శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ భారీ సవాల్ ఒకటి తాజాగా విసిరారు. అది కూడా తన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో పబ్లిక్ మీటింగ్ నుంచే టీడీపీ గుండెలదిరే విధంగా చాలెంజ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుంది. జగనే మళ్లీ సీఎం. ఇది బల్ల గుద్ది చెప్పే మాట. ఎనీ డౌట్స్ అని అని ధర్మాన గర్జించారు. అంతే కాదు, ఒక వేళ తమ అంచనా తప్పు అయితే తన కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు. మేము రాజకీయం అన్న మాటే ఫ్యూచర్ లో ఎక్కడా ఎత్తమని కూడా శపధం పట్టారు.
ఇక దీనికి ముందు కూడా ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మన ఒక సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే ఏకంగా నా ఆస్తులు మొత్తం రాసిచి వెళ్ళిపోతా. పందేనికి నేను రెడీ. మీరు ఓకేనా అంటూ టీడీపీ వారిని ముగ్గులోకి లాగారు.
మరి నాడూ నేడూ కూడా ధర్మాన సవాళ్లకు అటు నుంచి జవాబు అయితే లేదు. కానీ ధర్మాన ఫుల్ కాన్ఫిడెంట్ గానే చెబుతున్నారు. మరో మారు వచ్చేది జగన్ సర్కారే. ఇది నూటికి రెండు వందల పాళ్ళు నిజమై తీరుతుంది అంటున్నారు. ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు టీడీపీకి ఈసారి 160 సీట్లు వస్తాయని చెబుతున్న మాటలను ఆయన కొట్టిపారేశారు.
మీ పార్టీకి 2019 ఎన్నికల్లో ఇరవైకి పైగా సీట్లు వచ్చాయి. ఈసారి నూటా అరవై సీట్లు ఎక్కడ నుంచి వస్తాయి అచ్చెన్నా అంటూ నిలదీశారు, ఎకసెక్కమాడారు. మొత్తానికి చూస్తే క్రిష్ణ దాస్ సవాళ్ళు పొలిటికల్ గా ఆసక్తి గొలుపుతున్నాయి. జగనే 2024లో సీఎం అంటున్నారు. మరి టీడీపీ ఈ సవాల్ ని స్వీకరిస్తుందా లేదా చూడాలి.