ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ప్రకటించింది. ప్రస్తుతం వారంతా ప్రచారంలో తలమునకలయ్యారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్ర చేస్తున్నారు. నేటికి 9వ రోజుకు యాత్ర చేరింది.
కూటమి విషయానికి వస్తే… ఇంకా టికెట్ల లొల్లి సాగుతోంది. కొందరు టీడీపీ ఇన్‌చార్జ్‌లు టికెట్ల కోసం కుటుంబ సభ్యులతో సహా రోడ్లెక్కి న్యాయం చేయాలంటూ ప్రజల వద్దకు వెళుతున్నారు. అనపర్తి, సత్యవేడు, రాజంపేట, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి ఇలా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు టికెట్లు దక్కకపోవడంతో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఒక్కసారి టికెట్ ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు.
అయితే బాబును వేడుకుంటే టికెట్లు దక్కవని వీళ్లంతా తెలుసుకోవాలి. బాబు టికెట్లు ఇవ్వాలంటే, ఆయనకు సంబంధించిన రహస్యాలను బయట పెడతామనే సంకేతాలు ఇచ్చి, టీవీల ముందుకొచ్చి హెచ్చరికలు ఇవ్వాలి. అప్పుడు మీరు టీడీపీలోనే వుండాల్సిన అవసరం లేదు. అసలు ఏ పార్టీలో లేకపోయినా, మీకు పసుపు కండువా వేసి, అవసరమైతే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిని సైతం మార్చి, మరీ టికెట్ ఇస్తారనే సంగతి తెలుసుకోవాలి.
టికెట్ దక్కించుకునే ఈ సూక్ష్మాన్ని తెలుసుకోకుండా, నియోజకవర్గమంతా తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి జనం వద్దకు వెళితే ప్రయోజనం వుండదు. ఎందుకంటే టికెట్ ఇవ్వాల్సింది చంద్రబాబు. ఏదైనా వుంటే, అతన్నే బెదిరించో, భయపెట్టో, బ్లాక్‌మెయిల్ చేసో అనుకున్నది సాధించాలి. ఆ రకంగా టికెట్ సాధించుకుంటున్న వారిని కళ్ల ముందే పెట్టుకుని, మేల్కోకపోతే తప్పు ఎవరిది? హేమిటో టికెట్ ఎలా సాధించుకోవాలో, తాజాగా పసుపు కండువా కప్పుకున్నోళ్లను కళ్ల ముందే పెట్టుకుని, నియోజకవర్గమంతా ర్యాలీలు , మరొకటి చేసుకుంటూ కాలయాపన చేస్తున్న టీడీపీ ఇన్‌చార్జ్‌లను చూస్తే, జాలి, కోపం ఏకకాలంలో కలగకుండా ఉంటాయా?