగాంధీ, ఆయ‌న కుమారుడు రాహుల్‌గాంధీ ప‌డుతున్న ఇబ్బందుల‌కు స్వామి వేసిన కేసే కార‌ణం.

తాజాగా ఆయ‌న గోశాల‌లో గోవుల మ‌ర‌ణాల‌పై కూడా స్వామి కేసు వేస్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఎందుక‌నో ఆయ‌న టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిపై చాలా కోపంగా క‌నిపిస్తున్నారు. గోవుల మ‌ర‌ణాల‌పై టీటీడీ చైర్మ‌న్ నిర్ల‌క్ష్యంగా మాట్లాడార‌ని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. వృద్ధాప్యంలో మ‌నుషుల‌ ప్రాణాలు పోయిన‌ట్టే, వ‌య‌సు మ‌ళ్లిన గోవులు కూడా చ‌నిపోతాయ‌ని టీటీడీ చైర్మ‌న్ ఎలా మాట్లాడుతార‌ని ఆయ‌న నిల‌దీశారు.

ఇదే సూత్రం మీకు కూడా వ‌ర్తిస్తుంద‌ని, అప్పుడు వృద్ధాప్య కార‌ణంతో ప్రాణాలు పోయాయ‌ని కుటుంబ స‌భ్యులు వ‌దిలేస్తారా? అని టీటీడీ చైర్మ‌న్‌ను ఆయ‌న ఘాటుగా ప్ర‌శ్నించారు. అంతేకాదు, టీటీడీ చైర్మ‌న్‌ను వెంట‌నే బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీన్నిబ‌ట్టి ఆయ‌న ఎంత ఆగ్ర‌హంగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌త్యేకంగా టీటీడీ చైర్మ‌న్‌, పాల‌క మండ‌లి స‌భ్యుల తీరుపై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తుతున్నారు. దీంతో ఆయ‌న వేయ‌నున్న పిటిష‌న్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. న్యాయ స్థానంలో ఏమ‌వుతుందో అనే భ‌యం వెంటాడుతోంది.

14 Replies to “టీటీడీ చైర్మ‌న్‌ను టార్గెట్ చేసిన బీజేపీ అగ్ర‌నేత”

  1. బీజేపీ అగ్ర నేత నా?:) వట్ట కాయేమన్నా కాదా? నువ్వు తప్పితే వాడొకోదున్నాడు అనే విషయం జనాలు ఎప్పుడో. ….మ ర్చి పోయారు.

  2. pichi poo.. eppudu anniyya kuda potaru edi anna oke sari disease anedi radu kada 19-24 lo shekka chesina di antha byataki vastundi  

  3. ఈయన బీజెపి అగ్రనెత ఎప్పుడు అయ్యాడు? కనీసం ఆ విషయం బీజెపి కి అన్నా తెలుసా?

  4. “ఆధారాల‌తో స‌హా న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌నుండ‌డం ముఖ్యంగా కూట‌మి ప్ర‌భుత్వానికి భ‌యం క‌లిగిస్తోంది….paytm batch…

  5. పెళ్లికి పిలిస్తే వెళ్ళి పెళ్లికూతురికే తాళి కట్టబోయిన confused party, ఇతని గురించి BJP అగ్రనాయకుడు తోటకూర కట్ట అని రాసావంటే నీకు తొందర్లోనే ja*** బా^బాయ్ కి లాగా  దండ వేసి దణ్ణం పెట్టేస్తాడురోయ్ ఎంకి  జాగ్రత్త!!

  6. పెళ్లికి పిలిస్తే వెళ్ళి పెళ్లికూతురికే తాళి కట్టబోయిన confused party, ఇతని గురించి BJP అగ్రనాయకుడు తోటకూర కట్ట అని రాసావంటే నీకు తొందర్లోనే ja*** బా^బాయ్ కి లాగా దండ వేసి దణ్ణం పెట్టేస్తాడురోయ్ ఎంకి జాగ్రత్త!!

Comments are closed.