సీజ్ ద ముంతాజ్ హోట‌ల్ ఎప్పుడు ప‌వ‌న్‌?

టీటీడీని ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో చెప్పార‌ని, దాని అర్థం ఏడు కొండ‌ల్ని నాశ‌నం చేయ‌డ‌మా?

టీటీడీని ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో చెప్పార‌ని, దాని అర్థం ఏడు కొండ‌ల్ని నాశ‌నం చేయ‌డ‌మా? అని శ్రీ‌నివాసానంద స‌ర‌స్వ‌తి స్వామి ప్ర‌శ్నించారు. అలిపిరిలో టీటీడీ భ‌వ‌నం ఎదుట ముంతాజ్ హోట‌ల్ నిర్మాణానికి స్థ‌లం కేటాయించ‌డాన్ని నిర‌సిస్తూ శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో తిరుప‌తిలో టీటీడీ భ‌వ‌నం ఎదుట సాధువులు, హిందూ సంఘాల ప్ర‌తినిధులు నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా శ్రీనివాసానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ ముంతాజ్ హోట‌ల్‌కు టీటీడీ పాల‌క మండ‌లి స్థ‌లం కేటాయించ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ తీర్మానం చేసినా, కూట‌మి ప్ర‌భుత్వం మాత్రం అందుకు భిన్నంగా నిర్ణ‌యం తీసుకుంద‌ని విమ‌ర్శించారు. ఆధ్మాత్మిక న‌గ‌రంలో టూరిజం పేరుతో నాశ‌నం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తిరుమ‌ల ఏడుకొండ‌ల్ని ర‌క్షించుకుందామ‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

తిరుమ‌ల‌ను ప్రక్షాళ‌న చేసుకుందామ‌న్న చంద్ర‌బాబు, అలాగే స‌నాత‌న ధ‌ర్మం అంటూ గ‌గ్గోలు పెట్టిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డంటూ నిల‌దీస్తూ ప్ల‌కార్డుల్ని ప్ర‌ద‌ర్శించారు. అలాగే సీజ్ ద ముంతాజ్ హోట‌ల్ ఎప్పుడు ప‌వ‌న్ అని రాసిన ప్ల‌కార్డు ఆక‌ట్టుకుంది. స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ వీరుడు, సూరుడు, ధీరుడు అయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌ని అక్క‌డికి వ‌చ్చిన వాళ్లు నిల‌దీశారు.

వారాహి డిక్ల‌రేష‌న్ అంటే తిరుమ‌ల దివ్య‌క్షేత్రానికి గుండు కొట్ట‌డ‌మేనా? అని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. వారాహి డిక్ల‌రేష‌న్ అంటే తిరుమ‌ల ఏడుకొండ‌ల పాదాల చెంత ముంతాజ్ హోట‌ల్ నిర్మాణానికి స్థ‌లం కేటాయించ‌డ‌మా? అని సీఎం, డిప్యూటీ సీఎంల‌ను నిల‌దీశారు.

13 Replies to “సీజ్ ద ముంతాజ్ హోట‌ల్ ఎప్పుడు ప‌వ‌న్‌?”

    1. ఇప్పుడు అధికారం మీదే కథ.. ఇంట్లో చేత కానట్టే పాలన కూడా చేతకాద.. ఈ మాత్రం దీనికి ఎందుకు మీకు అధికారం.. అడాంగీ లాగా లంగాలు కొనుక్కోండి ఎర్రిపూక

  1. దేనికైనా ఒక లక్ష్యం ఉండాలి కదా. మంచో చెడో హిందుత్వ కి బీజేపీ రూపంలో ఒక రాజకీయ వేదిక వుంది. దానికి అనుబంధ శాఖలు (RSS , VHP , బజరంగ్ దళ్ మొ..) వున్నాయి. జనసేన ఇంకా ఎక్కువ తీవ్రతతో అదే సిద్ధాంతాన్ని తలకి ఎత్తుకోవటంలో ఓచిత్యం ఏమిటో నాకైతే అర్ధం కావట్లేదు. జనసేన కూడా బీజేపీ అనుబంధ శాఖ గా మారిపోవటం తప్ప. చూస్తుంటే ఇదేదో బీజేపీ ట్రాప్ లాగ వుంది.

  2. తిరుపతి పట్టణం మొత్తాన్ని టీటీడీ దత్తత తీసుకుని, రోడ్స్, త్రాగు నీరు, మురుగు, వృక్ష సంపద లాంటివి పెంచి, ఆల్కహాల్, మాంసం క్రయ విక్రయాలు , జూదం, వ్యభిచారం లాంటివన్నీ బాన్ చెయ్యాలి.

Comments are closed.