జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో తమ పార్టీ వారి పాత్ర బయటకు వస్తుందేమో అనే భయం తెలుగుదేశం నాయకుల్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా మహేశ్వర రావును పోలీసులు విచారించినపుడు కూడా పెద్దగా గోల చేయని ఆ పార్టీ నాయకులు, ఇప్పుడు దుర్గారావు ను అరెస్టు చేయగానే నానా యాగీ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే.. ఆ రాయి దాడిలో జగన్ కంటే ఎక్కువగా గాయపడిన వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని అసలు సూత్రధారులు అని ఆరోపిస్తున్నారు.
ఈ కేసులో దోషి ఎవరో అంత సులువుగా తేల్చలేం అని విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా ముందే చెప్పారు. ఆ సమయంలో చీకటి కారణంగా స్పష్టంగా తేల్చలేక పోతున్నాం అన్నారు. అయితే నిందితులను పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులతో పాటు సంప్రదాయ పద్ధతులను కూడా అనుసరించారు. మొత్తానికి వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలుగుదేశం తూతూ మంత్రంగా నిరసన తెలియజేసింది. వారి పేరుతో పుకార్లను కూడా స్ప్రెడ్ చేసింది.
ఇప్పుడు దుర్గారావు దొరికేసరికి వారిలో భయం పుడుతోంది. తెలుగుదేశానికి చెందిన దుర్గారావు ద్వారా.. ఎవరో ఒక టిడిపి నాయకుడి పాత్ర బయటకు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఆ భయంలో మరీ అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారు.
రాయి దాడి వెనుక వెల్లంపల్లి శ్రీనివాస్, కేశినేని నాని ఉన్నారని బురద చల్లుతున్నారు. ఈ దాడిలో జగన్ కంటే పెద్ద గాయం వెల్లంపల్లికే అయింది. దాదాపుగా కన్ను పోయినంత పరిస్థితి. ఇప్పుడు ఆయన మీదే నింద వేయడం మరీ నీచంగా ఉన్నదని ప్రజలు చీదరించుకుంటున్నారు.