కూట‌మి స‌ర్కార్‌పై టీచ‌ర్లు గుస్సా!

ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల తీరే వేరు. ఉద్యోగ వ‌ర్గాల్లో టీచ‌ర్ల‌ను త‌ప్ప‌, ఎవ‌రినైనా తృప్తిప‌రిచొచ్చ‌నే అభిప్రాయం వుంది.

ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల తీరే వేరు. ఉద్యోగ వ‌ర్గాల్లో టీచ‌ర్ల‌ను త‌ప్ప‌, ఎవ‌రినైనా తృప్తిప‌రిచొచ్చ‌నే అభిప్రాయం వుంది. విద్యార్థుల‌కు పాఠాలు చెప్ప‌డంపై కంటే , త‌మ‌కేంటి? అని లెక్క‌లు వేసుకోవ‌డంలో టీచ‌ర్లు ఎక్కువ కాలం గ‌డుపుతుంటార‌నే ఇత‌ర ఉద్యోగులు విమ‌ర్శిస్తుంటారు. విద్యార్థుల‌కు చిత్త‌శుద్ధితో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు చాలా త‌క్కువ మంది వుంటార‌ని స‌ర్వాత్రా వినిపిస్తున్న మాట‌. బ‌హుశా దీన్ని ఉపాధ్యాయులు కూడా కొట్టి పారేయ‌లేరేమో!

వైసీపీ ప్ర‌భుత్వంపై క‌క్ష క‌ట్టి, వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌డంలో ఉపాధ్యాయులు ముందు వ‌రుస‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. కూట‌మికి అనుకూలంగా ఎగిరెగిరి మ‌రీ ఓట్లు వేసి, వేయించామ‌ని ఉపాధ్యాయులే ప్ర‌చారం చేసుకున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే త‌మ బ‌తుకులు మెరుగుప‌డ‌తాయ‌ని వాళ్లంతా ఆశించారు. అయితే ఉపాధ్యాయుల క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి.

వాళ్ల ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ఇంత వ‌ర‌కూ వేత‌నాలే అంద‌లేదు. సోమ‌వారం వేత‌నాలు అందిస్తామ‌ని ప్ర‌భుత్వం నుంచి తాజాగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌డం గ‌మ‌నార్హం. అంటే ఒక‌టో తేదీనే జీతాలు అందిస్తామ‌ని కూట‌మి హామీ …కేవ‌లం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి నెల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్పుడు జీతాల కోసం అవే ఎదురు చూపులు. ఉపాధ్యాయుల ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ చంద‌మైంది.

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌కుండా, ఇత‌ర‌త్రా ప‌నులు ఎక్కువ‌య్యాయ‌ని గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించేవాళ్లు. ఇప్పుడు అలాంటి ప‌నులు ఇంకా పెర‌గ‌డ‌మే త‌ప్ప‌, త‌గ్గ‌లేద‌ని అదే ఉపాధ్యాయులు వాపోతున్నారు. చేసుకున్న వాళ్ల‌కు చేసుకున్నంత మ‌హ‌దేవ అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేద‌ని నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. కోరి తెచ్చుకున్న స‌ర్కార్‌, ఏం చేసినా క‌మ్మ‌గా వుంటుందిలే అనే మాట కూడా లేక‌పోలేదు.

8 Replies to “కూట‌మి స‌ర్కార్‌పై టీచ‌ర్లు గుస్సా!”

  1. హై హై హై నాయకా అని అంటుంటే .. నువ్వెంటి.. టీచర్స్ లేట్ గా జీతాలు వచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నారు.. మా బాబే మా బాబే అని అంటుంటే..పండక్కి మంచి గిఫ్ట్ ఇచ్చావ్… అని ఊరూరూ సంబరాలు చేసుకుంటున్నారు..

  2. ఇంతకు నీకు వచ్చిన నొప్పి ఏంటి నీలాగా వాళ్ళు బ్లాక్మెయిల్స్,బెంచీకిందా చెయ్యిపెట్టి సంపాడిస్తే, ఎప్పుడు జీతం వేసినా బాధలేదు కానీ వాళ్లకి జీతమే ఆధారం రా kukkaa

  3. జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి గత ప్రభుత్వం లో… కానీ ఇప్పుడు అలా లేదుకదా??.. ఇలాంటి వార్తలు ఎందుకో మరి?

  4. శాలరీ సంగతి తెలియదు కానీ టీచర్స్ మీద నీ దుష్ప్రచారం కరెక్టు కాదు GA……జగన్ మీద కత్తి కట్టారని నీ ఏ డు పు

Comments are closed.