‘తరచూ ఇద్దరం కలిసి వివిధ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లేవాళ్లం. అది చూసి అంతా సోనాక్షి, నేను డేటింగ్లో ఉన్నామని భావించి ఉంటారు. నాకు తెలిసి అందువల్లే ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయి. అయితే అది మాత్రమే కాదు…ఇంకా మా మధ్య ఏముందో కూడా ప్రజలు తెలుసుకోవాలి’…అని బాలీవుడ్ హీరో జహీర్ ఇక్బాల్ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాతో గత కొంత కాలంగా వర్తమాన హీరో జహీర్ ఇక్బాల్ డేటింగ్లో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానమిచ్చాడు. సోనాక్షి, నేను ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వార్తలను చూసి ఇద్దరం నవ్వుకున్నామన్నాడు. ఎందుకంటే తనకిది మొదటి రూమర్ కావడంతో ఎలా స్పందించాలో అర్థం కాలేదన్నాడు.
తమపై వచ్చిన పుకార్ల గురించి సోనాక్షి, తాను కలిసి చర్చించుకున్నట్టు జహీర్ తెలిపాడు. అయితే ఎవరికీ తెలియని విషయం, సోనాక్షికి మాత్రం తెలిసిన విషయమంటూ అతను తన ప్రేమ సంగతిని చెప్పుకొచ్చాడు. తనపై ఇలాంటి పుకార్లు షికార్లు చేసేటప్పటికే…మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
మరొకరితో తాను ప్రేమలో ఉన్న విషయం తెలుసు కాబట్టే సోనాక్షి తమిద్దరిపై వస్తున్న రూమర్స్‌తో కాస్తా ఇబ్బంది పడిందన్నాడు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నానని తెలిపాడు. గత ఏడాది కండల వీరుడు సల్మాన్‌ఖాన్ బ్యానర్లో దర్శకుడు నితిన్ కక్కర్ రూపొందించిన ‘నోట్‌బుక్’ సినిమాతో జహీర్ బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో, తక్కువ సమయంలోనే అందరి దృష్టి ఆకర్షించాడు.