వారిని వెతుక్కుంటూ కలెక్టర్ బంగ్లా వచ్చేసింది…

కలెక్టర్ ఆఫీస్ కోసం నిత్యం చాలా మంది పనుల మీద వస్తూంటారు. కలెక్టరేట్ అంటేనే ఒక అతి పెద్ద అధికార కేంద్రం. అలాంటి కలెక్టర్ వారు ఉండేది తమ ప్రాంతంలోనే అంటే ఆశ్చర్యంతో పాటు…

కలెక్టర్ ఆఫీస్ కోసం నిత్యం చాలా మంది పనుల మీద వస్తూంటారు. కలెక్టరేట్ అంటేనే ఒక అతి పెద్ద అధికార కేంద్రం. అలాంటి కలెక్టర్ వారు ఉండేది తమ ప్రాంతంలోనే అంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగక మానదు. 

విశాఖ జిల్లా నుంచి వేరు పడి కొత్తగా అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు కాబోతోంది. అనకాపల్లిలో కలెక్టర్ బంగ్లా కోసం ఒక మంచి భవంతిని సిద్ధం చేశారు. అయితే ఆ భవంతి ఎక్కడ ఉంది అన్నదే ఇపుడు చర్చ.

ఈ భవంతి అనకాపల్లిలో బాగా వెనకబడిన ప్రాంతంలో ఉంది. అభివృద్ధికి దూరంగా ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ కలెక్టర్ బంగ్లాను ఎంపిక చేశారు అంటే అభివృద్దే స్వయంగా వారిని వెతుక్కుంటూ వచ్చినట్లుగా ఆ ప్రాంతీయులు భావిస్తున్నారు.

అనకాపల్లిలోని కర్రా వారి వీధిలో కలెక్టరేట్ బంగ్లాను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 12వందల గజాల సువిశాల స్థలంలో అయిదు వందల గజాలలో ఈ భవనం నిర్మించారు. ఇపుడు ఈ భవనానికి కలెక్టర్ బంగ్లా హోదా పట్టబోతోంది.

దాంతో ఈ ప్రాంతానికి కొత్త కళ రాబోతోంది. కలెక్టర్ బంగ్లా రావడం అంటే తమ ప్రాంతం కూడా చాలా తొందరగా అభివృద్ధికి నోచుకుంటుంది అని ఇక్కడ ప్రజలు ఆనందిస్తున్నారు. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటు వెనక ఉన్న అర్ధం పరమార్ధం అభివృద్ధి. అది అనకాపల్లిలో ఈ ప్రాంత వాసులు చాలా తొందరగానే చూసే భాగ్యం అయితే ఉంది.