రాను రాను ఒకటే సీజన్ మిగిలేలా వుంది తెలుగు సినిమాలకు. సంక్రాంతి సీజన్. దాని కోసమే పోటీ పడుతున్నారంతా. 2024లో గుంటూరుకారం-హనుమాన్ హడావుడి చూసి 2025 సంక్రాంతికి చాలా కాలం ముందే డేట్ లు వేసారు. దిల్ రాజు ఓ సినిమా తమ బ్యానర్ నుంచి వస్తుందని చెప్పారు. డాకూ మహరాజ్ డేట్ వేసారు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే సినిమా మొదలు పెట్టారు. ఆ విధంగా 2025 సంక్రాంతి గడిచింది. ఇప్పుడు 2026 వంతు వస్తోంది.
సందీప్ వంగా-ప్రభాస్ సినిమా వస్తుందనే టాక్ వుంది. కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు. వన్స్ ప్రారంభమైతే చకచకా బండి లాగించేస్తారు సందీప్ వంగా.
సితార సంస్థ ఓ సినిమాను ప్రతి సంక్రాంతికి దింపినట్లే ఈ 2026 సంక్రాంతికి కూడా తీసుకువస్తుంది. ఇప్పటికి రెండు సార్లు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దింపారు. కానీ ఫర్ ఏ ఛేంజ్ ఈసారి సంక్రాంతికి మిడ్ రేంజ్ సినిమా దింపాలనుకుంటున్నారు. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో ఏదో ఒకటి దింపే అవకాశం వుంది
మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సాహు నిర్మించే సినిమా 2026 సంక్రాంతికి ఫిక్స్. మరో సినిమాకు అవకాశం వుంటుంది కనుక నిర్మాత దిల్ రాజు మళ్లీ బరిలోకి రావచ్చు. బలగం వేణు-నితిన్ సినిమా ఎల్లమ్మ ను తీసుకువచ్చే అవకాశం వుంది.
నెక్స్ట్ ఎలేచ్షన్స్ కి ఇప్పటి నుంచి అభ్యర్థుల్ని ఖరారు చేస్తుంటే ..ఇదేమి వింత కాదులే ..
అబ్బ
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Wtoww