బాబూ.. నన్నొదిలిపెట్టు.. కోడెల ఆత్మఘోష

దివంగత నేత, మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి ఈరోజు. ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ వేస్తున్న ట్వీట్లు, చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. పర లోకంలో ఉన్న కోడెల…

దివంగత నేత, మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి ఈరోజు. ఈ సందర్భాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ వేస్తున్న ట్వీట్లు, చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. పర లోకంలో ఉన్న కోడెల ఆత్మ మరోసారి ఘోషించకమానదు. చచ్చిపోయినా కూడా నీ రాజకీయ స్వలాభం కోసం నన్ను మళ్లీ మళ్లీ చంపేస్తావా బాబూ అంటూ కోడెల ఆత్మ ప్రకోపించక మానదు. కోడెల జయంతి సందర్భంగా టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయం అలాగే ఉంది మరి.  

రూపాయి డాక్టర్ గా పల్నాడులో అందరి మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న శివప్రసాద్.. కేవలం వైసీపీ వేధింపుల వల్లే మరణించారని, ఆయన్ని వైసీపీ నేతలు కాకుల్లా పొడుచుకు తిన్నారని, 19 కేసులు పెట్టి వేధించారని, వైసీపీ క్రూర రాజకీయాలకు కోడెల మృతి ఒక ఉదాహరణ అని ట్వీటారు చంద్రబాబు. టీడీపీ నేతలు, అభిమానులు కూడా ఉదయాన్నుంచే కోడెలను ప్రశంసిస్తూ, వైసీపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నాయి.

అసలు కోడెల మరణానికి కారణం ఎవరు? ఆయన స్వయంకృతాపరాథం కాదా? కుటుంబ కలహాల వల్లనే అనే అనుమానం ఉండనే ఉంది. ప్రభుత్వ సొమ్ముతో కొన్న ఫర్నిచర్ ని సొంతానికి వాడుకుంటే దొంగతనం కేసు పెట్టాలా వద్దా? ఇదంతా అయిపోయిన కథ. కేసుల వల్లే కోడెల పోయరంటే.. ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఉరేసుకున్నారని అనుకోవాలి. కుటుంబ కలహాలతో పోయారనుకుంటే.. నేరం ఆయన సంతానానిదే.

కోడెల ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందే.. ఆయన పుత్రరత్నం, పుత్రికా రత్నం.. చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటే బైటకొచ్చాయి. పార్టీ ఘోర పరాభవం, సొంతంగా కోడెల దారుణ పరాజయం, అరాచకాలన్నీ ఒక్కొక్కటే బైటపడటం.. ఇలా అన్నీ కలసి కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. దానికి వైసీపీ నేతలు కారణమెలా అవుతారు.

తప్పుడు కేసులని చంద్రబాబే అంటున్నారు, మరి నిజం నిలకడ మీద తేలే వరకు కోడెల న్యాయపోరాటం చేయాల్సింది కదా, పోనీ చంద్రబాబైనా కోడెల తరపున వకాల్తా పుచ్చుకోవాల్సింది కదా. కోరిన నియోజకవర్గం ఇవ్వకుండా, కేసుల్లో ఇరుక్కున్నాక నెల రోజుల పాటు కనీసం కోడెలకు ఫోన్లో కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా వేధించిన చంద్రబాబు, ఆయన్ని మానసికంగా క్షోభపెట్టారు. పరోక్షంగా కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారు.

మనుషులు బతికున్నప్పుడు వేధించడం, చనిపోయాక వారి పేరు చెప్పుకుని రాజకీయం చేయడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు ఎన్టీఆర్ మరణానికి కారణమైన బాబు, ఇప్పటివరకూ ఆ మహానుభావుడి పేరుని ఎలా వాడుకుంటున్నారో అందరం చూస్తూనే ఉన్నాం. బతికుండగా కోడెలని కూడా అలాగే క్షోభపెట్టి చనిపోయాక ఇలా ప్రతి ఏటా జయంతి, వర్థంతుల సందర్భంగా వారి ఆత్మలను కూడా వదిలిపెట్టకుండా హింసిస్తున్నారు చంద్రబాబు. 

చంద్రబాబు మీద కొత్త పిట్టకథ చెప్పిన బుగ్గన