రాజ ధర్మం.. బాబు ధర్మం

కుప్పం వెళ్లగానే చంద్రబాబుకి రాజధర్మం గుర్తుకొచ్చింది. కుప్పంకి నీళ్లివ్వరా అంటూ ప్రశ్నించారు. ఆనాడు నేను పులివెందులకి నీళ్లిచ్చాను, ఆ తర్వాతే కుప్పానికి ఇస్తానన్నాను అంటూ రెచ్చిపోయారు. పులివెందుల రాజకీయం చేస్తున్నారు, కుప్పంకి నీరు రాకుండా…

కుప్పం వెళ్లగానే చంద్రబాబుకి రాజధర్మం గుర్తుకొచ్చింది. కుప్పంకి నీళ్లివ్వరా అంటూ ప్రశ్నించారు. ఆనాడు నేను పులివెందులకి నీళ్లిచ్చాను, ఆ తర్వాతే కుప్పానికి ఇస్తానన్నాను అంటూ రెచ్చిపోయారు. పులివెందుల రాజకీయం చేస్తున్నారు, కుప్పంకి నీరు రాకుండా అడ్డుకుంటున్నారంటూ నిందలు వేశారు. “నేను చేసింది రాజధర్మం.. అవునా కాదా తమ్ముళ్లూ” అంటూ తనదైన శైలిలో అల్లుకుపోయారు.

ఇంతకీ చంద్రబాబు చేసిన రాజధర్మం ఏంటి? అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే రాజధర్మం అయితే, మరి చంద్రబాబు అమరావతి విషయంలో చేసింది ''బాబు ధర్మమా''. రాష్ట్ర సంపాదన మొత్తం అమరావతిలో కేంద్రీకరించి, అరకొర కట్టడాలతో మాయ చేసి, గ్రాఫిక్స్ కి కోట్లు తగలేసి, సినీ దర్శకుల షూటింగ్ లతో హడావిడి చేసి ప్రజల ప్రాణాలు హరించి.. చంద్రబాబు చేసింది నిజంగానే రాజ ధర్మమా?

అసలు రాజు అనేవాడు ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు నెటిజన్లు. రాజధర్మం పాటించాడు కాబట్టే, అమరావతితో పాటు అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానులతో సమగ్ర అభివృద్ధి కోసం కృషిచేస్తున్నారు. రాక్షసుల రూపంలో ప్రతిపక్ష నేతలు అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డుపడుతున్నా కూడా తన పని తాను చేసుకుపోతున్నారు.

మేకపోతు గాంభీర్యం..

కుప్పం వెళ్లగానే స్థానిక నాయకుల్ని చూసి కొత్త ఉత్సాహం వచ్చిందో ఏమో.. చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. “ఒకసారి బెదిరించారు, రెండోసారి బెదిరించారు. ఇక బెదరం, మాకు అలవాటైపోయింది, భయపడేది లేదంటూ” రెచ్చిపోయారు బాబు. 

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ గెలుస్తుందని, ఎన్టీఆర్ పార్టీకి పెట్టిన మహూర్తం అలాంటిదని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా అన్నీ తిరిగి చెల్లిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ప్రజల్ని కాపాడుకుంటా, అండగా ఉంటా అంటూ వారిలో లేనిపోని భయాందోళనలు సృష్టించారు బాబు.

ఎంపీటీసీ, జడ్పీటీసి అభ్యర్థుల్ని వెంటబెట్టుకుని కుప్పం నుంచే ప్రచారపర్వం మొదలుపెట్టారు చంద్రబాబు. మొత్తమ్మీద జూమ్ లో నుంచి బయటకు వచ్చినా చంద్రబాబు అరిగిన రికార్డు వేయడం మాత్రం మానుకోలేదు. కుప్పంలో రెండుమూడు చోట్ల వాహనం ఆపి చెప్పిందే చెప్పి విసిగించారు.

కుప్పంలో పార్టీ ఎందుకు ఓడిపోయిందనే విషయంపై పోస్టుమార్టం చేయడానికి వెళ్లిన బాబు.. అక్కడ కూడా తన గొప్పలు చెప్పుకుని తనని తానే ఓదార్చుకున్నారు. దానికి తోడు స్థానిక నాయకులు ఎరేంజ్ చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ లు.. బాబూ జిందాబాద్ అంటూ మరింత హడావిడి చేశారు. బాబుని మరింత భ్రమల్లోకి నెట్టేశారు. 

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి

నా సినిమాల బడ్జెట్స్ అందుకే పెరుగుతాయి