ఏ విషయాన్నైనా రాజకీయం చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్లే చంద్రబాబు.. ఆఖరికి కరోనా విషయంలో కూడా తన నీచ రాజకీయాలు మానుకోలేదు. కరోనా కేసుల్ని దాస్తున్నారని, సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి తన రాజకీయాల్లోకి ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా లాగి వాళ్ల జీవితాల్ని నాశనం చేశారు. ఇలా కొన్ని రోజులుగా కరోనాపై కుళ్లు రాజకీయం చేస్తున్న చంద్రబాబు నోటికి తాళం పడింది.
మొన్నటికిమొన్న కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అత్యుత్తమంగా ఉన్నాయంటూ జాతీయస్థాయి ఛానెల్ ఎన్డీటీవీ, రాష్ట్రానికి నంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టింది. ఏపీలో చేపడుతున్న చర్యలు మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.
ఈ నివేదిక బయటకొచ్చిన తర్వాత ఎల్లో బ్యాచ్ లో చాలామంది సైలెంట్ అయ్యారు. అవాకులు చెవాకులు వాగడం ఆపేశారు. అయినా ఇంకొంతమంది తమ ఆరోపణలు మానలేదు. ఇప్పుడు వాళ్ల నోళ్లకు కూడా తాళం పడేలా కేంద్రం ఓ ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తమమైన పద్ధతులు అవలంబిస్తోందని కేంద్రం ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ.. బహిరంగ ప్రదేశాల శుభ్రత, క్వారంటైన కేంద్రాల నిర్వహణ, అనాథలు-పేదలకు ఆశ్రయం, ఉచిత రేషన్, ఆర్థిక సహాయం లాంటి కార్యక్రమాల్లో ఏపీ అనుసరిస్తున్న విధానాలు అత్యుత్తమమని కొనియాడాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ విధానాన్ని అనుసరించాలని సూచించింది.
ఇప్పటికీ బాబుకు బుద్ధి రాకపోతే ఓ విదేశీయుడు చెప్పే మాటలైనా ఓసారి వినాలి. బ్రిటన్ లోని వేల్స్ కు చెందిన క్లైవ్ బ్రియాంట్ కరోనా టైమ్ లో ఏపీలో చిక్కుకున్నాడు. విమానాల్లేకపోవడంతో తిరుపతిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. విదేశీయుడు కావడంతో అతడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు. అలా మార్చి 24 నుంచి తిరుపతిలోని శ్రీ పద్మావతి నిలయం వద్ద ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉండిపోయిన బ్రయాంట్.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న సేవల్ని కొనియాడాడు.
నిన్నటితో తన క్వారంటైన్ పూర్తిచేసుకున్న ఈ విదేశీయుడు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, వైద్యులు-నర్సుల పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ఈ మేరకు తన స్వదస్తూరితో ప్రభుత్వానికి కృతజ్ఞత చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు.
ఇన్ని ఉదంతాల తర్వాత కూడా ఇంకా కరోనాపై చంద్రబాబు రాజకీయం చేయాలనుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. పైగా ఆయన విమర్శలు చేస్తోంది ఏపీ గడ్డపై నుంచి కాదు. హైదరాబాద్ లో తన అద్దాల మేడలో కూర్చొని ఏపీలో కరోనా నివారణ చర్యలపై, ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇదీ చంద్రబాబు రాజకీయం.