మొన్నటి వరకూ మోడీని పొగుడుతుంటే కంగనా రనౌత్ మాటలు భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు సమ్మగా అనిపించాయి! ఆమె నిజాలు మాట్లాడుతోందని వీరు అభినందించారు. అందుకే ఆమెను జనాలు అన్ ఫాలో అవుతున్నట్టుగా కూడా భాష్యం పలికారు. అయితే ఒక్కసారిగా కంగనా డీప్ ట్రబుల్ లో అడుగుపెట్టేసరికి.. అది రాజకీయంగా తమకు దెబ్బ అవుతంఉదనే లెక్కలతో బీజేపీ రియాక్ట్ అయ్యింది. కంగనాతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించేసి, చేతులు దులుపుకునేసింది!
ముంబై మహానగరాన్ని పాకిస్తాన్ గా అభివర్ణించి వివాదాన్ని రేపింది కంగనా. బాలీవుడ్ జనాలపై కంగనా అవాకులు చవాకులు పేలుతూ ఉంది. ఈ క్రమంలో ఇదే ఊపులో.. ముంబైని కూడా పోల్చరాని పోలికతో పోల్చింది. ఆమె మాటలు వివాదం పాలయ్యాయి.
అసలే అది ముంబై. అక్కడ ప్రాంతీయ శక్తులకు బలం ఎక్కువ. బిహారీ కూలీలను కూడా తరిమితరిమి కొట్టిన చరిత్ర ఉంది ఆ నగరంలో. అలాంటి నగరంలో జీవిస్తూ.. ఆ నగరంలో ఉంటూ సంపాదించుకుంటూ.. దాన్ని పీవోకేతో పోల్చి కంగనా.. ఆ నగరంలోని సగటు జీవి ఆగ్రహానికి కూడా గురవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది.
తమకూ కంగనా కూ సంబంధం లేదని, ఆమె అభిప్రాయాన్ని ఖండిస్తున్నట్టుగా కూడా ఒక రాయి వేసేశారు కమలనాథులు. బహుశా ఇప్పుడు కంగనాకు అసలు సిసలు వాస్తవాలు అర్థం అయ్యే అవకాశాలున్నాయి. బాలీవుడ్ జనాల మీద ఏం పేలినా వాళ్లు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ల గురించి నిజాలే మాట్లాడిందో, బురదే జల్లిందో కానీ.. అవన్నీ సిల్లీ వార్తలుగానే మిగిలాయి. అలా అలవాటైన వదరబోతుతనంతో కంగనా నోరు జారింది. బీజేపీ కూడా ఆమెతో తమకు సంబంధం లేదని తేల్చింది! కంగనాకు ఇకనైనా తత్వం బోధపడుతుందా?