చంద్రబాబుకు ఒక బిరుదు ఉంది. అది మ్యానిపులేటర్ అని. అంటే దేన్ని అయినా బాగా మ్యానేజ్ చేయడంలో బాబు దిట్ట అని రాజకీయ ప్రత్యర్ధులు సైతం అంగీకరిస్తారు. చంద్రబాబు తలచుకోవాలే కానీ ఇలాంటి వాటిలో మాస్టర్ అని చెబుతారు.
ఇపుడు ఆ మాటలు నిన్నటి తెలుగు తమ్ముడు, నేటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అంటున్నారు. బాబు వ్యవస్థలను మ్యానేేజ్ చేయడంలో టాప్ అనేశారు మంత్రి గారు. అయితే బాబు తన రాజకీయ చాతుర్యం అంతా ఈ విధంగానేే చూపిస్తూ రాష్ట్రంలో అభివ్రుధ్ధిని అడ్డుకుంటున్నారని అవంతి మండిపడ్డారు.
దేవుడి భూములను అమ్మడంలో తెలుగుదేశమే ఫస్ట్ అని కూడా అంటున్నారు. నాడు తెలుగుదేశం చేస్తే ఒప్పు, ఇపుడు అదే చెడ్డదైందా బాబూ అంటూ అవంతి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా టీటీడీకి ప్రత్యేక చట్టం ఉంటుందని, బోర్డ్ ద్వారా వారు నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి అన్నారు.
టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో జగన్ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది అని ఆయన అన్నారు. చంద్రబాబు ఏపీకి వస్తామని అనుమతి కోరితే అపుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి చెబుతున్నారు. మొత్తానికి బాబుకు ఎలా తలంటాలో అలా అంటేశారుగా.
ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు