ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై విచార‌ణ‌.. అత్యుత్సాహం ఎందుకు?

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ నేతృత్వంలో విచార‌ణ జ‌రుగుతోంది. టీటీడీకి నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన న‌లుగురిని అరెస్ట్ చేశారు.

తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ నేతృత్వంలో విచార‌ణ జ‌రుగుతోంది. టీటీడీకి నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన న‌లుగురిని అరెస్ట్ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో కీల‌క అంశాల్ని ప్ర‌స్తావించారు. దీంతో క‌ల్తీపై ఆరోప‌ణ‌లు వాస్త‌వాలే అన్న‌ట్టు ఒక వ‌ర్గం మీడియా అత్యుత్సాహంతో క‌థ‌నాల్ని వండివారుస్తోంది. అతి చేస్తే, త‌మ అనుకూల ప్ర‌భుత్వ‌మే ఇరుక్కుంటుంద‌నే స్పృహ లేన‌ట్టుంది.

వైసీపీ హ‌యాంలో టెండ‌ర్లు ఖ‌రారైన సంగ‌తి నిజ‌మే. అయితే ఏ నెయ్యిలో అయితే క‌ల్తీ జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు ఆరోపించారో, అ స‌రుకు స‌ర‌ఫ‌రా అయ్యింది ఆయ‌న పాల‌నలోనే అనే సంగ‌తిని మ‌రిచిపోకూడ‌దు. కేవ‌లం నెయ్యి మాత్ర‌మే కాదు, చింత‌పండు త‌దిత‌ర ఐదారు ర‌కాల వ‌స్తువుల్ని టీటీడీ కొనుగోలు చేస్తూ వుంటుంది. టెండర్ల ద్వారా ప్ర‌తిదీ కొనుగోలు చేస్తుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో నిబంధ‌న‌ల మేర‌కు త‌గిన క్వాలిటీ లేద‌ని 100 సార్ల‌కు పైగా నెయ్యి ట్యాంక‌ర్ల‌ను తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. ఇలాంటివి టీటీడీలో కొత్తేమీ కాదు. బాబు పాల‌న మొద‌లైన త‌ర్వాత కూడా అలాంటిదే చోటు చేసుకుంది. కానీ సాక్ష్యాత్తు చంద్ర‌బాబే జంతువుల కొవ్వు క‌లిపి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని త‌యారు చేశార‌ని ఆరోపించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయి. హిందువులంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. క్రిస్టియ‌న్ మ‌త విశ్వాసాలు క‌లిగిన వైఎస్ జ‌గ‌న్ పాల‌న‌లో ఇలా జ‌రిగింద‌ని చెప్ప‌డం ద్వారా, రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌నే కుట్ర‌కు తెర‌లేపార‌ని వైసీపీ ఆరోప‌ణ‌.

మ‌త విశ్వాసాల‌కు సంబంధించిన సున్నిత అంశం కావ‌డంతో వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యంత ప‌విత్ర‌మైన ల‌డ్డూ ప్ర‌సాదంపై రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఆరోప‌ణ‌లు ఎలా చేస్తార‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిల‌దీసింది. విచార‌ణ నిమిత్తం ఏపీ ప్ర‌భుత్వం వేసిన సిట్‌ను ర‌ద్దు చేసింది. సీబీఐ నేతృత్వంలో విచార‌ణ చేయాల‌ని ఆదేశాలిచ్చింది. ఈ విచార‌ణ క‌మిటీలో ఇద్ద‌రు రాష్ట్ర అధికారులు ఉండొచ్చ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.

ప్ర‌స్తుతం ఆ క‌మిటీ విచార‌ణ చేప‌ట్టి, న‌లుగురిని అరెస్ట్ కూడా చేసింది. ఈ సంద‌ర్భంగా టీటీడీకి నెయ్యి స‌ర‌ఫ‌రా చేసిన త‌మిళ‌నాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ చుట్టూ క‌థ న‌డుస్తోంది. తాజా రిమాండ్ రిపోర్ట్‌లో 2024లో ఏఆర్ డెయిరీ కి టెండర్ ₹319.80 కి.గ్రా. ధరకు కేటాయించారు. స‌ర‌ఫ‌రా మొద‌లైంది జూన్‌లో. అంటే చంద్ర‌బాబు పాల‌న మొద‌లైంది అప్పుడే.

టెండ‌ర్ ఖ‌రారుకు టీటీడీ జేఈవో, ఈ-ప్రొక్యూర్‌మెంట్ జీఎం త‌దిత‌ర అధికారుల సంత‌కాల త‌ర్వాతే, ఈవో చేస్తారు. వీళ్లంద‌రూ పూర్తి బాధ్య‌త వ‌హించాల్సి వుంటుంది. టీటీడీ తిరుప‌తి జేఈవోగా వైసీపీ హ‌యాం నాటి అధికారే ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నారు. అలాగే క‌ల్తీ జ‌రిగింద‌ని, విచారించాలంటూ ఫిర్యాదు చేసిన జీఎం… ఈ మ‌ధ్యే ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. వీళ్లంద‌రినీ సీబీఐ విచార‌ణ చేయాల్సి వుంటుంది. అలాగే చంద్ర‌బాబు పాల‌న‌లోనే నెయ్యి ట్యాంక‌ర్ల‌ను తిరస్క‌రించారు. ఇవ‌న్నీ ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రిమాండ్ రిపోర్ట్‌తోనే ఏదో అయిపోయింద‌నే అత్యుత్సాహం ప‌నికిరాద‌ని తెలుసుకుంటే మంచిది.

22 Replies to “ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీపై విచార‌ణ‌.. అత్యుత్సాహం ఎందుకు?”

  1. సుప్రీం కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వ సిట్ ని రద్దు చేసి తన అద్వర్యం లో విచారణ కి ఆదేశించినప్పుడు సంకలుగుద్దుకొని అత్యోత్సహాహం ప్రదర్శించింది మనం కాదా!!!!!

  2. జూన్ నుంచి లడ్డూ మీద పసుపు నీళ్లు జల్లేరు So శుద్ది అయిపోయింది లడ్డూ. OK నా?

    1. హైసెన్స్ గారూ, మీరు ఏ మతానికి చెందిన వారైనా సరే, హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలు చాలా అసభ్యంగా ఉన్నాయి. ఇతరుల విశ్వాసాల పట్ల కనీస గౌరవం చూపకుండా మాట్లాడటం మానవ సంబంధాలకు హాని కలిగిస్తుంది. మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది, కానీ ఒక మతాన్ని ఎగతాళి చేయడం తగదు. మల్లీసరి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా, పరస్పర గౌరవాన్ని పాటించండి.

  3. నువ్వు చెప్పిన సొల్లు ప్రకారం.. ఈ విచారణ, అరెస్టులు.. టీడీపీ కి డామేజ్ చేసే విధం గానే ఉండి ఉంటె.. సాక్షి లో ఈ వార్త ఎక్కడా రాయలేదెందుకు..?

    పచ్చ మీడియా చూపిస్తున్న ఉత్సాహం.. నీలి, కూలి మీడియా లో లేదెందుకు..?

    ..

    సిబిఐ సిట్ నలుగురిని అరెస్ట్ చేసింది.. అనే వార్త సాక్షి లో చివరి పేజ్ లో కూడా రాయలేదు..

    అది మీకు వార్త కాదా.. లేక భుజాలు తడుముకొంటున్నారా..?

    ..

    ఇదే కాదు..

    సుప్రీమ్ కోర్ట్ నేర చరితుల పార్టీల గురించి కూడా ఘాటుగా స్టేట్మెంట్ ఇస్తే.. జగన్ రెడ్డి మీడియా సౌండ్ లేదు.. వార్త లేదు..

    ఇజయమ్మ ఆస్తుల విషయం రిటర్న్ కౌంటర్ చేస్తూ.. జగన్ రెడ్డి ని, భారతి రెడ్డి ని లిటరల్ గా “నోరు మూసుకుని” ఉండమని ఘాటుగా కౌంటర్ ఇస్తే.. జగన్ రెడ్డి మీడియా ఎందుకు మౌన వ్రతం పాటిస్తోంది..?

    ..

    మార్గదర్శి వార్తల పక్కనే ఇవి కూడా రాయొచ్చు కదా..

    పాపం.. బురద లో నిండా మునిగిపోయాక.. ఇంకా బురద అంటించుకోవడం ఎందుకు .. అని ఆలోచిస్తున్నారేమో..

    1. ఇవి మా వార్తలు కాదు మా వార్తలు ప్రత్యేకంగా ఉంటాయి: జొన్న పొత్తులు

  4. 335 రూ. లకి కొని 319 రూ. లకి అమ్ముతున్నారంటేనే తెలుస్తుంది కల్తీ జరిగిందని. తొందరెందుకు అందరి భాగోతాలు బయటికి వస్తాయి.

  5. రాష్త్ర ప్రభుత్వంలో నే దర్యాప్తు జరిగితే చంద్రబాబు కాళ్ళ వేళ్ళ పడితే ఎప్పుడో ఒకప్పుడు కరుణించేవాడు. నువ్వు ఓవర్ ఆక్షన్ చేసి సుప్రీమ్ కోర్ట్ వెళ్ళటం వలెనే కోర్ట్ సిబిఐ ఎంక్వయిరీ వేసింది. నీ వలెనే ఇప్పుడు సిబిఐ బోనులో ఇర్రుక్కు పోయామని సుబ్బారెడ్డి ని భూమన తిడుతున్నారట కాదా?

  6. “రిమాండ్ రిపోర్ట్‌తోనే ఏదో అయిపోయింద‌నే అత్యుత్సాహం ప‌నికిరాద‌ని తెలుసుకుంటే మంచిది”….GA is warning not to doubt ycheap fellows.

  7. హైసెన్స్ గారూ, మీ మతం ఏదైనా సరే, హిందూ ధర్మాన్ని అవమానించడం పూర్తిగా నిరాకరించబడే చర్య. మీరు చేసిన వ్యాఖ్యలు మీకు ఏ విలువ లేకుండా, ఇతరుల విశ్వాసాల పట్ల కూడా గౌరవం లేకుండా కనిపిస్తాయి. వ్యక్తిగత అభిప్రాయాలను కలిగి ఉండటం మీ హక్కు. కానీ, వాటిని ఇతరుల విశ్వాసాల మీద అవహేళన చేయడానికి ఉపయోగించడం అసలు తగదు.

    ఇలాంటి మాటలు చెప్పడంలో ఏమాత్రం విజయం లేదు; మనం పరస్పర గౌరవంతో ఉండే సమాజం కోసం కృషి చేయాలి. అందువల్ల, మీ వ్యాఖ్యల తీరును పూర్తిగా మార్చుకోండి. వ్యక్తిగత భావాలను వ్యక్తం చేయడంలో జాగ్రత్త వహించండి, పతితమైన వ్యాఖ్యల బదులు ఆలోచనాత్మకమైన మాటలతో మీకు కావలసిన మార్పును తీసుకురండి. అనవసరమైన వివాదాల బదులు, మంచి సలహాలను ఇవ్వడం, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడం మీద దృష్టి పెట్టండి. ఇదే నిజమైన మార్గం, ఇది మంచి సమాజం నిర్మాణానికి దోహదపడుతుంది.

  8. “వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో నిబంధ‌న‌ల మేర‌కు త‌గిన క్వాలిటీ లేద‌ని 100 సార్ల‌కు పైగా నెయ్యి ట్యాంక‌ర్ల‌ను తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది.”…

    if it is fact, prove it. fake fellows

Comments are closed.