తిరుమల హోటళ్ల వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు!

ఇంతకూ బిఆర్ నాయుడు ఏ స్థాయి భక్తుల గురించి మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అవగాహన ఉందా?

ఎవరి దందా వారిది! పదవి దక్కగానే.. తమతమ మార్గాల్లో సొంత దందాలను ప్రారంభించడానికి ఎవ్వరైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. తమ తమ వ్యాపార ప్రయోజనాలు స్థిరపడడానికి.. దక్కిన పదవులు మార్గంగా మారాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ గా బిఆర్ నాయుడు వ్యవహారం కూడా అలాగే అనిపిస్తోంది. ఆయన తిరుమలలో ప్రెవేటు హోటళ్లు, క్యాంటీన్ లను సంస్కరించే పని పెట్టుకున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడున్నవి సక్రమంగా లేవు అని తేల్చేసి.. వాటి స్థానంలో విదేశాల్లోని పలు బ్రాండెడ్ రెస్టారెంట్లను తీసుకురావడానికి ఆయన స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.

బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానాల పదవిలో నియమితులైనప్పుడు చాలా ఆదర్శాలు వల్లించారు. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడం, మీడియాలో సుదీర్ఘ కాలంగా వ్యవహారాల్లో జరిగే తప్పొప్పులను గురించి తెలుసుకుంటూ ఉండే వ్యక్తి కావడం వలన.. ఆయన వల్లించిన ఆదర్శాలన్నీ చిత్తశుద్ధితో చెప్పినవే అని అందరూ అనుకున్నారు. కానీ ఆచరణలో అలా కనిపించడంలేదు.

తాజాగా తిరుమలలో ప్రెవేటు హోటళ్లలో దొరికే ఆహారం గురించి బిఆర్ నాయుడు వ్యాఖ్యలు ఒక క్లారిటీ లేకుండా ఉన్నాయి.

తిరుమలలో 17 పెద్ద క్యాంటీన్ల నిర్వహణ సక్రమంగా లేదు.. విదేశాల్లోని బ్రాండెడ్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నందున వాటిద్వారా నాణ్యమైన ఆహారం అందిస్తాం అని అంటున్నారు. చూడబోతే.. ముందే ‘బ్రాండెడ్ కంపెనీల’ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా 17 క్యాంటీన్ల నోరు కొట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఉంది.

ఇంతకూ బిఆర్ నాయుడు ఏ స్థాయి భక్తుల గురించి మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అవగాహన ఉందా? విదేశీ కంపెనీలను తెచ్చి.. ఖరీదైన భోజనాలను సంపన్న భక్తులకు వడ్డించాలని అనుకుంటున్నారా?

తిరుమలలోనే రోడ్డు పక్కన 20, 30 రూపాయలకు దొరికే టిఫిన్లు తినే పేద భక్తుల సంగతేమిటి? ఆ చిన్న హోటళ్లన్నీ అద్భుతమైన నాణ్యతతో అందిస్తున్నాయా? లేదా వాటన్నింటి స్థానంలో కూడా విదేశీ కంపెనీల్ని పెడతారా? లేదా, పేద భక్తులు ఏ చెత్త తిన్నా పరవాలేదు గానీ.. సంపన్న భక్తులు మాత్రం నాణ్యమైన భోజనాలు తినాలని తమరు కోరుకుంటున్నారా? ఏమిటీ దుర్మార్గమైన వివక్ష అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

10 Replies to “తిరుమల హోటళ్ల వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు!”

  1. అధికారం ఇస్తే, తిరుమలలో

    “దర్శన యాపారం” చేసి కోట్లు సంపాయించిన నగ్రి “నల్ల పిర్రల బర్రె” ఇప్పుడు నిక్కర్లేసుకుని, పైవి ఊపుకుంటూ విదేశీ వీదుల్లో యాపారం మొదలెట్టిందట కదా??

  2. Yem rasaavuraaa kulagajjiiiiii kunkaaa, Ayana matladindi a2b, saravana bhavan lanti companies aithe brand kosam ainaa quality maintain chesaayi annadu. Ippudu unna careens lo tinnavaa? Rates Yemi takkuva kaadu, quality ledu, uchitha satralakante darunam

    1. There is no guarantee that these international hotels will serve 100% vegetarian oil for cooking…

      cbn gaadu deentloki kuda Jagan ni laaguthaadu…tdp pigs ?? Any comments

      use your pea brain this time..

      😂😂😂

  3. If these hotels doesn’t serve bramhmana bojanam, who is responsible? Jagan right ?

    if they use animal fat oil or kalthy oil, who is responsible?? idi kuda jagan right?

    tdp pigs, any responses??

Comments are closed.