జాతీయ మీడియాలో కరోనా కల్లోలం

కరోనా దెబ్బ లోకల్ మీడియాపై గట్టిగా పడింది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని చిన్న పత్రికలు ఏకంగా పబ్లిషింగ్ నిలిపివేశాయి. ఇప్పుడీ సెగ నేషనల్ మీడియాను కూడా…

కరోనా దెబ్బ లోకల్ మీడియాపై గట్టిగా పడింది. ఇప్పటికే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. మరికొన్ని చిన్న పత్రికలు ఏకంగా పబ్లిషింగ్ నిలిపివేశాయి. ఇప్పుడీ సెగ నేషనల్ మీడియాను కూడా తాకింది. సాధారణంగా జాతీయ స్థాయి పత్రికలైనా, ఛానెళ్లయినా ఆర్థికంగా పటిష్టంగా ఉంటాయని అంతా అనుకుంటాం. కానీ కరోనా వచ్చి ఆ భ్రమల్ని తొలిగించింది. ఏళ్ల చరిత్ర ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి మిగతా పత్రికలు, ఛానెళ్లు, ఆఖరికి పెద్ద పెద్ద వెబ్ ఛానెల్స్ లో కూడా ఉద్యోగుల తొలిగింపు మొదలైంది.

ఈనాడులో జిల్లా ఎడిషన్లు లేపేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా సండే మ్యాగజైన్ టీమ్ కు ఉద్వాసన పలికినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ దెబ్బతో దాదాపు 20 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు సైతం తమ కొలువులు పోగొట్టుకున్నట్టు సమాచారం. అటు హిందుస్థాన్ టైమ్స్ కూడా తమ సంస్థకు చెందిన మరాఠీ విభాగాన్ని పూర్తిగా మూసేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వాళ్లు ఏకంగా మరాఠీ చీఫ్ ఎడిటర్ ను కూడా ఇంటికి వెళ్లమని చెప్పారట.

కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ లోనే కాకుండా.. ముంబయి మిర్రర్, క్వింట్ సంస్థల్లో కూడా ఉద్యోగులను మే 1 నుంచి విధులకు రావొద్దని చెప్పేశారు. ఈ మేరకు క్వింట్ లో టెక్నాలజీ, ఆటోమొబైల్ సెక్షన్లు క్లోజ్ అయ్యాయి. ఇక ఇండియన్ ఎక్స్ ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్స్ లో ఇప్పటికే జీతాల కోత మొదలైన విషయం తెలిసిందే. మరోవైపు అవుట్ లుక్ అయితే తన ప్రింట్ ఎడిషన్ ను ఆపేసింది.

ఇండియా టుడేలో కూడా 46 మంది రిపోర్టర్లు, ఆరుగురు కెమెరామెన్లు, 17 మంది ప్రొడ్యూసర్లకు మౌఖికంగా చెప్పేశారు. వీళ్లను తక్షణం విధుల నుంచి తప్పుకోమనడం మరింత బాధాకరం. న్యూస్ నేషన్ తన ఇంగ్లిష్ డిజిటల్ ఉద్యోగుల్ని 16 మందిని తొలిగించింది. నయీ దునియా అనే ఉర్దూ ఎడిషన్, స్టార్ ఆఫ్ మైసూర్ అనే ఈవెనింగ్ టాబ్లాయిడ్ కూడా మూతపడ్డాయి

చివరికి ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ కలిగిన పీటీఐలో కూడా 60శాతం మాత్రమే శాలరీస్ విడుదల చేశారనే ప్రచారం నడుస్తోంది. కరోనా దెబ్బ మీడియాపై ఏ రేంజ్ లో పడిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

రమేష్ కుమార్ మా బొచ్చు కూడా పీకలేడు

జగన్ కి చంద్రబాబు కి ఉన్న తేడా అదే